Dry Fruits: డ్రై ఫ్రూట్స్ తింటే నిజంగానే బరువు పెరుగుతారా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే!
డ్రై ఫ్రూట్స్ తినేవాళ్లు తప్పకుండా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
- By Anshu Published Date - 04:30 PM, Tue - 10 September 24

డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది అన్న విషయం మనందరికీ తెలిసిందే. వీటిని చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడి తింటూ ఉంటారు.. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. అలాగే శరీరానికి కావాల్సిన పోషకాలు విటమిన్లు కూడా అందుతాయి. అందుకే వీటిని ఆహారంలో భాగం చేసుకోమని నిపుణులు కూడా చెబుతుంటారు. అయితే చాలామంది డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే బరువు పెరుగుతారని అనుకుంటూ ఉంటారు. మరి నిజంగానే డ్రైఫ్రూట్స్ తింటే బరువు పెరుగుతారా ఈ విషయం గురించి నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మనం తీసుకునే ఆహార పదార్థం ఏదైనా సరే అధికంగా తీసుకుంటే మాత్రం సమస్యలు తప్పవు అని చెబుతుంటారు వైద్యులు. ఎటువంటి పదార్థం అయినా సరే ఎక్కువగా తీసుకుంటే సమస్యలు తప్పవట. అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ కూడా మంచిదే కదా అని ఎక్కువగా తీసుకోవడం అసలు మంచిది కాదని చెబుతున్నారు. డ్రై ఫ్రూట్స్ ని తక్కువ మొత్తంలో తింటే ఆరోగ్యంగా ఉంటారట. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుందని చెబుతున్నారు. కానీ, అదే డ్రై ఫ్రూట్స్ ని ఎక్కువగా తింటేే, బరువు అతిగా పెరిగిపోయే ప్రమాదం ఉంది. డ్రై ఫ్రూట్స్ లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అవి, బరువు పెంచడానికి కారణం అవుతాయని చెబుతున్నారు. డ్రై ఫ్రూట్స్ అతిగా తినడం వల్ల, జీర్ణ సమస్యలు కూడా తలెత్తుతాయట. డ్రై ఫ్రూట్స్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.
ఫైబర్ తక్కువగా తీసుకుంటే, ఫుడ్ అరగడానికి కూడా సహాయపడుతుంది. కానీ, అదే ఫైబర్ ఎక్కువగా తీసుకుంటే జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. అందుకే డ్రై ఫ్రూట్స్ ని ఎంత మోతాదులో తినాలి అనే విషయం తెలుసుకోవాలి. ముందుగా పిస్తా సంగతి చూద్దాము ఇందులో మిగిలిన డ్రై ఫ్రూట్స్ కంటే ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది వీటిని రోజుకి 20 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదట. అలాగే జీడిపప్పు తినటం వల్ల పెద్ద ఆసియంలో రాళ్లు ఏర్పడకుండా నివారించవచ్చు అలా అని వారానికి 28 జీడిపప్పులు కన్నా ఎక్కువ తినటం మంచిది కాదు అంటున్నారు. ఎండు ద్రాక్షని ఎంత మోతాదులో తిన్నా పర్వాలేదు ఇందులో విటమిన్ బి పొటాషియం ఐరన్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి రోజుకి గుప్పెడు ఎండు ద్రాక్ష తినవచ్చట.
వాల్ నట్స్ రోజుకు కేవలం రెండు మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు. అలాగే బాదం గింజలు రోజుకి నాలుగు నుంచి ఏడు గింజల వరకు తినటం ఆరోగ్యానికి మంచిది. అలాగే ఖర్జూరం ఇది తినటానికి చాలా టేస్టీగా ఉంటుంది.ఇందులో ప్రాక్టోజ్ రిచ్ గా ఉంటుంది మెటబాలిజం స్థాయి చురుగ్గా ఉండడానికి ఖర్జూరం ఉపయోగపడుతుంది. అలాంటి ఈ ఖర్జూరాన్ని రోజుకి ఒకటి లేదా రెండు తీసుకుంటే సరిపోతుంది. అయితే నట్స్ ని నేరుగా కాకుండా నానబెట్టి తినటం వల్ల మరింత ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.