Summer: వేసవికాలంలో గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మీకు తెలుసా?
వేసవి కాలంలో గర్భిణీ స్త్రీలు తప్పకుండా కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని లేదంటే అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
- By Anshu Published Date - 11:34 AM, Fri - 21 February 25

మామూలుగా ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు స్త్రీలు చాలా రకాల జాగ్రత్తలు పాటించాలని చెబుతూ ఉంటారు. గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంగా ఉండడంతో పాటు జాగ్రత్తలు తీసుకున్నప్పుడే కడుపులో బిడ్డ కూడా బాగుంటుందని చెబుతూ ఉంటారు. ఇకపోతే సమ్మర్ అప్పుడే మొదలైపోయింది. అయితే ఈ సమ్మర్ లో గర్భిణీ స్త్రీలు తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. వేసవికాలంలో గర్భిణీ స్త్రీలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రెగ్నెన్సీ సమయంలో స్త్రీలకు చాలా రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇక ఎండాకాలంలో ఉక్కపోత, ఎండవేడి కారణంగా ఈ సమస్యలు మరింత తీవ్రమైపోతాయి. అందుకే ఎండాకాలంలో కాబోయే తల్లి ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలట.
ఎండాకాలంలో తల్లి శరీర ఉష్ణోగ్రత కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ప్రెగ్నెన్సీ హార్మోన్ల స్థాయిలు పెరగడం, జీవక్రియలు వేగవంతం కావడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి చెమటలు ఎక్కువగా పడతాయి. దీనివల్ల బాడీ సహజ సిద్ధంగా చల్లబడుతుందట. వేసవి కాలంలో గర్భిణులకు ఎక్కువగా దాహం వేస్తుందట. డీ హైడ్రేషన్ సమస్య కూడా వస్తుందట. యూరిన్ తగ్గిపోతుంది. కాబట్టి వీలైనంత వరకు వాటర్ ఎక్కువగా తాగాలట. తాజా కూరగాయలు, పండ్లు ఎక్కువగా తినాలట. కీరా తినడం వల్ల తల్లీబిడ్డ ఇద్దరికీ చలువ చేస్తుందట. ఉదయం 7 గంటల లోపు అలాగే సాయంత్రం 6 గంటల తర్వాత కాసేపు వాకింగ్ చేయాలని చెబుతున్నారు. యోగా, ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుందట. ఉప్పు కూడా తక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో చాలా మందికి ఆహారం విషయంలో అనేక అనుమానాలు కలుగుతుంటాయి. ఏ ఆహారం తింటే ఏమవుతుందోనని తరచూ ఆందోళన చెందుతూ ఉంటారు.
అయితే ఆందోళన చెందకుండా ఇంట్లో చేసిన తాజా ఆహార పదార్థాలను తినాలని నిపుణులు చెబుతున్నారు. ఎండాకాలంలో గర్భిణులు వీలైనంత వరకు ఇంట్లో చల్లటి ప్రదేశంలో ఉండాలట. మధ్యాహ్నం సమయంలో ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయటకు వెళ్లకూడదట. ఎండదెబ్బ తగిలి వాంతులు, విరేచనాలు అవుతాయి. కాబట్టి ఇంట్లోనే ఉంటూ రెస్ట్ తీసుకోవాలని చెబుతున్నారు. అలాగే దాహంగా అనిపించినప్పుడు నీళ్లే కాకుండా పండ్ల రసాలు కూడా తాగవచ్చని చెబుతున్నారు. అలాగే తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వస్తే సన్‌స్క్రీన్ అప్లై చేసుకోవాలట. నీళ్లు, పాలు, జ్యూస్ లాంటివి ఎక్కువగా తాగాలట. ఇలా ద్రవాలు తాగడం వల్ల చెమటలో పోయిన ఎలక్ట్రోలైట్స్ తిరిగి పొందవచ్చట. తద్వారా డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుకోవచ్చట. ఇంట్లో ఒకేచోట కూర్చొకుండా అటూ ఇటూ కాస్త తిరగాలని చెబుతున్నారు. అలాగే వీలైనంత వరకు బయట ఆహారానికి దూరంగా ఉంటూ, ఇంట్లో చేసిన ఆహార పదార్థాలను తినాలట. ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల గర్భిణీలు ఆరోగ్యంగా ఉండవచ్చని చెబుతున్నారు…