HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Reasons Why Cucumbers Are Beneficial In Summers

Cucumber: వేసవికాలంలో కీరదోసకాయలు ఎందుకు తినాలి.. వాటి వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మీకు తెలుసా?

వేసవికాలంలో కీరదోసకాయలను ఎందుకు తినాలి, తింటే ఏం జరుగుతుందో ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Author : Anshu Date : 21-03-2025 - 6:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Cucumber
Cucumber

కీర దోసకాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. దోసకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా సమ్మర్ లో ఈ కీర దోసకాయను ఎక్కువగా తింటూ ఉంటారు. ఇంతకీ సమ్మర్ లోనే కీర దోసకాయను ఎందుకు ఎక్కువగా తినాలి. దీని వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కీరక దోసకాయలు నీటి శాతం ఎక్కువగా ఉంటుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. వేసవి కాలంలో కీర దోసకాయ తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన నీటి శాతం అందుతుంది. అలాగే కీరదోసకాయలను తింటే బాడీ డీహైడ్రేట్ అయ్యే అవకాశం కూడా ఉండదట. దోసకాయలు కేవలం ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా అందాన్ని కూడా కాపాడతాయని చెబుతున్నారు. అలాగే ఈ కీర దోసకాయలు మిమ్మల్ని చల్లగా కూడా ఉంచుతాయట. కీరదోసకాయలో నీటితో పాటుగా ఎన్నో ముఖ్యమైన పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయట. వీటిలో విటమిన్ కె, విటమిన్ సి, పొటాషియం లు మెండుగా ఉంటాయట. ఇవి మన ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతాయట. అలాగే మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయట. అలాగే ఎలక్ట్రోలైట్ సమతుల్యతను నిర్వహించడానికి కూడా సహాయపడతాయని చెబుతున్నారు.

కాగా కీరదోసకాయలలో కేలరీలు తక్కువగా ఉంటాయట. అలాగే వాటర్, ఫైబర్ కంటెంట్ లు ఎక్కువగా ఉంటాయట. ఇవి మీరు బరువు పెరగకుండా చేయడానికి బాగా సహాయపడతాయని, వీటిని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆకలి తగ్గుతుందని చెబుతున్నారు.అలాగే కేలరీలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినకుండా చేస్తుందట. దీంతో సులువుగా బరువు తగ్గవచ్చని చెబుతున్నారు. అలాగే వేసవిలో ఎండల వల్ల మన చర్మం బాగా ప్రభావితమవుతుందన్న విషయం తెలిసిందే. అయితే కీరదోసకాయలలో సిలికాన్ డయాక్సైడ్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది చర్మ స్థితిస్థాపకత, ఆర్ద్రీకరణకు సహాయపడుతుందట. కీరదోసకాయ ముక్కలు లేదా కీరదోసకాయ కలిగిన పదార్థాలను ఉపయోగించి సూర్యరశ్మి సంబంధిత చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చని,ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుందని చెబుతున్నారు.

కీరదోసకాయలలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుందట. వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల పేగు కదలికలు మెరుగుపడతాయని కడుపు అసౌకర్యం, ఉబ్బరం సమస్యలు కూడా తగ్గుతాయని అవుతున్నారు. అంతేకాకుండా మలబద్దకం సమస్య కూడా ఉండదట. కీరదోసకాయలో సహజ శ్వాస రిఫ్రెష్ లక్షణాలు ఉంటాయట. ఇవి ఎండను తట్టుకోవడానికి సహాయపడతాయని, కీరదోసకాయను తింటే నోటి దుర్వాసన కూడా రాదని టిలో ఉండే ఫైటోకెమికల్స్ నోటి దుర్వాసనతో పోరాడి లోపలి నుంచి తాజా శ్వాసకు సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cucumber
  • Cucumber Benefits
  • health tips
  • summer

Related News

Hormonal Imbalance

మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత.. ఇవే ల‌క్ష‌ణాలు?!

నిరంతరం చిరాకుగా ఉండటం, ఆందోళన, డిప్రెషన్, కోపం వంటివి హార్మోన్ల అసమతుల్యత వల్ల కలగవచ్చు. అలాగే నిద్ర పట్టకపోవడం లేదా నిద్రలో సమస్యలు కూడా దీనికి సంకేతాలే.

    Latest News

    • Uttam : రబీ ధాన్యం సేకరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష

    • Physics Wala : ఆంధ్రప్రదేశ్‌లో తొలి టెక్-ఎనేబుల్డ్ విద్యాపీఠ్ ప్రారంభం

    • Yezdi : యెజ్డీ రోడ్ స్టర్‌కు ‘బైక్ డిజైన్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారం

    • CIL : అరుదైన గౌరవం దక్కించుకున్న కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్

    • ప్ర‌తిరోజూ హాయిగా నిద్ర‌పోవాలంటే?!

    Trending News

      • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

      • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

      • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

      • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

      • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd