HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >People Who Should Not Eat Anjeer

Anjeer: ఈ సమస్యలు ఉన్నవారు అంగీలు పండ్లను ఎట్టి పరిస్థితుల్లో తినకూడదట.. ఇంతకీ వాళ్ళు ఎవరంటే?

అంజీర్ పండ్లు ఆరోగ్యానికి మంచివే కానీ కొన్ని రకాల సమస్యలతో బాధపడుతున్న వారు వీటిని తినక పోవడమే మంచిదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

  • Author : Anshu Date : 25-01-2025 - 12:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Anjeer
Anjeer

అంజీర్ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే. అంజీర్ ని తరచుగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఇందులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. విటమిన్ ఎ, విటమిన్ కే, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు అత్తి పండులో ఉన్నాయి. సహజ చక్కెరతో కూడిన జ్యూసీ డ్రై ఫ్రూట్ అంజీర్. అనేక కడుపు సంబంధిత సమస్యల్ని తొలగించడంలో సహాయపడుతుందట. అలాగే అంజీర్ రోజు తీసుకోవడం జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుందట. కొలెస్ట్రాల్ నియంత్రించడంలో కూడా ఈ పండు చాలా సహాయపడుతుందట.

అయితే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న అంజీర్ పండుని కొంతమంది తీసుకోకూడదని చెబుతున్నారు. మరి ఎలాంటి సమస్యలు ఉన్నవారు అంజీర్ పండును తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో అంజీర్ పండ్లను తీసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుందట. అలాగే రక్తహీనత సమస్యను కూడా తగ్గిస్తుందట. నానబెట్టిన అంజీర్ రోజూ తినడం వల్ల అనేక మంచి ప్రయోజనాలు ఉంటాయట. అంజీర్‌ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్ సమస్య రాకుండా మన శరీరాన్ని రక్షిస్తాయట. అత్తి పండ్లను తినడం వల్ల శరీరానికి తక్షణ లభిస్తుందట. కాగా అంజీర్ పండ్లను తినడం వల్ల కొంతమందిలో చర్మ అలెర్జీలు వస్తాయి. అందుకే చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు అంజీర్ పండ్లకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఈ పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కొన్ని సార్లు ఎసిడిటీ, కడుపు నొప్పి వంటి సమస్యల్ని కలిగిస్తుందట.

కాబట్టి ఇప్పటికే గ్యాస్ సమస్య, ఉబ్బరం లేదా మలబద్ధకంతో బాధపడుతున్న వ్యక్తులు అత్తిపండ్లు తీసుకోకపోవడమే మంచిదని చెబుతున్నారు. లేదంటే అపానవాయువు, వాపు సంభవించవచ్చట. అంతేకాకుండా మలబద్ధక సమస్య మరింత తీవ్రం కావచ్చని చెబుతున్నారు. ఈ అంజీర్ పండ్లలో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. అందుకే డయాబెటిక్ రోగులు అత్తి పండ్ల వంటి తీపి డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం మానుకోవడం మంచిదని చెబుతున్నారు. మీకు అత్తి పండ్లను తినాలని అనిపిస్తే, తక్కువ మోతాదులో తినాలని చెబుతున్నారు. కాలేయ వ్యాధితో బాధపడుతున్న రోగులు పొరపాటున కూడా అత్తి పండ్లను తినకూడదట. ఒకవేళ తింటే అవి కాలేయ పనితీరును నెమ్మదిస్తాయట.

బరువు తగ్గాలనుకునేవారు తమ డైట్‌లో అంజీర్ పండ్లను చేర్చుకోకపోవడమే మంచిదని చెబుతున్నారు. వీరు అత్తి పండ్లకు దూరంగా ఉండటమే మేలు. ఎందుకంటే వీటిని చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో మీరు బరువు తగ్గకపోగా, బరువు పెరిగే ప్రమాదముందట. అలాగే అంజీర్ పండ్లను ఎక్కువ మోతాదులో తినకపోవడమే ఉత్తమం అని చెబుతున్నారు. ఎక్కువ మోతాదులో తింటే రక్త స్రావం సమస్యలు తలెత్తే ప్రమాదముందట. అత్తి పండ్లలో ఎక్కువ కేలరీలు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల కడుపు తొందరగా నిండిన ఫీలింగ్ వస్తుందట. దీంతో కడుపు ఉబ్బరం సమస్య వచ్చే ప్రమాదముందట. మహిళలు పీరియడ్స్ సమయంలో అత్తి పండ్లను తీసుకోకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • anjeer
  • Anjeer benefits
  • Anjeer fruit
  • health tips

Related News

Hormonal Imbalance

మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత.. ఇవే ల‌క్ష‌ణాలు?!

నిరంతరం చిరాకుగా ఉండటం, ఆందోళన, డిప్రెషన్, కోపం వంటివి హార్మోన్ల అసమతుల్యత వల్ల కలగవచ్చు. అలాగే నిద్ర పట్టకపోవడం లేదా నిద్రలో సమస్యలు కూడా దీనికి సంకేతాలే.

    Latest News

    • Gas Cylinder Booking : కొత్త గ్యాస్ బుకింగ్ నంబర్లు ఇవే!

    • శ్రీదేవి ఆస్తి కోసం.. మద్రాస్ హైకోర్టుకు బోనీ కపూర్

    • Rashid Khan : పాకిస్తాన్‌పై రషీద్ ఖాన్ ఆగ్రహం

    • పాకిస్తాన్‌పై రషీద్ ఖాన్ ఆగ్రహం.. కాబూల్‌లో మారణహోమం

    • Gold Price : బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

    Trending News

      • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

      • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

      • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

      • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

      • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd