Health Tips: బొగ్గుతో పళ్ళు శుభ్రం చేస్తున్నారా.. అయితే ఇది మీకోసమే!
బొగ్గుతో పళ్ళు శుభ్రం చేసుకునే వారు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు.
- By Anshu Published Date - 11:30 AM, Wed - 18 September 24

భారతదేశంలో చాలామంది ఒకప్పటి నుంచి పళ్ళు శుభ్రం చేసుకోవడానికి బొగ్గును వినియోగిస్తూనే ఉన్నారు. టెక్నాలజీ ఎంత డెవలప్ అయినప్పటికీ ఇప్పటికీ మారుమూల ప్రదేశాలలో పల్లెటూర్లలో పళ్ళు శుభ్రం చేసుకోవడానికి ఈ బొగ్గుని ఉపయోగిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో టూత్ పేస్టు రావడంతో చాలామంది ఈ బొగ్గుని వాడడం తగ్గించేసారు. కానీ చాలా ప్రదేశాలలో ఈ బొగ్గుని ఇప్పటికీ వినియోగిస్తూనే ఉన్నారు. మరి ఇలా వినియోగించడం మంచిదేనా ఇలా బొగ్గుతో పళ్ళు శుభ్రం చేసుకుంటే ఏం జరుగుతుందో ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
బొగ్గుతో పళ్ళు శుభ్రం చేసుకోవడం వల్ల అది మీ దంతాల నుంచి ఎనామిల్ ని కూడా తొలగిస్తుంది. అది మీ దంతాల గట్టి ఉపరితలం దానిని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా అవసరం. పంటి మీద అనామిల్ పోర్ట్ లేకపోతే పళ్ళు కేవటీస్ కి గురవుతాయి. అలాగే సెన్సిటివిటీ ని కూడా కోల్పోతాయి. బొగ్గు రాపిడితో ఉన్నందున మీరు దీనితో చాలా జాగ్రత్తగా ఉండాలి. బొగ్గు యొక్క కొన్ని కణాలు చిగుళ్ళ కింద పేరుకు పోతే వాటిని శాస్త్ర చికిత్స ద్వారా తొలగించవలసి ఉంటుంది. పళ్ళు తోముకోవడం వలన నోటి దుర్వాసన పోయి నోరు చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. అలాగే నోటిలో పీహెచ్ వాల్యూ కూడా ఇది బాగా మెయింటైన్ చేస్తుంది.
పంటి మీద ఉండే గారని పూర్తిగా తొలగించడానికి బొగ్గు ఎంతో ఉపయోగపడుతుంది. అయితే డాక్టర్లు ఏమంటున్నారంటే బొగ్గు తో బ్రష్ చేయటం వలన దంత సమస్యలు పోతాయని, దంతాలు తెల్లగా అవుతాయని సైంటిఫిక్ గా రుజువు అవ్వలేదట.. తమ దగ్గరికి వచ్చిన పేషెంట్స్ కి బొగ్గుని ఎప్పటికీ ప్రిఫర్ చేయము అంటున్నారు వైద్యులు. కాబట్టి బొగ్గుతో పళ్ళు శుభ్రం చేసుకునే వారు తప్పకుండా వైద్యుల సలహా తీసుకోవడం మంచిది అని చెబుతున్నారు.