HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Moringa Leaves Health Benefits

Moringa Leaves: ఇది మామూలు ఆకు కాదు బాబోయ్.. 300 రోగాలను తగ్గించే దివ్య ఔషధం!

ఇప్పుడు చెప్పబోయే నాకు మన ఇంటి పరిసర ప్రాంతాల్లోనే ఉంటుంది. ఈ ఆకు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలగడంతో పాటు 300 రకాల రోగాలను కూడా తగ్గించే దివ్య ఔషధం అని చెబుతున్నారు.

  • Author : Anshu Date : 01-05-2025 - 9:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Moringa Leaves
Moringa Leaves

ప్రకృతి మనకు ఎన్నో రకాల ఆకులను పండ్లను అందించింది. అందులో మన చుట్టూ ఎన్నో రకాల చెట్లు కూడా ఉంటాయి. కొందరు వాటిని పిచ్చి మొక్కలుగా భావిస్తూ ఉంటారు. కొందరు వాటి ప్రయోజనాలు తెలుసుకొని వాటిని తింటూ ఉంటారు. అటువంటి వాటిలో మునగ ఆకు కూడా ఒకటి. మునగకాయలు మాత్రమే కాకుండా మునగ ఆకు ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని చాలా తక్కువ మంది మాత్రమే తింటూ ఉంటారు. కొంతమంది మునగ ఆకు తినడమేంటి పిచ్చి కాకపోతే గాని కొట్టి పారేస్తూ ఉంటారు. కానీ మునగ ఆకు వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మాత్రం తినకుండా అస్సలు ఉండలేరు. ఇంతకీ మునగాకు వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయానికి వస్తే..

మునగాకులో యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ డిప్రెసెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ ఆకులు మన ఆరోగ్యానికి దివ్య ఔషదంలా పనిచేస్తాయని చెబుతున్నారు. మునగ చెట్టు ఆకులే కాకుండా దీనికాయలు, బెరడు అన్నీ కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మునగాకును తీసుకుంటే మన శరీరంలో శక్తి స్థాయిలు బాగా పెరుగుతాయట. దీంతో అలసట, బలహీనత వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు. మునగాకులో ఐరన్ పుష్కలంగా ఉంటుందట. ఇదే మన బలహీనతను, మగతను తగ్గించడానికి బాగా సహాయపడుతుందని చెబుతున్నారు. అలాగే రోగనిరోధక శక్తిని పెంచడానికి నిమ్మకాయ, నారింజ వంటి పండ్లే సహాయపడతాయి. కానీ సిట్రస్ పండ్లలో కంటే ఎక్కువ విటమిన్ సి మునగాకులో ఉంటుందట.

మునగాకును తీసుకుంటే మన రోగనిరోధక శక్తి పెరుగుతుందట. ఇందులో ఇమ్యూనిటీని పెంచే ఫైటో న్యూట్రియెంట్లు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు. ఇవి అంటు వ్యాధులతో పోరాడే శక్తిని మన శరీరానికి అందిస్తాయట. ఇవి విటమిన్ ఎ, విటమిన్ సి, ఇనుమును కలిగి ఉంటాయని,ఇవి మన ఇమ్యూనిటీ పవర్ ను బలంగా చేస్తాయట. మునగాకులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా బాగా సహాయపడుతుందట. ఇది డయాబెటీస్ ను కంట్రోల్ చేయడమే కాకుండా డయాబెటీస్ వచ్చే ప్రమాదాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తుందని చెబుతున్నారు. మునగాకులో క్లోరోజెనిక్ ఆమ్లం అని పిలువబడే వర్ణద్రవ్యం కూడా మెండుగా ఉంటుందట. ఇది తిన్న తర్వాత బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా కాపాడుతుందని చెబుతున్నారు. అలాగే చాలా మంది శరీర మంటతో బాధపడుతుంటారు.

ఇది మరీ ప్రమాదకరమైనది కాదు. కానీ మునగాకు దీనిని తగ్గించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందట. మునగాకు ఒక శక్తివంతమైన శోథ నిరోధక ఏజెంట్ గా పనిచేస్తుందట. అలాగే తాపజనక ఎంజైమ్ లను అణచివేస్తుందట. అలాగే శోథ నిరోధక సైటోకిన్ల ఉత్పత్తిని పెంచి శరీరంలో మంటను తగ్గించడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. మునగాకు మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సహాయపడుతుందట. ఇది మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి బాగా సహాయపడుతుందట. అలాగే ఇది హృదయనాళ వ్యవస్థకు మద్దతు ఇస్తాయట. దీంతో మనకు గుండెపోటు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని చెబుతున్నారు. మునగాకుల్లో భాస్వరం, కాల్షియంలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయట. మునగాకులు శోథ నిరోధక స్వభావాన్ని కలిగి ఉంటాయట. ఇవి కీళ్ల నొప్పులను, కాళ్ల నొప్పులను తగ్గిస్తాయట. అలాగే బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • health benefits
  • health problem
  • health tips
  • Moringa Leaves
  • Moringa Leaves Benefits

Related News

Are you gaining weight due to thyroid issues? Then do this immediately—you won't gain any weight at all!

Thyroid: థైరాయిడ్ వల్ల బరువు పెరుగుతున్నారా? అయితే వెంటనే ఇలా చేయండి.. అస్సలు బరువు పెరగరు!

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్యలలో థైరాయిడ్ సమస్య కూడా ఒకటి. ప్రతి పదిమందిలో నలుగురు ఈ థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. థైరాయిడ్ సమస్యతో బాధపడే వారిలో ముఖ్యంగా కనిపించే ప్రధాన లక్షణం అధిక బరువు. థైరాయిడ్ సమస్యతో బాధపడే వాళ్ళు చాలామంది అధిక బరువు సమస్యతో కూడా బాధపడుతూ ఉంటారు. ఈ థైరాయిడ్ సమస్య కారణంగా విపరీతంగా బరువు పెరగడం వల్ల ఇతర అనార

  • A juice that boosts sexual desire... Drinking this juice will improve your sex life.

    Romantic Life: శృంగార వాంఛలను పెంచే జ్యూస్.. ఈ జ్యూస్ తాగితే మీ శృంగార జీవితం మెరుగుపడుతుంది..

Latest News

  • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

  • Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది?

  • Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా..!

  • Rains: తెలంగాణకు భారీ వర్షసూచన

  • Amaravati Farmers: వైకాపా నేతల పర్యటనను అడ్డుకున్న రాజధాని రైతులు

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd