Onions: ఎండాకాలంలో ఉల్లిపాయ తింటే శరీరంలో ఎలాంటి మార్పులు కలుగుతాయో మీకు తెలుసా?
వేసవి కాలంలో ఉల్లిపాయ తీసుకోవడం వల్ల అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 03:00 PM, Mon - 7 April 25

మామూలుగా ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని సామెతను మనం వినే ఉంటాం. ఉల్లిపాయలు తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. దీన్ని పచ్చిగా లేదంటే కూర రూపంలో కూడా తీసుకోవచ్చు. ఉల్లిపాయల్లో విటమిన్లు, మినరల్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్య పాత్రను పోషిస్తాయట. వేడి వల్ల వచ్చే సమస్యలు రాకుండా ఉండటానికి కూడా పచ్చి ఉల్లిపాయల్ని తినడం మంచిదని చెబుతున్నారు.
ముఖ్యంగా వేసవికాలంలో పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం చాలా తక్కువగా ఉంటుందట. ఇది శరీర వేడిని తగ్గిస్తుందని చెబుతున్నారు. అలాగే వేసవికాలంలో ఉల్లిపాయలు తింటే డిహైడ్రేషన్ కు గురి కాకుండా ఉండవచ్చట. ఇది శరీరానికి చల్లా దనాన్ని ఇస్తుంది. అలాగే ఇది రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఉల్లిపాయలో ఫైబర్ కూడా అధిక మొత్తంలో ఉంటుంది. ఇందులో ఉండే సల్ఫర్, పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుందట. ఉల్లిపాయలు తినడం వల్ల చర్మం, జుట్టుకు కూడా మేలు చేస్తుందట. ఉల్లిపాయలు తరచుగా తీసుకోవడం వల్ల జీర్ణశక్తిని కూడా పెంచుతాయట.
ఉల్లిపాయలను తరచూ తీసుకోవడం వల్ల హానికరమైన యూవి కిరణాలు వేసవి సూర్యునితో సంబంధం ఉన్న పర్యావరణ టాక్సిన్స్ నుండి రక్షణను అందిస్తుందట. కాగా ఉల్లిపాయల్లో ఫ్లేవనాయిడ్ ఫినాలిక్ సమ్మేళనాలు, విటమిన్ సి వంటి యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. అదేవిధంగా ఉల్లిపాయల్లో నీరు పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వేసవిలో ఉల్లి తింటే మన శరీరానికి అవసరమైన హైడ్రేషన్ అందుతుందట. ఉల్లిలో ఉండే పొటాషియం ఒక ముఖ్యమైన ఎలక్ట్రోలైట్, ఇది శరీరంలో ద్రవ సమతుల్యతను నియంత్రించడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు.