Liver Damage Foods: ఈ ఆహారాలు ఆల్కహాల్ కంటే చాలా డేంజర్.. లివర్ పాడవడం ఖాయం?
మామూలుగా ఆల్కహాల్ ఎక్కువగా తాగితే లివర్ కి ప్రమాదం అనే విషయం గురించి మనందరం చదివే ఉంటాము. కానీ కేవలం ఒక్క ఆల్కహాల్ వల్ల మాత్ర
- By Nakshatra Published Date - 09:38 PM, Tue - 18 June 24
![Liver Damage Foods: ఈ ఆహారాలు ఆల్కహాల్ కంటే చాలా డేంజర్.. లివర్ పాడవడం ఖాయం?](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/06/MixCollage-18-Jun-2024-09-37-PM-5044.jpg)
మామూలుగా ఆల్కహాల్ ఎక్కువగా తాగితే లివర్ కి ప్రమాదం అనే విషయం గురించి మనందరం చదివే ఉంటాము. కానీ కేవలం ఒక్క ఆల్కహాల్ వల్ల మాత్రమే కాకుండా కొన్ని రకాల ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా మీ లివర్ పాడవుతుందనీ మీకు తెలుసా? అవునండోయ్ మీరు విన్నది నిజమే. కొన్ని రకాల ఆహార పదార్థాలు ఆల్కహాల్ కంటే డేంజర్ అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఉప్పు అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల లివర్ మంటకు కారణం అవుతుంది.
అంతేకాదు ఫ్రై, ఆయిల్ ఎక్కువగా ఉండే ఆహారాలు కూడా లివర్ కి ఎక్కువ ప్రభావం చూపుతాయి. వాటి వల్ల కాలేయంపై ఫ్యాట్ పేరుకు పోవడానికి ఇదే కారణం. అందుకే మన డైట్ లో సమతుల్య ఆహారం చేర్చుకోవాలి. ముఖ్యంగా తృణ ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, లీన్ మీట్ ఇవన్నీ మన లివర్ ఆరోగ్యానికి ఎంతో మంచివి. అయితే లివర్ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎలాంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అతిగా ఆల్కహాల్ సేవించడం వల్ల లివర్ డ్యామేజ్ అవుతుంది. ఇది లివర్ సిర్రోసిస్ కి కారణం అవుతుంది. అలాగే ఒకే సిట్టింగ్ లో నాలుగు బీర్లు తీసుకునే వారిలో ఈ ప్రమాదం ఎక్కువగా కనబడుతుంది.
అందుకే ప్రతిరోజు ఒక డ్రింక్ లేదా రెండిటికి మించి తీసుకోకూడదు. ఆల్కహాల్ మాత్రమే కాదు ఉప్పు అతిగా తీసుకోవడం వల్ల కూడా మీ లివర్ ప్రమాదంలో పడుతుంది. ఇది ఫ్యాటీ లివర్ ఒబిసిటీ, డయాబెటిస్ కి కూడా కారణం అవుతుంది. అందుకే ఏ ఆహారమైన మితంగా తినాలి. ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల లివర్ ప్రమాదంలో పడినట్లే. లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండే ఆహారాలు మీ డైట్ లో చేర్చుకోవాలి. అలాగే ఎక్కువగా చక్కర తీసుకోవడం వల్ల డయాబెటీస్ సమస్య మాత్రమే కాదండోయ్ లివర్ కి కూడా ప్రమాదంగా మారుతుంది. ఇది ఫ్యాటీ లివర్ సమస్య అభివృద్ధి కావడానికి కారణం అవుతుంది. అందుకే చక్కెరలో అప్పుడప్పుడు మాత్రమే తీసుకోవాలి అతిగా తినకూడదు.
అలాగే రెడ్ మీట్లో శాచ్యురేటెడ్ ఫ్యాట్ పుష్కలంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ ట్రై గ్లిజరైడ్ లెవెల్ స్థాయిలను అమాంతం పెంచేస్తుంది. రెడ్ మీట్ అతిగా తీసుకోవడం వల్ల కార్డియో ఆరోగ్యం పై కూడా ప్రభావం చూపుతుంది. అందుకే రెడ్ మీట్ కూడా మీ డైట్ లో ఉండకూడదు. ట్రాన్స్ ఫ్యాట్ అంటే ఆర్టిఫిషియల్ ఫ్యాట్. బేకరీ ఉత్పత్తుల్లో ఇవి విపరీతంగా కనిపిస్తాయి. బేకరీ ఉత్పత్తులు అతిగా తినడం వల్ల కూడా లివర్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మాములుగా చాలా మంది దాహం వేస్తే సడెన్గా సాఫ్ట్ డ్రింక్స్ తాగేస్తూ ఉంటారు. కానీ నాన్ ఆల్కహాల్ ఫ్యాటీ లివర్ డిసీజ్కు ఇవే కారణం కావచ్చు. ఈ సాఫ్ట్ డ్రింక్స్ అతిగా తీసుకోకూడదు. సోడా తాగాలంటే కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాత్రమే తీసుకోవాలి. ఇది లివర్ డ్యామేజ్ కి కారణం అవుతుంది.
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![Refrigerator: ఫ్రిడ్జ్ లో పొరపాటున కూడా వీటిని అస్సలు పెట్టకండి.. పెట్టారో అంతే సంగతులు?](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/06/THESE-TASKS-SHOULD-BE-DONE-EACH-WEEK9.webp)
Refrigerator: ఫ్రిడ్జ్ లో పొరపాటున కూడా వీటిని అస్సలు పెట్టకండి.. పెట్టారో అంతే సంగతులు?
ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు ఇంట్లో రిఫ్రిజిరేటర్ ను తప్పకుండా వినియోగిస్తున్నారు. అనేక రకాల ఆహార పదార్థాలను నిల్వ చేయడం కోసం ఈ ఫ్రిడ