HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >More Health Benefits With Early Dinner

Health Tips: రాత్రిపూట ఇలా భోజనం చేస్తే చాలు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో?

ప్రస్తుత రోజుల్లో మనుషుల జీవనశైలి పూర్తిగా మారిపోవడంతో ఒక సమయం పాడు అంటూ లేకుండా పోయింది. ఉదయాన్నే తినాల్సిన టిఫిన్ మధ్యాహ్నం ఎప్పుడో తినడం

  • Author : Anshu Date : 28-01-2024 - 7:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 28 Jan 2024 04 56 Pm 2585
Mixcollage 28 Jan 2024 04 56 Pm 2585

ప్రస్తుత రోజుల్లో మనుషుల జీవనశైలి పూర్తిగా మారిపోవడంతో ఒక సమయం పాడు అంటూ లేకుండా పోయింది. ఉదయాన్నే తినాల్సిన టిఫిన్ మధ్యాహ్నం ఎప్పుడో తినడం, మధ్యాహ్నం తినాల్సిన లంచ్ సాయంత్రం తినడం, సాయంత్రం తినాల్సిన డిన్నర్ ని అర్ధరాత్రి ఎప్పుడో తింటూ ఉంటారు. ఈ మధ్య రాత్రి 10,11 గంటలకు తినడం బాగా అలవాటు అయిపోయింది. అయితే ఇలా ఒక పద్ధతంటూ లేకుండా ఎప్పుడు ఆకలైతే అప్పుడు తింటే కుదరదు. ఆరోగ్యపరంగా చాలా సమస్యలు తలెత్తుతాయి. ఊబకాయం వస్తుంది. ఒంట్లో చక్కెర స్థాయి పెరుగుతుంది. జీర్ణక్రియ క్రమం తప్పుతుంది. తిన్నది అరగక కడుపుబ్బరంతో బాధపడాల్సి ఉంటుంది. కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. పొద్దున్నే విసర్జన సాఫీగా జరగదు.

తిన్నది ఒంట బట్టక రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఒకదాని తర్వాత ఒకటిగా రోగాలు చుట్టుముడతాయి. కాబట్టి రాత్రి పూట ఎప్పుడు ఎలా ఎంత తినాలో తెలుసుకోవడం అన్నది చాలా ముఖ్యం. రాత్రిపూట ఎప్పుడు తిన్నా కూడా మనం పడుకోవడానికి కనీసం రెండు గంటల ముందు అయినా తినడం మంచిది. రోజూ ఒకే సమయానికి, సరిపోను భోజనం చేయాలి. ఎక్కువ, తక్కువ తినొద్దు. ఇలా చేస్తే పడుకోవటానికి ముందే తిన్నదాంట్లో సగం వరకు అరుగుతుంది. మిగతాది నిద్రపోయాక జీర్ణమవుతుంది. పడుకున్న తర్వాత జీర్ణవ్యవస్థ పనితీరు నెమ్మదిస్తుంది కాబట్టి తిన్నది మొత్తం నిద్రలోనే అరగటం జరగని పని. ఫలితంగా అజీర్తితో బాధపడాల్సి ఉంటుంది.

అలాగే బాడీలో షుగర్ లెవల్స్ పెరిగితే బయటి నుంచి ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుంది. దీనికోసం హాస్పిటల్ లో చేరి కనీసం రెండు మూడు రోజులైనా ఉండాలి. దానివల్ల డబ్బు ఖర్చవుతుంది. టైమ్ వేస్ట్ అవుతుంది. ఇన్సులిన్ మన శరీరంలోనే సహజంగా ఉత్పత్తి కావాలంటే రాత్రి పూట త్వరగా తినాలి. తద్వారా నిద్ర కూడా బాగా పడుతుంది. ఆలస్యంగా భోజనం చేస్తే అది అరగకుండా పొట్టలో అలాగే ఉండిపోతుంది. దీంతో కడుపు నొప్పిగా అనిపించొచ్చు. ఎసిడిటీ రావచ్చు. రాత్రి పూట త్వరగా తినటం వల్ల ఒంట్లో వేడి సైతం తగ్గుతుంది. బాడీ టెంపరేచర్ పెరిగితే ఇతర ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఏ సమయంలో రాత్రిపూట భోజనం చేస్తే మంచిది అంటే.. రాత్రి 7:30 ప్రాంతం నుంచి ఎనిమిది లోపు తినేసి పదింటి లోపు పడుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • dinner
  • eating dinner
  • health benefits
  • health tips

Related News

Struggling with work stress? Here’s how to relax!

Work Stress: పని ఒత్తిడితో సతమతమవుతున్నారా? ఇలా రిలాక్స్ అవ్వండి!

ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికీ ఒత్తిడి అనేది ఉంటుంది. ఒత్తిడి లేని మనిషి ఉండడు. కానీ ఆ ఒత్తిడి ఎక్కువైతే రోగాలు వస్తాయని, ఒత్తిడి తగ్గించుకోవాలని వైద్యులు చెప్తూనే ఉంటారు. ఇక అలాంటి ఒత్తిడి తగ్గాలంటే ఇక్కడ చెప్పే కొన్ని చిట్కాలను పాటించండి.. ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటారు.. వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికీ ఇంటి ను

  • Are you gaining weight due to thyroid issues? Then do this immediately—you won't gain any weight at all!

    Thyroid: థైరాయిడ్ వల్ల బరువు పెరుగుతున్నారా? అయితే వెంటనే ఇలా చేయండి.. అస్సలు బరువు పెరగరు!

Latest News

  • Jnaneswari Missing: జ్ఞానేశ్వరి కేసులో పోలీసులు కొత్త ప్లాన్.. తుని పాప సమాచారం ఇస్తే లక్ష బహుమతి

  • Aaruguru Pathivrathalu: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆరుగురు పతివ్రతల రీ-రిలీజ్‌పై క్లారిటీ వచ్చేసింది

  • Commercial LPG Price: వినియోగదారులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన కమర్షియల్‌ సిలిండర్‌ ధరలు

  • Rythu Bharosa: తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. ‘రైతు భరోసా’ నిధులు విడుదల

  • Konidela Surekha: చిరంజీవి భార్య సురేఖకు తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి బోర్డు సభ్యురాలిగా కీలక బాధ్యతలు

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd