Sleep After Bath: రాత్రిళ్ళు స్నానం చేసిన వెంటనే నిద్రపోతున్నారా.. అయితే మీరు ఈ సమస్యల బారిన పడటం ఖాయం!
Sleep After Bath: రాత్రిళ్ళు స్నానం చేసిన వెంటనే నిద్రపోయే అలవాటు ఉన్నవారు వెంటనే ఆ అలవాటును మానుకోవాలని లేదంటే సమస్యలు తప్పవు అని చెబుతున్నారు.
- By Anshu Published Date - 04:00 PM, Mon - 6 October 25

Sleep After Bath: చాలా మందికి రాత్రిళ్ళు నిద్రపోయే ముందు స్నానం చేసే అలవాటు ఉంటుంది. పగలు సమయంలో బాగా కష్టపడి రాత్రి హాయిగా నిద్ర పడుతుందని స్నానం చేసి పడుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వారికి చాలా రిలాక్స్ గా అనిపిస్తుందని, మంచి నిద్ర వస్తుందని చాలా మంది భావిస్తూ ఉంటారు. అందుకే రోజంతా ఎలా ఉన్నా సరే రాత్రి పడుకునే ముందు కచ్చితంగా స్నానం చేస్తూ ఉంటారు. అయితే మీకు కూడా రాత్రిళ్ళు అలా నిద్రపోయే ముందు స్నానం చేసి అలవాటు ఉందా? దానిని వెంటనే మానుకోవాలని చెబుతున్నారు. ఎందుకో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కాగా రాత్రి సమయంలో శరీర ఉష్ణోగ్రత సహజంగా తగ్గుతుంది. దీనివల్ల మెదడు నిద్రపోవడానికి సంకేతాన్ని పంపుతుందని, అయితే స్నానం చేసిన తర్వాత శరీర ఉష్ణోగ్రత పెరుగుతుందని చెబుతున్నారు. దీనివల్ల నిద్రపోవడంలో ఇబ్బంది కలగవచ్చట. అంతేకాకుండా స్నానం చేసి నిద్రపోవడం వల్ల శరీరానికి అనేక రకాల నష్టాలు కలుగుతాయని చెబుతున్నారు. స్నానం చేసిన వెంటనే నిద్రపోవడం వల్ల మెదడు బలహీనపడుతుందట. అలా అని స్నానం చేసిన వెంటనే నిద్రపోవడం వల్ల మెదడు బలహీనపడుతుందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని చెబుతున్నారు. కానీ దీనివల్ల మరికొన్ని నష్టాలు ఉండవచ్చట.
కాబట్టి రాత్రి నిద్రకు ముందు స్నానం చేయడం మానేయాలని చెబుతున్నారు. లేదంటే తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందట. రాత్రుళ్లు తలస్నానం చేసి పడుకుంటే ఆ తడితో నిద్రపోవడం వల్ల దిండు లేదా మంచంపై బ్యాక్టీరియా పెరగవచ్చని చెబుతున్నారు. ఇది స్కాల్ప్ దెబ్బతినేలా చేస్తుందట. దీనివల్ల జుట్టు రాలడానికి, చుండ్రు సమస్యకు దారితీస్తుందని చెబుతున్నారు. రాత్రి నిద్రను చాలామంది వేడి నీటితో చేస్తారని, అయితే ఇలా వేడి నీటితో స్నానం చేయడం వల్ల కళ్లల్లో తేమ తగ్గుతుందని చెబుతున్నారు. దీనివల్ల కళ్లు ఎర్రబడి దురద వస్తాయట.
దీని కారణంగా కళ్లకు సంబంధించిన ఇతర సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు. రాత్రిపూట స్నానం చేయడం వల్ల నిద్ర చెడిపోవచ్చట. రోజంతా అలసట తొలగిపోదని, నిద్రకు కూడా ఆటంకం కలగడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయని చెబుతున్నారు. ఇది మెదడుపై కూడా ప్రభావం చూపుతుందని, ఒత్తిడి డిప్రెషన్ పెరుగుతుందని చెబుతున్నారు. అలాగే రాత్రి భోజనం చేసిన తర్వాత స్నానం చేయడం వల్ల బరువు పెరగవచ్చని చెబుతున్నారు. ఇది ఫిట్‌నెస్‌ను దెబ్బతీస్తుందట. అలాగే అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులు కూడా వస్తాయని చెబుతున్నారు..