Chicken Over Eating: చికెన్ ని ఎక్కువగా తింటున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే?
నాన్ వెజ్ ఇష్టపడని వారు ఉండరు. ముఖ్యంగా నాన్ వెజ్ లో చికెన్ కు ఉన్న క్రేజ్ అంత ఇంతా కాదు. చికెన్ తో ఎన్నో రకాల రెసిపీలను తింటూ ఉంటారు. చికెన
- By Nakshatra Published Date - 09:10 PM, Thu - 27 July 23
నాన్ వెజ్ ఇష్టపడని వారు ఉండరు. ముఖ్యంగా నాన్ వెజ్ లో చికెన్ కు ఉన్న క్రేజ్ అంత ఇంతా కాదు. చికెన్ తో ఎన్నో రకాల రెసిపీలను తింటూ ఉంటారు. చికెన్ కబాబ్, చికెన్ కర్రీ, చికెన్ బిర్యాని, చికెన్ 65 అంటూ ఇలా రకరకాల వంటలను తింటూ ఉంటాం. చాలామంది వారంలో కనీసం నాలుగైదు సార్లు చికెన్ తింటూ ఉంటారు. కొంతమంది అయితే, ముక్క లేనిదే ముద్ద దిగదు అన్నట్లు రోజూ తినేవారు కూడా ఉన్నారు. అయితే చికెన్ ను ఎక్కువగా తినడం మంచిది కాదు అంటున్నారు నిపుణులు. వారానికి రెండు మూడు సార్లు చికెన్ తింటే ఫర్వాలేదు కానీ, వారంలో 3 లేదా 4సార్ల కంటే ఎక్కువ సార్లు తింటే అటువంటి వారికి ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు తప్పవని అంటున్నారు.
మరి చికెన్ ఎక్కువ తినడం వల్ల కలిగే సమస్యల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..చికెన్ పై సాల్మొనెల్లా, క్యాంపీలోబాక్టెర్ బ్యాక్టీరియా ఉంటాయి. అందుకే దీన్ని తీసుకువచ్చిన రెండు మూడు గంటల్లో వండుకోవాలి. అలా కాకుండా ఫ్రిజ్లో పెట్టి కొద్దికొద్దిగా వండుకుంటూ ఉంటే ఈలోగా ఈ బ్యాక్టీరియా పెరిగి పాయిజనింగ్ అవుతుంది.ఇది డయేరియా, నిమోనియా, ఊపిరి ఆడని సమస్యలకు కూడా దారితీస్తుంది. ప్రతిరోజూ చికెన్ తింటే త్వరగా బరువు పెరుగుతారు. చికెన్లో ప్రోటీన్ ఎక్కవగా ఉంటుంది. శరీరం బర్న్ చేయలేని అదనపు ప్రొటిన్ కొవ్వు రూపంలో నిల్వ ఉంటుంది. దీనివల్ల త్వరగా బరువు పెరుగుతారు. చికెన్ ఎప్పుడు తిన్నా కర్రీలా చేసుకొని తినడం మేలు. చికెన్ ఫ్రై ఎక్కువగా తింటే క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది.
శరీరంలో యూరిక్ యాసిడ్ మోతాదు మించితే కడుపులో మంట, కిడ్నీలో రాళ్లు, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, చేతుల వేళ్లు వాపు, మూత్రపిండాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. యాసిడ్ రక్తంలోనే నిలిచిపోతుంది. క్రమంగా ఇవి స్ఫటికాలుగా మారి కీళ్లు, కీళ్ల చుట్టూ ఉండే కణజాలాల్లో పేరుకుపోతాయి. చికెన్ ఎక్కువగా తీసుకుంటే యూరిక్ యాసిడ్ సమస్య వచ్చే ప్రమాదం ఉంది.
Related News
Chicken: చికెన్ ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన ధరలు
Chicken: మార్కెట్ లో కిలో చికెన్ రూ.280 నుంచి రూ.310 ధర పలకగా క్రమేపీ ధరలు తగ్గుతూ వచ్చాయి. సుమారు రూ.80 నుంచి రూ.100 ధర తగ్గడంపై నాన్వెజ్ ప్రియుల ఆనందానికి అవధుల్లేవు. రాష్ట్రంలో కోళ్ళ లభ్యత పెరగడమే ధరలు తగ్గుదలకు కారణంగా వ్యాపారులు చెబుతున్నారు. ఎండలు ముదిరితే కోళ్ళు మృత్యువాత పడతాయని అప్పుడు ధరలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని వ్యాపారులు పేర్కొంటున్నారు.నెల్లూరు బర్ట్ పూర్తి ప్ర�