Health: సీతాఫలాలు తినే ముందు ఈ విషయాలు తెలుసుకోండి
సీతాఫలాలను ఎక్కువగా తింటే జీర్ణ సమస్యలు, అధిక బరువు, అలర్జీల రిస్క్ పెరుగుతుందట.
- By Balu J Published Date - 06:08 PM, Mon - 6 November 23

Health: సీతాఫలాలతో అనే ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ C.. శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను బయటకు పంపుతాయి. ఫ్రీ రాడికల్స్ కారణంగా కణాల వినాశనంతో ఎదురయ్యే వృద్ధాప్యం, ఇతర వైద్య సమస్యలను ఈ పోషకాలు దూరం చేస్తాయి. సీతాఫలంలో వాటర్ కంటెంట్, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, థయామిన్, రైబోఫ్లావిన్, నియాసిన్, పాంతోతేనిక్ యాసిడ్, ఫ్యాటీ యాసిడ్స్, ట్రిప్టోఫాన్, లైసిన్, మెథియోనిన్ వంటి పోషకాలు ఉంటాయి. ఈ సూక్ష్మ పోషకాలు ఆరోగ్యాన్ని కాపాడుతూ, అనారోగ్యాల ప్రమాదాలను తగ్గిస్తాయి.
ఐతే సీతాఫలాలను ఎక్కువగా తింటే జీర్ణ సమస్యలు, అధిక బరువు, అలర్జీల రిస్క్ పెరుగుతుంది. మధుమేహం ఉన్నవారికి ఇవి ప్రమాదకరం. అజీర్ణం, పొత్తికడుపు నొప్పి, అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా మలబద్ధకం వంటి అనారోగ్యాల బారిన పడవచ్చు. సీతాఫలాలను అధికంగా తింటే, కొందరు అసాధారణంగా బరువు పెరిగే అవకాశం ఉంది. ఈ పండ్ల నుంచి పెద్దమొత్తంలో కేలరీలు శరీరానికి అందుతాయి. ఫలితంగా స్థూలకాయం బారిన పడవచ్చు. ఈ సమస్య కారణంగా గుండె జబ్బులు, స్ట్రోక్, మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదం సైతం పెరుగుతుంది. అందుకే కస్టర్డ్ యాపిల్స్‌ను పరిమితంగానే తినాలని వైద్యులు సూచిస్తున్నారు.
Also Read: Harish Rao: ఉత్తం గడ్డం తీయలేదు, రేవంత్ రాజకీయం సన్యాసం తీసుకోలేదు: మంత్రి హరీశ్ రావు