Rice: బరువు తగ్గాలి అంటే అన్నం తినడం మానేయాలా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?
చాలామంది అన్నం తినడం మానేస్తే బరువు తగ్గుతామని భోజనం చేయకుండా పస్తులు ఉంటారు. మరి నిజంగానే బరువు తగ్గాలి అంటే అన్నం తినడం మానేయాలా? ఈ విషయం గురించి వైద్యులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం...
- By Anshu Published Date - 03:20 PM, Tue - 6 May 25

బరువు తగ్గాలి అనుకున్న వారు చాలామంది చేసే అతిపెద్ద తప్పు డైటింగ్ ఫాలో అవ్వడం. వైద్యుల సలహా మేరకు డైటింగ్ ఫాలో అయితే తప్పులేదు కానీ చాలామంది స్వతహాగా సొంతంగా నిర్ణయాలు తీసుకుని బరువు తగ్గడం కోసం అన్నం తినడం మానేయడం లాంటిది చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చాలామంది చేసే తప్పు అన్నం తినడం మానేయడం. అన్నం తినడం మానేస్తే చాలు బరువు తగ్గిపోతారని చాలామంది అనుకుంటూ అన్నాన్ని చాలా వరకు దూరంగా పెట్టేస్తూ ఉంటారు.
మరి ఈ విషయంలో నిజానిజాలు ఏంటో, వైద్యులు ఈ విషయం గురించి ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. డయాబెటిస్ లేదా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నవారు అధిక గ్లైసిమిక్ సూచిక కారణంగా తెల్ల బియ్యం ఎక్కువగా తీసుకోకూడదని చెబుతున్నారు. బియ్యం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుందట. ఒక కప్పు బియ్యం లో 54.3 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయని చెబుతున్నారు. అయితే డైట్ ఫాలో అయ్యే వాళ్ళు అన్నం తినవచ్చు కానీ చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలని చెబుతున్నారు.
తెల్ల బియ్యం వద్దు అనుకున్న వారు బ్రౌన్ రైస్ ను డైట్ లో చేర్చుకోవడం మంచిదని చెబుతున్నారు. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయట. బ్రౌన్ రైస్ లో యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, వంటివి పుష్కలంగా లభిస్తాయని చెబుతున్నారు. అలాగే అన్నం తక్కువ కూర ఎక్కువ తినాలని చెబుతున్నారు. ఈ విధంగా చేయడం వల్ల శరీరంలోకి అధిక కేలరీలు వెళ్లకుండా ఉంటాయట. ఫైబర్ ఉన్న ఆహారాలతో పాటు అన్నం కూడా తీసుకోవాలని చెబుతున్నారు. అంతేకానీ అన్నం పూర్తిగా మానేస్తే బరువు తగ్గుతారు అనుకోవడం కేవలం పొరపాటు మాత్రమే అని చెబుతున్నారు.