HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Side Effects Of Eating Eggs In An Empty Stomach

Egg: ఖాళీ కడుపుతో కోడిగుడ్లు తింటున్నారా.. అయితే జాగ్రత్త మీరు డైంజర్ లో పడ్డట్టే!

ఖాళీ కడుపుతో కోడి గుడ్లు తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని దీని వల్ల అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

  • Author : Anshu Date : 08-02-2025 - 3:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Egg
Egg

కోడిగుడ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. కోడిగుడ్లను తరచుగా తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు. అలాగే ఎన్నో రకాల సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు. చాలామంది కోడిగుడ్లను ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో తీసుకుంటూ ఉంటారు. ఆమ్లెట్ రూపంలో, ఫ్రై రూపంలో, కర్రీ రూపంలో, బిర్యానీ రూపంలో, ఉడకబెట్టి రకరకాలుగా తింటూ ఉంటారు. ఎక్కువ శాతం మంది జిమ్ కి వెళ్లేవారు బరువు తగ్గాలి అనుకున్న వారు ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ గా కోడిగుడ్లను తింటూ ఉంటారు. అయితే కొంతమంది కాళీ కడుపుతో గుడ్లన తినడం మంచిది కాదు అంటున్నారు.

మరి ఈ విషయం గురించి వైద్యులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గుడ్డులో విటమిన్ ఎ, డి, ఇ, బి12, రిబోఫ్లేవిన్, ఫోలేట్, ఐరన్, సెలీనియం వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. గుడ్లు తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. కానీ ఈ గుడ్లను తప్పుడు మార్గంలో తీసుకుంటే, అవి ఆరోగ్యానికి ప్రయోజనం చేకూర్చే బదులు హాని కలిగించడం ప్రారంభిస్తాయట. కొంతమంది ఉదయం పనికి చేరుకోవాలనే తొందరలో అల్పాహారంగా ఖాళీ కడుపుతో గుడ్లు తింటారు. కాన ఇలా చేయడం సరైనది కాదట. ఖాళీ కడుపుతో గుడ్లు తినడం వల్ల కొంతమందికి ఉబ్బరం, గ్యాస్, కడుపు తిమ్మిరి వంటి జీర్ణ సమస్యలు వస్తాయట.

జీర్ణవ్యవస్థ ఇప్పటికే బలహీనంగా ఉన్నవారిలో ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయట. కొంతమందికి గుడ్లు అలెర్జీ కలిగి ఉంటారట. అలాంటి వారు పొరపాటున కూడా ఖాళీ కడుపుతో గుడ్లు తినకూడదు. అలాంటి పొరపాటు చేయడం వల్ల, చర్మంపై తామర, శరీరంలో వాపు, వికారం, వాంతులు లేదా విరేచనాలు వంటి జీర్ణశయాంతర సమస్యలతో పాటు శ్వాస సమస్యలు కూడా వస్తాయట. ఉదయం ఖాళీ కడుపుతో పచ్చి లేదా సగం ఉడికించిన గుడ్లు తినడం ద్వారా ఫుడ్ పాయిజనింగ్ సమస్య కూడా తలెత్తే ప్రమాదం ఉందట. అలాంటి గుడ్లు తినడం వల్ల సాల్మొనెల్లా బ్యాక్టీరియా వచ్చే ప్రమాదం ఉందట. ఈ బాక్టీరియా అతిసారం, జ్వరం, కడుపు నొప్పి వంటి లక్షణాలను కలిగిస్తుందని చెబుతున్నారు. గుడ్లలో ఉండే మంచి మొత్తంలో ప్రోటీన్ కొన్నిసార్లు కొన్ని యాంటీ బయాటిక్స్ ప్రభావాన్ని తగ్గిస్తుందట. అటువంటి పరిస్థితిలో ఏదైనా యాంటీ బయాటిక్స్ తీసుకునేటప్పుడు మీరు వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే మీ ఆహారంలో గుడ్లను చేర్చుకోవాలని చెబుతున్నారు. ఉదయం అల్పాహారంలో గుడ్లు మాత్రమే తీసుకోవడం వల్ల శరీరంలో ఇతర ముఖ్యమైన పోషకాల లోపం ఏర్పడుతుందట. ఉదయం మీ అల్పాహారంలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, కార్బోహైడ్రేట్లు సమతుల్య పరిమాణంలో సమృద్ధిగా ఉండే వాటిని మాత్రమే తినాలని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • eating egg
  • egg
  • Empty stomach
  • health tips

Related News

Heart Attack Anger

కేవలం 8 నిమిషాల కోపంతో గుండెపోటు

Heart Attack  ఆవేశం అనర్థదాయకమని పెద్దలు చెప్పే మాట అక్షరాలా నిజమని తాజా అధ్యయనం మరోసారి నిరూపించింది. కేవలం కొద్దిసేపు వచ్చే కోపం కూడా రక్తనాళాలపై పెను ప్రభావం చూపుతుందని, గుండెపోటు లేదా పక్షవాతం బారిన పడే ప్రమాదాన్ని పెంచుతుందని తేల్చింది. అమెరికాలోని వివిధ సంస్థలకు చెందిన నిపుణులు సుమారు 300 మంది ఆరోగ్యవంతులపై ఈ పరిశోధన చేశారు. వారికి గతంలో జరిగిన ఒక కోపంతో కూడిన సంఘటనను 8

  • Amla Honey Benefits

    ఆరోగ్య సిరి..తేనెలో ఉసిరికాయ‌ల‌ను నాన‌బెట్టి తింటే క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఇవే..!

  • I-Pill Side Effects

    ఐ-పిల్ వాడుతున్నారా? అయితే దుష్ప్రభావాలివే!!

  • Health Tips

    నాలుక కింద ఉప్పు ఉంచితే ఏమవుతుందో తెలుసా?

Latest News

  • టీ20 వరల్డ్ కప్ 2026.. నెదర్లాండ్స్‌పై భారత్ ఘనవిజయం!

  • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

  • భార‌త్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌.. క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా?!

  • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

  • తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

Trending News

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

    • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

    • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd