Superfood: అన్నీ మితంగా తింటేనే ఆరోగ్యంగా ఉంటాం.. తాజా అధ్యయనం!
రెడ్ వైన్ గుండెకు మంచిదని వినే ఉంటారు. బ్లూబెర్రీస్ సూపర్ ఫుడ్ ఇది కూడా వినే ఉంటారు.
- By Hashtag U Published Date - 06:45 AM, Fri - 27 May 22
రెడ్ వైన్ గుండెకు మంచిదని వినే ఉంటారు. బ్లూబెర్రీస్ సూపర్ ఫుడ్ ఇది కూడా వినే ఉంటారు. ఇలా చాలారకాల సూచనలు తరచుగా వింటుంటాం. మరి నిజానికి వాటితో ఎంత ప్రయోజనం లభిస్తుంది? ఈ సందేహం రాక మానదు. అందుకే ఓ శాస్త్రవేత్తల బృందం ఈ అంశంపై పరిశోధన నిర్వహించింది.
ఆరోగ్యంపై మంచి లేదా చెడు ప్రభావాన్ని చూపించే ఆహార పదార్థాల్లోని బయోయాక్టివ్స్ పై శాస్త్రవేత్తలు అధ్యయనంలో దృష్టి సారించారు. విటమిన్స్, మినరల్స్ వలే కాకుండా, బయో యాక్టివ్స్ అయిన ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్ ఫ్లావనాల్స్ అనేవి మనుగడ సాగించడానికి తప్పసరి కాదు. ఒక ఆహారంలో ఎన్నో కాంపౌండ్స్ ఉంటాయి. ఉదాహరణకు ఒక కప్పు కాఫీలో ఉండే ఫెనోలిక్ యాసిడ్స్ గుండె ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపిస్తుంటాయి. కానీ కాఫీలో ఉండే ఇతర కాంపౌండ్స్ కొలెస్టరాల్ ను పెంచుతాయని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.
దీంతో పరిశోధకులు ఆహార పదార్థాల్లో ఉండే పలు భాగాలు ఆరోగ్యంపై చూపించే ప్రభావాన్ని తెలుసుకోవడంపై ద్రుష్టిపెట్టాయి. మెడిటేరియన్ డైట్, నార్డిక్ డైట్ దీర్ఘకాలంపాటు ఆరోగ్యంగా ఉంచుతాయని అర్థం చేసుకోవాలి. ఆహార పదార్థాల్లోని కాంపౌండ్ల గురించి మరింత తెలుసుకోవాలనుకున్నప్పుడు అందులోని లోపాలు బయటపడ్డాయి. అద్బుతమైన ఆహారం అనుకునేవి కూడా కేవలం చిన్న భాగాలేనని పరిశోధకులు అంటున్నారు.
అయితే ఆహారానికి మితం అవసరం. గ్రీన్ టీ ఒకటి రెండు సార్లు తీసుకుంటే ఎలాంటి నష్టం లేదు. కానీ ఎక్కువసార్లు తీసుకుంటే అందులోని ఫ్లావనాల్స్ కాలేయం దెబ్బతినడానికి దారి తీస్తుంది. కాబట్టి ఈ తరహా ఆహార పదార్థాల నుంచి మెరుగైన ప్రయోజనాలు పొందేందుకు వీలుగా సరైన మోతాదు గుర్తించే పనిలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. కాగా ప్రతి ఒక్కరూ పలు రకాల ఆహార పదార్థాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలని చెబుతున్నారు. అందులో కనీస పోషకాలు, ఫైబర్, బయోయాక్టివ్స్ ఉండాలని..వాటితో ఆరోగ్యం కూడా ఉండొచ్చని వెల్లడించారు.
Related News
Benefits Of Kundru: దొండకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. దొండకాయలో పుష్కలంగా ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణ ప్రక్రియను సజావుగా అమలు చేయడంలో సహాయపడుతుంది. ఇది మలబద్ధకం, అజీర్ణం మరియు అపానవాయువు వంటి సమస్యలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది.