Kiwi: వేసవికాలంలో కివి ఫ్రూట్ వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం!
కివి ఫ్రూట్ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వేసవిలో కివి తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి అని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 09:03 AM, Tue - 15 April 25

కివి ఫ్రూట్ వల్ల ఎన్నో రకాల లాభాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. కివి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి ఉంటుంది. కాగా కివి మనకు వేసవి కాలంలో ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. ఈ సీజన్ లో కివి పండును ఎక్కువగా తింటే మంచిదట. కాగా కివి పండులో విటమిన్లు, విటమిన్ సి, విటమిన్ ఈ, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయి. ఈ కివి పండును వేసవిలో తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయట.
మరి వేసవిలో కివి ఫ్రూట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాల విషయానికి వస్తే.. కివి పండ్లను ప్రతిరోజు తినడం వల్ల చర్మ సమస్యలు దూరమవుతాయట. ముఖ్యంగా వేసవికాలంలో కివి పండు చర్మ ఆరోగ్యానికి దోహదం చేస్తుందట. కివి పండ్లు విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని గణనీయంగా పెంచుతాయట. వీటిలో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణ ప్రక్రియకు ఎంతగానో దోహదం చేస్తాయని, కివి పండును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎముకలు బలోపేతం అవుతాయట.
కివి పండ్లు కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయట. కివి పండులో ఉండే పోషకాలు విటమిన్ సి, పాలిఫెనాల్స్, పొటాషియం వంటివి గుండె ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయని చెబుతున్నారు. కివి పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మన చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయట. అలాగే వీటిలో ఉండే విటమిన్ సి కారణంగా మన కంటి చూపు మెరుగుపడుతుందట. కివి పండ్లను తింటే మన శరీరంలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందట.