Soaked Walnuts Benefits: ప్రతిరోజు నానబెట్టిన 2 వాల్‌నట్స్ తినడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు?
వాల్ నట్స్ వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. రుచి అద్భుతంగా ఉంచడంతోపాటు ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా చేక
- By Anshu Published Date - 09:00 PM, Tue - 27 June 23

వాల్‌నట్స్ వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. రుచి అద్భుతంగా ఉంచడంతోపాటు ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా చేకూరుస్తాయి. ప్రతిరోజూ కొన్ని గింజలను తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. అలాగే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అయితే గింజలను పచ్చిగా తినడం కంటే నీటిలో నానబెట్టడం వల్ల ఆరోగ్యానికి ఇంకా మంచిది.ఈ గింజలను నీటిలో నానబెట్టి తినడం వల్ల తొందరగా జీర్ణమవుతాయి. చాలా మంది బాదం పప్పు తింటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే మెదడు ఆకారంలో ఉండే వాల్‌నట్స్‌లో బాదంలో కంటే ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.
ఈ వాల్‌నట్‌లను నీటిలో నానబెట్టడం మంచిది. ఇది ఫైటిక్ యాసిడ్ మొత్తాన్ని తగ్గిస్తుంది. శరీరం సులభంగా గ్రహించబడుతుంది. బలహీనమైన పేగులు ఉన్నవారు వాల్‌నట్‌లను పచ్చిగా తింటే జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తాయి. వాల్‌నట్ లి పోషకాలు, అధిక కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వు, ఫైబర్, విటమిన్స్, కాల్షియం ఐరన్, పొటాషియం వంటి అద్భుతమైన పోషకాలు ఇందులో ఉంటాయి. ఇవి బరువు తగ్గాలి అనుకున్న వారికి ఎంతో బాగా ఉపయోగపడతాయి. డయాబెటిస్ పేషెంట్లు ప్రతిరోజు నానబెట్టిన వాల్ నట్స్ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కర స్థాయి నియంత్రణలో ఉంటుంది. ముఖ్యంగా టైప్-2 మధుమేహ వ్యాధిగ్రస్తులు నానబెట్టిన వాల్ నట్స్ తినడం చాలా మంచిది.
వాల్‌నట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించే కొన్ని సమ్మేళనాలు ఉంటాయి. ముఖ్యంగా నీళ్లలో నానబెట్టిన వాల్ నట్స్ ను రోజూ తింటే పెద్దపేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. అలాగే నీటిలో నానబెట్టిన వాల్ నట్స్ తింటే బరువు తగ్గవచ్చు. వాల్‌నట్స్‌లో కాల్షియం, పొటాషియం, ఐరన్, కాపర్ జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలోని జీవక్రియను పెంచి శరీరంలోని అదనపు కొవ్వులను కరిగించడంలో సహాయపడతాయి. అదేవిధంగా వాల్‌నట్‌లను తిన్నప్పుడు, ఇది చాలా కాలం పాటు ఆకలిగా అనిపించకుండా చేస్తుంది. రాత్రి సమయంలో సరిగా నిద్ర పట్టక చాలామంది బాధపడుతూ ఉంటారు. అటువంటివారు ప్రతి రోజూ 2 నానబెట్టిన వాల్ నట్స్ తినాలి. అందువల్ల, వాల్‌నట్‌లోని మెలటోనిన్ మంచి ప్రశాంతమైన నిద్రను పొందడంలో సహాయపడుతుంది. మరి ఈ వాల్ నట్స్ ను ఉదయం, రాత్రి తింటే మంచి నిద్ర వస్తుంది. వాల్‌నట్స్‌లోని కొన్ని పదార్థాలు ఎముకలు దంతాలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి.