Health Tips: కూల్ డ్రింక్స్, మాంసం ఎక్కువగా తీసుకుంటున్నారా.. అయితే జాగ్రత్త?
టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో మనుషుల జీవనశైలితో పాటు ఆహారపు అలవాట్లు కూడా మారిపోయాయి. తినే
- By Nakshatra Published Date - 07:30 AM, Tue - 14 March 23

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో మనుషుల జీవనశైలితో పాటు ఆహారపు అలవాట్లు కూడా మారిపోయాయి. తినే విషయంలో కూడా కొత్త కొత్త ఫుడ్ లను కనిపెట్టడంతో పాటు కొత్త కొత్త కాంబినేషన్ లో కూడా కనిపెట్టి వాటిని తిని లేనిపోని అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఇకపోతే ఈ మధ్యకాలంలో చాలామంది నేర్చుకున్న ఒక చెడ్డ అలవాటు మాంసం తింటూ కూల్ డ్రింక్ తాగుతూ ఉంటారు. ఇదేంటి అంటే ట్రెండ్ అని ఫ్యాషన్ అని లేనిపోని పేర్లు చెప్పి గొప్పలకు పోయి అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే కొందరు కూల్ డ్రింక్ మాంసం కాంబినేషన్ తిని జీర్ణం చేసుకుంటే మరికొందరు మాత్రం తిన్నవి జీర్ణం అవ్వక గ్యాస్ ట్రబుల్స్ తో బాధపడుతూ ఉంటారు.
ఇలా మాంసంతో పాటు కూల్ డ్రింక్ ని తాగడం మంచిదేనా ఈ విషయంపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇలా చికెన్ లేదా మటన్ చాపలతో పాటు కూల్ డ్రింక్ తాగడం వల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ కాంబినేషన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల పేగుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదే విషయంపై నిపుణులు ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు జరిపి కొన్ని రకాల విషయాలను వెల్లడించారు. అతిగా మాంసం,అధిక కెలోరీలు కలిగిన శీతల పానీయాలు తాగేవారిలో పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నట్లు వారు వెల్లడించారు. అలాగే శుద్ధి చేసిన ధాన్యాలను అతిగా తీసుకున్న వారిలో కూడా ఈ లక్షణాలు కనిపించినట్లు తెలిపారు.
అయితే మాంసం, కూల్ డ్రింక్స్ అధికంగా తీసుకుంటే డేంజర్ వారు వెల్లడించారు. కాబట్టిఈ రెండు కాంబినేషన్లను అసలు తీసుకోకపోవడం మంచిది. స్నేహితులతో కలిసినప్పుడు వారి మీద పోటా పోటీలు పెట్టుకుని మరీ కేజీలకు కేజీలు కబాబులు లాగించేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఆ క్షణంలో మీరు గెలుపొందిన ఆ తర్వాత ఆరోగ్యం విషయంలో ఓడిపోవాల్సి వస్తుంది. అనవసరంగా లేని పోని రోగాలను కొనితెచ్చుకున్నట్లు అవుతుంది.

Related News

Ramadan 2023: రంజాన్ ఉపవాస సమయంలో మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే.
పవిత్ర రంజాన్ (Ramadan) ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఎంతో నిష్టతో ఈ రంజాన్ ఉపవాసాన్ని(ramadan fasting) పాటిస్తుంటారు. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇతర ముస్లిం దేశాలలో మార్చి 21 సాయంత్రం చంద్రుడు కనిపించినప్పుడు రంజాన్ ఈ సంవత్సరం మార్చి 22 న ప్రారంభమైంది.