HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Mushrooms For Health 7 Surprising Benefits You May Not Know

Mushrooms: పుట్ట గొడుగు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?

పుట్ట గొడుగుల (Mushrooms)లో పీచు పదార్థం (ఫైబర్) అధికంగా ఉంటుంది. శరీరంలోని కొవ్వు శాతాన్ని తగ్గించేందుకు ఇవి హెల్ప్ చేస్తాయి. వీటిలో విటమిన్ బి6, సి, డి, ఐరన్, మెగ్నిషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి.

  • Author : Gopi Date : 18-02-2023 - 8:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mushroom
Mushroom

పుట్ట గొడుగుల (Mushrooms)లో పీచు పదార్థం (ఫైబర్) అధికంగా ఉంటుంది. శరీరంలోని కొవ్వు శాతాన్ని తగ్గించేందుకు ఇవి హెల్ప్ చేస్తాయి. వీటిలో విటమిన్ బి6, సి, డి, ఐరన్, మెగ్నిషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. అధిక రక్తపోటు (హై బీపీ)ను తగ్గించడానికి పుట్టగొడుగులు చాలా ఉపయోగపడుతాయి. వాంతులు, విరేచనాలు, జ్వరాలు వంటి సమస్యల నుంచి కాపాడుతాయి. వాటితో కలిగే మరిన్ని హెల్త్ బెనెఫిట్స్ వివరాల్లోకి వెళితే..!

★ పుట్టగొడుగులు అనేవి విటమిన్ డి యొక్క గొప్ప మూలం. వీటిలో సోడియం తక్కువగా ఉంటుంది.
★ ఇందులో పొటాషియం కూడా ఉన్నందున రక్తపోటును నియంత్రించడంలో హెల్ప్ చేస్తుంది.
★ వెయిట్ లాస్ కోసం ఉపయోగపడే డైట్ లో పుట్టగొడుగులను కూడా చేర్చుకోవచ్చు.ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి.
★ 90% వాటర్ కంటెంట్ ఉంటుంది.
★ పెక్టిన్ అని పిలువబడే కరిగే ఫైబర్‌ కూడా పుట్ట గొడుగులలో ఉంటుంది.
★ గట్ హెల్త్ ను ఇవి ఇంప్రూవ్ చేస్తాయి. జీర్ణాశయంలోని గట్ లో మంచి బ్యాక్టీరియా సంఖ్యను పెంచుతాయి.
★ పుట్టగొడుగులు మంచి ప్రీబయోటిక్‌గా కూడా పనిచేస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
★ సెలీనియం అనేది పుట్టగొడుగులలో ఉండే పోషకం. ఇది శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లను తయారు చేయడంలో సహాయ పడుతుంది.
★ ఇందులో ఉండే బీటా కెరోటిన్ , విటమిన్ ఎ వల్ల దృష్టిలోపం రాదు.
వీటిలోని విటమిన్ B2 కూడా కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మరొక ముఖ్యమైన పోషకం. ★ పుట్టగొడుగులను తీసుకోవడం వల్ల డిమెన్షియా వంటి న్యూరో జెనరేటివ్ డిజార్డర్‌లను కూడా నివారించవచ్చని కొన్ని అధ్యయనాలు కనుగొన్నాయి.
★ పుట్ట గొడుగులు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా సహాయ పడతాయి. ఎందుకంటే వాటిలో లీన్ ప్రోటీన్ , ఫైబర్‌ లు సమృద్ధిగా ఉంటాయి.
★ పుట్టగొడుగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది మన ఎముకలను స్ట్రాంగ్ చేస్తుంది. ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు, వాపు, ఎముక క్షీణత వంటి సమస్యలను అభివృద్ధి చేసే అవకాశాలను తగ్గిస్తుంది.

■ తెలుపు, నలుపు, గోధుమ రంగుల్లో

పుట్టగొడుగులు తెలుపు, నలుపు, గోధుమ రంగుల్లో ఉంటాయి. ఆయుర్వేద భావప్రకాశ సంహిత ప్రకారం.. పరిశుభ్రమైన ప్రదేశంలో పెరిగినవి, తెల్ల రంగులో ఉన్న
పుట్టగొడుగులు తినడానికి యోగ్యమైనవి. కర్రలు, పేడలపై పుట్టిన పుట్టగొడుగులను కూడా తినొచ్చు.

■ వండుతున్నప్పుడు నల్లగా మారిపోతే

పుట్ట గొడుగులు వండుతున్న ప్పుడు నల్లగా మారిపోతుంటాయి కదా? అలా కాకుండా ఉండాలంటే వాటిపై రెండు చెంచాల గోరువెచ్చని పాలు కాస్త పోయండి. లేదా ముందుగానే కాస్త ఉప్పు చల్లండి.

■ విషపు మష్రూమ్‌లను గుర్తించడం ఎలా..?

★ ఐసీఏఆర్ ప్రకారం.. విషపూరితపు పుట్టగొడుగులను గుర్తించడం చాలా కష్టం. వీటిని గుర్తించడానికి కొన్ని రకాల సొంత పద్ధతులను ప్రజలు అవలంభిస్తారు.
★ ఇందులో భాగంగా విషపూరిత పుట్ట గొడుగులను గుర్తించడానికి రంగును ఒక సంకేతంగా భావిస్తారు.
★ ముదురు రంగు పుట్టగొడుగులు విషపూరిత మైనవని నమ్ముతారు. కానీ, ప్రపంచంలోని చాలా విషపూరితపు పుట్టగొడుగులు తెలుపు లేదా గోధుమ రంగుల్లో ఉంటాయి.
★ విషపు పుట్టగొడుగులు వెండి పాత్రలో వేసినప్పుడు, ఆ పాత్ర నలుపు రంగులోకి మారిపోతుందని ప్రజలు నమ్ముతారు. కానీ ఇది శాస్త్రీయంగా నిరూపితం కాలేదు.
★ ‘డిస్ట్రాయింగ్ ఏంజెల్’ అనే విషపూరిత పుట్ట గొడుగు
పూర్తిగా తెల్లగానే ఉంటుంది.
★ ఇక ‘ఎమానిటిన్’ అనే విష పదార్థాన్ని కలిగి ఉండే మష్రూమ్‌లు ముదురు నారింజ లేదా తెలుపు రంగులో ఉంటాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • health tips
  • Mushroom Benifits
  • Mushrooms
  • Mushrooms For Health

Related News

    Latest News

    • RCB : ఐపీఎల్ 2026 విజేత ఆర్సీబీ.. వ‌రుస‌గా రెండోసారి టైటిల్ గెలుచుకున్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌

    • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్ : ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి కుప్పకూలిన గుజరాత్ బ్యాట్స్‌మ‌న్స్‌

    • Forever New : వైజాగ్‌లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్

    • PM-Setu Scheme : ఏపీకి దక్కిన అరుదైన గౌరవం

    • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd