Couples: భార్యభర్తల్లో పెరుగుతున్న బీపీ, లేటెస్ట్ సర్వేలో షాకింగ్ విషయాలు
- By Balu J Published Date - 04:54 PM, Tue - 12 December 23
Couples: గజిబిజీ లైఫ్ కారణంగా భార్యభర్తలు బీపీ సమస్యతో బాధపడుతున్నారట. ఎక్కువ మంది వ్యక్తులు రక్తపోటును ఆస్పత్రుల పాలవుతున్నట్టు వివిధ సర్వేలు కూడా హెచ్చరిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంటల్లో ఎక్కువ శాతం మందికి బీపీ ఉందని ఓ అధ్యయనంలో స్పష్టమైంది. దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే.. జంటలో ఒక వ్యక్తికి బీపీ ఉంటే, మరొకరిపై ఎఫెక్ట్ పడుతుందట. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్‌లో ఈ విషయం స్పష్టంమైంది.
జంటలో ఒకరికి బిపి వస్తే మరొకరికి కూడా అది వస్తుందని పేర్కొంది. సాధారణంగా, మధ్య వయస్కులు, వృద్ధులలో BP ఉంటుందని, కానీ భార్య, భర్తకు కూడా BP ఉందని అధ్యయనం కనుగొంది. US, ఇంగ్లాండ్, చైనా మరియు భారతదేశంలోని చాలా జంటల ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారని స్పష్టమైంది కూడా. చైనా, భారతదేశంలో ఈ సమస్య ఎక్కువగా ఉందని , ఈ దేశాలలోని కుటుంబ నిర్మాణమే దీనికి కారణమని నిపుణులు చెప్పారు.