Cotton Candy: తమిళనాడులో పీచు మిఠాయి విక్రయాలపై నిషేధం
పీచు మిఠాయిలో క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనాలు ఉన్నాయని ఆహార భద్రత అధికారులు నిర్ధారించిన రెండు రోజుల తర్వాత తమిళనాడు ప్రభుత్వం దూది మిఠాయి విక్రయాలపై నిషేధం విధించింది
- Author : Praveen Aluthuru
Date : 17-02-2024 - 4:00 IST
Published By : Hashtagu Telugu Desk
Cotton Candy: పుదిచ్చేరిలో ఇటీవల పీచు మిఠాయి విక్రయాలపై నిషేధం విధించిన విషయం విదితమే. విషపూరిత రసాయనాలు వినియోగించి పీచు మిఠాయి తయారుచేస్తున్నారనే కారణంగా వీటిపై నిషేధం విధించామని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తెలిపారు. కాగా తాజాగా తమిళనాడులోనూ నిషేధం విధించారు.
పీచు మిఠాయిలో క్యాన్సర్‌కు కారణమయ్యే రసాయనాలు ఉన్నాయని ఆహార భద్రత అధికారులు నిర్ధారించిన రెండు రోజుల తర్వాత తమిళనాడు ప్రభుత్వం దూది మిఠాయి విక్రయాలపై నిషేధం విధించింది. ఈ నెల ప్రారంభంలో పుదుచ్చేరి కూడా మిఠాయిలను నిషేధించింది. గిండిలోని గవర్నమెంట్ ఫుడ్ అనాలిసిస్ లాబొరేటరీ ద్వారా కలర్ కాటన్ మిఠాయి నమూనాల విశ్లేషణలో ఒక టెక్స్‌టైల్ డై మరియు రసాయన సమ్మేళనం Rhodomine-B కలిపినట్లు వెల్లడైంది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్, 2006లోని వివిధ సెక్షన్ల కింద నమూనాలు సురక్షితం కానివిగా ప్రకటించబడ్డాయి.
ఇదిలా ఉండగా ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం 2006 ప్రకారం ఈ విషయాన్ని సమీక్షించి కఠిన చర్యలు తీసుకోవాలని ఫుడ్ సేఫ్టీ కమీషనర్ ఫుడ్ సేఫ్టీ అధికారులందరినీ ఆదేశించారు.
Also Read: KGF Star Yash : అర్ధరాత్రి చిన్న కిరాణా షాప్ లో KGF హీరో..