BP : ఒక్క ఉల్లిపాయతో బిపి తగ్గించుకోవచ్చని మీకు తెలుసా..?
BP : ఉల్లిపాయలో ఉండే క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ బీపీ తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచి, వాటిపై ఒత్తిడి పడకుండా చేస్తుంది
- By Sudheer Published Date - 03:57 PM, Tue - 3 June 25

బ్లడ్ ప్రెజర్ (రక్తపోటు) నియంత్రణలో ఉల్లిపాయ(Onion )కు ప్రత్యేక స్థానం ఉంది. న్యూట్రిషనిస్ట్‌ల ప్రకారం.. ఒక చిన్న చిట్కా పాటించడమే హై బీపీ (bp) సమస్యను అధిగమించడానికి దోహదపడుతుంది. ఉదయాన్నే మరియు మధ్యాహ్నం ఉల్లిపాయ రసం తాగడం ద్వారా రక్తపోటు క్రమంగా తగ్గుతుంది. ఉల్లిపాయను బాగా గ్రైండ్ చేసి వడబోయాలి. వచ్చే రసాన్ని కాస్త తేనె లేదా నీళ్లలో కలిపి తాగాలి. ఒక్కసారి తాగితే కాకుండా, కొన్ని వారాల పాటు రోజూ తీసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది.
Charminar Fire accident : ఆ చిన్నారులు ప్రాణాలతో లేరని తెలిసి దిగ్బ్రాంతికి గురైన మిస్ వరల్డ్
ఉల్లిపాయలో ఉండే క్వెర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ బీపీ తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచి, వాటిపై ఒత్తిడి పడకుండా చేస్తుంది. ఈ ప్రభావంతో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. అంతేకాకుండా ఉల్లిపాయ శరీరంలోని ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. తద్వారా బీపీతో పాటు కీళ్ల నొప్పులు, కొలెస్ట్రాల్, షుగర్ కూడా నియంత్రణలోకి వస్తాయి. ఉల్లిపాయ రసం సహజమైన బ్లడ్ థిన్నర్‌గా పనిచేస్తుంది. రక్తం చిక్కబడకుండా చేసి, గుండెపోటు వంటి ప్రమాదాల నుంచి రక్షణ ఇస్తుంది.
అయితే ఉల్లిపాయ రసం తీసుకోవడం ఒక సహాయక చర్య మాత్రమే. దీన్ని మెడిసిన్‌కు ప్రత్యామ్నాయంగా చూడకూడదు. హై బీపీ ఉన్నవారు తప్పనిసరిగా వైద్యుల సూచనల మేరకు మందులు తీసుకోవాలి. దీని తో పాటు పొటాషియం, ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. రోజూ మిలెట్స్, పండ్లు, కూరగాయలు డైట్‌లో చేర్చుకోవాలి. ఒత్తిడి తగ్గించుకుని నిత్య వ్యాయామం చేస్తూ జీవనశైలిలో మార్పులు చేసుకుంటే, బీపీ నియంత్రణలో ఉండి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.