Charminar Fire accident : ఆ చిన్నారులు ప్రాణాలతో లేరని తెలిసి దిగ్బ్రాంతికి గురైన మిస్ వరల్డ్
Charminar Fire accident : ఇటీవల మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన ఆమె, మొదటి రోజుల్లో చార్మినార్ ప్రాంతాన్ని సందర్శించారు.
- By Sudheer Published Date - 03:11 PM, Tue - 3 June 25

హైదరాబాద్ చార్మినార్ ప్రాంతంలో జరిగిన భయానక అగ్నిప్రమాదం (Charminar Fire accident) దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై మిస్ వరల్డ్ 2025 విజేత, థాయ్‌లాండ్‌కు చెందిన ఓపల్ సుచాతా చువాంగ్‌శ్రీ (Miss World 2025 Suchata Chuangsri) తీవ్రంగా స్పందించారు. ఇటీవల మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనడానికి హైదరాబాద్ వచ్చిన ఆమె, మొదటి రోజుల్లో చార్మినార్ ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడే తనతో కలిసి ఫోటోలు దిగిన ముగ్గురు చిన్నారులు ఇప్పుడు మన మధ్య లేకపోవడం తనను ఎంతో కలచివేసిందని ఆమె తెలిపి ఎమోషనల్ కు గురైంది. ఈ సంఘటన గురించి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్‌గా పోస్ట్ చేస్తూ “నా గుండె తట్టుకోలేకపోతుంది” అని పేర్కొన్నారు.
XChat: వాట్సాప్‌కు పోటీగా ఎక్స్ చాట్..ఫీచర్స్ ఇవే..!
హైదరాబాద్ నగరంతో తాను ఏర్పరచుకున్న అనుబంధాన్ని వివరించిన ఓపల్.. “ఇది నా రెండో ఇల్లు లాంటిది. ఇక్కడి ప్రజలు నాకు ఇచ్చిన ప్రేమను మరిచిపోలేను. కానీ చార్మినార్ ప్రాంతంలో నా తొలి సందర్శనలో కలిసి ఫొటో తీసుకున్న చిన్నారులని, వారి కుటుంబ సభ్యుల్ని ఒక అగ్నిప్రమాదం కబళించడం చాలా బాధాకరం” అని పేర్కొన్నారు. ఆ చిన్నారుల తల్లి ఎంతో ఉత్సాహంగా తన కుమార్తెలను అందంగా అలంకరించి ఫొటోకు సిద్ధం చేశారు. మళ్లీ వచ్చాక వారితో ఎక్కువ సమయం గడపాలని కోరుకున్న ఆమె, ఇప్పుడు ఆ అవకాశం కోల్పోయినందుకు బాధను వ్యక్తం చేసింది.
Operation Sindoor : భారత్ కొట్టిన టార్గెట్లు ఎక్కువ… పాకిస్తాన్ ప్రూఫ్స్ రివీల్
మే 18న జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో తనకు చాలా దగ్గరగా అనిపించిన ముగ్గురు చిన్నారుల కుటుంబమూ ఉందని తెలిసి, ఓపల్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. “నా విజయాన్ని సెలబ్రేట్ చేసుకునే సమయంలో, నాకు ఆశీర్వాదాలు చెప్పిన వాళ్లు లేకపోవడం నాకు శూన్యంగా అనిపిస్తోంది. మాటలు రావడం లేదు. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా. పునర్జన్మ ఉంటే మళ్లీ కలుద్దాం” అని ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఓపల్ సుచాత మనసును తాకే ఈ భావోద్వేగ స్పందన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.