Children: పిల్లలకు మలబద్ధకం రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?
పిల్లలు మలబద్ధకం సమస్య నుంచి బయట పడాలంటే ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే అంటున్నారు.
- By Anshu Published Date - 02:00 PM, Tue - 20 August 24

ఇటీవల కాలంలో చాలా మంది బాధపడుతున్న సమస్యల్లో మలబద్దకం సమస్య కూడా ఒకటి. ఈ మల బద్ధకం సమస్య కారణంగా చాలామంది ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. చిన్నపిల్లలు కూడా ఈ మలబద్ధకం ఇబ్బంది పడుతున్నారు. అయితే నిజానికి మలబద్ధకానికి ఎన్నో సమస్యలు కారణం కావచ్చు. మీ పిల్లలు వారానికి మూడు రోజులు మాత్రమే మోషన్ కు వెళితే.. వారు మలబద్దకం సమస్యతో బాధపడుతున్నట్టే అర్ధం. అంతేకాదు పిల్లలను మలవిసర్జన సమయంలో నొప్పిని కూడా అనుభవిస్తారు.
మరి పిల్లలు మలబద్దకం సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను పిల్లలకు ఇస్తే వారు మలబద్దకం నుంచి బయటపడతారు. ఫైబర్ ఫుడ్ పిల్లల్లో మలబద్దకాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. అందుకే వారి ఆహారంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను చేర్చాలి. ఇందుకోసం పిల్లలకి యాపిల్స్, పియర్స్, బెర్రీస్, బ్రొకోలీ, క్యారెట్లు, బచ్చలికూర మొదలైన వాటిలో ఫైబర్ మెండుగా ఉంటుంది, ఈ ఆహార పదార్థాలను పిల్లలకు అలవాటు చేయాలి. అలాగే ఎండుద్రాక్ష నీరు పిల్లలలో మలబద్దకాన్ని సమర్థవంతంగా తొలగించడానికి బాగా సహాయపడుతుంది.
ఇందులో సోర్బిటాల్ అనే సహజ పోషక లక్షణాలతో కూడిన చక్కెర ఆల్కహాల్ ఉంటుంది. అలాగే ఫైబర్ తో పాటుగా జీర్ణక్రియకు సహాయపడే ఇతర పోషకాలు కూడా ఉంటాయి. ఎండుద్రాక్ష నీటిని రోజూ పరగడుపున తాగడం వల్ల మలబద్దకం రాకపోవడంతో పాటుగా ఎన్నో రకాల జీర్ణ సమస్యలు కూడా దూరమవుతాయి. అదేవిధంగా అవిసె గింజలు, చియా విత్తనాలలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా లభిస్తుంది. అవిసె గింజలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కూడా ఉంటాయి. ఈ అవిసె గింజలను స్మూతీ లేదా సలాడ్లలో చేర్చవచ్చు.
వీటిని పిల్లలకు తినడం అలవాటు చూపించడం వల్ల మలబద్ధకం సమస్యల నుండి ఈజీగా బయటపడవచ్చు. అలాగే పిల్లల ఆహారం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో, నీళ్ల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పిల్లలను సరిగ్గా నీరు తాగకపోయినా మలబద్దకం బారిన పడతారు. అందుకే మీ పిల్లలు నీటిని పుష్కలంగా తాగేలా చూడాలి. నీరు మలబద్ధకం సమస్య నుంచి బయటపడటానికి సహాయపడుతుంది..
note: ఈ ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే.