Kidney Stones: మీకు కూడా ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త.. కిడ్నీలో రాళ్ల ప్రమాదమేమో చెక్ చేసుకోండి!
కిడ్నీలో రాళ్లు పడ్డాయి అనడానికి సంకేతంగా కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయని,అవి కిడ్నీలో రాళ్లు పడ్డాయి అనడానికి సంకేతంగా భావించాలని చెబుతున్నారు.
- By Anshu Published Date - 02:34 PM, Thu - 6 February 25

ప్రస్తుత రోజుల్లో చాలామంది కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రతి పదిమందిలో ముగ్గురు ఈ సమస్యతో బాధపడుతున్నారు. కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. అసలు కిడ్నీలో రాళ్ల సమస్యలు ఉన్నాయని ఎలా తెలుస్తుంది? ఏవైనా సంకేతాలు కనిపిస్తాయా అంటే అవును అంటున్నారు వైద్యులు. మరి కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారికి ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కిడ్నీ స్టోన్స్ మూత్ర నాళం యొక్క సూక్ష్మ ప్రమాదాలు. ఇవి ఖనిజ నిక్షేపాల నుండి ఏర్పడతాయి. ఈ రాళ్లు శరీరాన్ని విడిచిపెట్టని ఖనిజాల నిక్షేపాలు అని చెప్పవచ్చు.
ఇది చిన్న నుండి పెద్ద వరకు వెళుతుంది. రాళ్లు పెద్దవి అవుతున్న కొద్దీ విపరీతమైన నొప్పి కనిపిస్తుంది. ఇకపోతే లక్షణాల విషయానికి వస్తే.. మీ దిగువ వీపులో విపరీతమైన నొప్పి ఉంటుంది. నొప్పి ఒక్కసారిగా వెన్నులో ఎవరో కొట్టినట్లు అనిపిస్తుంది. కొన్నిసార్లు ఇది పొత్తి కడుపులో విపరీతమైన నొప్పిని కూడా కలిగిస్తుంది. తరచుగా మూత్ర విసర్జన చేయాలనే పెరుగుతుంది. కానీ మూత్ర విసర్జన సరిగా జరగక పోవడంతో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. మూత్రవిసర్జన సమయంలో నొప్పి లేకుండా వాపు, మూత్రం రంగు పసుపు లేకుండా గోధుమ రంగులోకి మారినట్లయితే యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ కు మరో సూచికగా ఉండే దుర్వాసనతో కూడిన మూత్రం కూడా మూత్రపిండాల్లో రాళ్లకు సూచిక కావచ్చని చెబుతున్నారు.
కాగా ఆక్సలేట్ కణాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మూత్రపిండాల్లో రాళ్లు సంభవం పెరుగుతోంది. పీనట్ బటర్, చాక్లెట్, బచ్చలికూర, కాఫీ, బీర్ వంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలు పెరుగుతాయట. కొన్ని పర్యావరణ పరిస్థితులు కూడా మూత్రపిండాల్లో రాళ్లకు దారితీస్తాయని చెబుతున్నారు. అంటే వేడి ప్రాంతాల్లో నివసించే వారు ఈ పరిస్థితికి ఎక్కువగా గురవుతారట. ఎందుకంటే వాతావరణంలోని వేడి ప్రభావం నుండి చల్లబరచడానికి శరీరం ఎక్కువ నీటిని ఉపయోగిస్తుంది కాబట్టి మూత్రం ఎక్కువ గాఢమవుతుంది. ఈ కిడ్నీలో ప్రాబ్లం రాకూడదు అంటే సరైన మోతాదులో నీటిని తీసుకోవాలి. నీరు బాగా తీసుకున్నప్పుడే కిడ్నీలో ప్రాబ్లంలు రావు.