Super Foods: పరగడుపున పండ్లు ,ఎండుద్రాక్ష తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?
ఆరోగ్యంగా ఉండాలి అంటే సరైన పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. అయితే చాలామందికి ఎటువంటి ఆహారాలు తినాలో తెలియక తికమక పడుతూ ఉంటారు. ము
- By Anshu Published Date - 08:20 PM, Sun - 25 June 23

ఆరోగ్యంగా ఉండాలి అంటే సరైన పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. అయితే చాలామందికి ఎటువంటి ఆహారాలు తినాలో తెలియక తికమక పడుతూ ఉంటారు. ముఖ్యంగా కొంతమంది పరగడుపున కొన్ని రకాల పండ్లు ఆహారాలు డ్రైఫ్రూట్స్ లాంటివి తీసుకుంటూ ఉంటారు. అయితే మరి పరగడుపున అలాంటివి తీసుకోవచ్చా లేదా అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఉదయాన్నే నిద్రలేచి ఖాళీ కడుపుతో అరటిపండు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా గ్యాస్, కడుపు నొప్పి, అజీర్ణం త్రేనుపు వంటి సమస్యలతో బాధపడేవారు రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటిపండు తినవచ్చు.
అరటిపండు ఎలాంటి ఆరోగ్య సమస్యలనైనా దూరం చేస్తుంది. నట్స్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే బెస్ట్ బెనిఫిట్స్ ఇవ్వాలంటే ఏ సమయంలో వినియోగిస్తారో తెలుసుకోవాలి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొన్ని గింజలను తినడం వల్ల మీ ఆరోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. మధుమేహం, దృష్టి సమస్యలు, పొడి చర్మం ఇతర సమస్యలతో బాధపడేవారు తప్పనిసరిగా ఖాళీ కడుపుతో గింజలను తీసుకోవాలి. ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే ఎండుద్రాక్షలో వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాల ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉంటే ఎండుద్రాక్ష తినవచ్చు.
అలాగే PMS, గ్యాస్ మూడ్ స్వింగ్స్‌తో బాధపడేవారు కొన్ని నానబెట్టిన ఎండుద్రాక్షలను ఖాళీ కడుపుతో తినవచ్చు. ఇది రుతుక్రమ సమస్యలను నయం చేయడంలో కూడా సహాయపడుతుంది. అయితే ఋతుస్రావం ప్రారంభానికి 10 రోజుల ముందు తీసుకోండి. వీటిని తిన్న తర్వాత అల్పాహారం 10 నుంచి ఒక 15 నిమిషాల తర్వాత తినడం మంచిది. ఉదయాన్నే యోగా, జిమ్ వర్కౌట్స్ చేసేవాళ్లు వర్కౌట్స్ కి ముందే అనగా అరగంట ముందు ఇలాంటి ఆహార పదార్థాలు తినవచ్చు. అలాగే వర్కౌట్స్ అయిపోయాక అల్పాహారాన్ని తీసుకోవచ్చు.