Pulses: తినండి పప్పు.. ఇక ఉండదు ముప్పు..!
పప్పులను (Pulses) పేదవాడి మాంసం అని పిలుస్తారు. ఇవి మన శరీరానికి పోషక పదార్థాలతో పాటు దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. పప్పులలోని పోషకాలలో 25 శాతానికిపైగా ప్రోటీన్స్ (మాంసకృత్తులు) ఉంటాయి.
- By Gopichand Published Date - 09:55 AM, Sat - 18 February 23
పప్పులను (Pulses) పేదవాడి మాంసం అని పిలుస్తారు. ఇవి మన శరీరానికి పోషక పదార్థాలతో పాటు దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. పప్పులలోని పోషకాలలో 25 శాతానికిపైగా ప్రోటీన్స్ (మాంసకృత్తులు) ఉంటాయి. ఒక కప్పు పప్పులో కనీసం 18 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది.ఐరన్, జింక్, మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, బి విటమిన్లు వంటి సూక్ష్మపోషకాలకు పప్పులు మంచి మూలం. అందుకే చాలామంది వ్యక్తులు ఈ పోషకాల కోసం వాటిని తమ ఆహారంలో చేర్చుకుంటారు.
■ పాలీఫెనాల్స్ .. సూపర్ ప్రొటెక్షన్
శరీరంలోని హానికరమైన ఏజెంట్లకు వ్యతిరేకంగా పోరాడే చురుకైన సమ్మేళనాలను పాలీఫెనాల్స్ అంటారు. ఇవి మన బాడీలో ఏర్పడేందుకు పప్పులు హెల్ప్ చేస్తాయి.పాలీఫెనాల్స్ అనేవి క్యాన్సర్ కణాలు శరీరంలో ఏర్పడకుండా నిరోధిస్తాయి. గుండె ఆరోగ్యం బెటర్ గా ఉండేలా హెల్ప్ చేస్తాయి. షుగర్ వ్యాధి రాకుండా కూడా పాలీఫెనాల్స్ రక్షణ కల్పించగలవు.
■ ఐరన్
ఒక కప్పు పప్పులో 6.5 మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటుంది. ఇది మీకు రోజంతా అవసరమైన ఐరన్ లో మూడింట ఒక వంతుకు సమానం. మీ శరీరంలో ఆక్సిజన్ పంపింగ్ ప్రక్రియను సవ్యంగా ఉంచడానికి ఐరన్ హెల్ప్ చేస్తుంది. ఇంత ముఖ్యమైన ఐరన్ ను మీ బాడీకి అందించే పప్పును ఇక తినండి.
■ ఫోలిక్ యాసిడ్
పప్పులో ఫోలిక్ యాసిడ్ కూడా పుష్కలంగా ఉంటుంది. గర్భిణులకు ఇది చాలా అవసరం.
■ ఫైబర్
ఒక కప్పు పప్పులో కనీసం 10 గ్రాముల ఫైబర్ ఉంటుంది. దీనివల్ల పప్పు తిన్న తర్వాత ఎక్కువసేపు కడుపు నిండుగా అనిపిస్తుంది.
■ యాంటీ ఆక్సిడెంట్లు
యాంటీ ఆక్సిడెంట్లకు పప్పులు మంచి మూలం. వీటిలో ఫ్లేవనాయిడ్లు , పాలీఫెనాల్స్ అనే
యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఉండటం వల్ల పప్పులను యాంటీకార్సినోజెన్లు అని పిలుస్తారు.
■ గుండెకు పప్పుల రక్షణ ఇలా..
పప్పులలో ఉండే ఫైబర్ మన రక్తప్రవాహంలో చక్కెర శోషణ ప్రక్రియను స్లో చేస్తుంది. పప్పులో కరిగే ఫైబర్, కరగని ఫైబర్ రెండూ పుష్కలంగా ఉంటాయి. ఇందులోని కరిగే ఫైబర్ మన బాడీలోని గట్‌లో ఉన్న కొలెస్ట్రాల్ ను చుట్టుకొని దాన్ని బయటకు సాగనంపుతుంది.
■ B విటమిన్ల స్టోర్హౌస్
విటమిన్ B అనేది మనం తినే ఆహారాన్ని శక్తిగా మార్చడంలో సహాయం చేస్తుంది. ఉదాహరణకు.. విటమిన్ B7 అనేది ముఖ్యంగా జుట్టు, చర్మ ఆరోగ్యానికి ఎంతో కీలకమైంది. విటమిన్ B12 అనేది ఎర్ర రక్త కణాలు, DNA ఏర్పడటానికి హెల్ప్ చేస్తుంది. నిజానికి, ఒక బౌల్ మూంగ్ పప్పులో మీ బాడీకి ఒక రోజులో అవసరమైన విటమిన్ బీ( ఫోలేట్ ) లో 100% ఉంటుంది.
■ మినపపప్పు
మినపపప్పులో ప్రోటీన్, విటమిన్ B3 గొప్ప మూలం. అవి మన ఎముకలను దృఢంగా చేస్తాయి.
■ శనగపప్పు
శనగపప్పులో మాంసకృత్తులు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇది మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. మధుమేహాన్ని కూడా అదుపులో ఉంచుతుంది.
■ కంది పప్పు
కంది పప్పులో మాంసకృత్తులు బాగా ఉంటాయి. ఫైబర్, ఫోలిక్ యాసిడ్, ఐరన్, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి.
■ పెసర పప్పు
పెసర పప్పులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్త ప్రసరణను ప్రోత్సహించడంలో, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. పొటాషియం, కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. ఇవి కండరాల తిమ్మిరిని నివారిస్తాయి.
■ మైసూర్ పప్పు
మైసూర్ పప్పులో కార్బోహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మిమ్మల్ని చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. దీనిలోని పోషకాలు సెల్ డ్యామేజ్‌ని తగ్గించి, వృద్ధాప్యాన్ని నిరోధించడంలో సహాయపడతాయి.
Related News
Summer Care: ఎండాకాలంలో అదే పనిగా టీ, కాఫీ తాగుతున్నారా.. అయితే జర జాగ్రత్త
Summer Care: దేశంలోని పలు రాష్ట్రాల్లో విపరీతమైన వేడిగా ఉంది. ఎండ వేడిమిని తట్టుకునేందుకు ప్రజలు అనేక చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా, ఆహార పానీయాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఒక సలహా జారీ చేసింది. కాఫీ, టీ మరియు ఆల్కహాల్ వంటి పానీయాలు తాగడం వల్ల డీహైడ్రేషన్ (నీటి కొరత) ఏర్పడుతుందని పేర్కొంది. ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినకూడదని సలహాలో పేర్కొన్నారు. అలాగే స్�