Liver : మీ లివర్ బాగుందా..? డేంజర్ లో ఉందా..? అనేది ఈ లక్షణం తో తెలిసిపోతుంది
Liver : ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చు. కాలేయం బలహీనపడినప్పుడు బిలిరుబిన్ అనే పదార్థం రక్తంలో అధికమై, చర్మం పసుపు రంగులోకి మారుతుంది
- By Sudheer Published Date - 07:00 AM, Sat - 21 June 25

మన శరీరంలో గుండె, కిడ్నీలతో పాటు కాలేయం (Liver ) కూడా కీలకమైన అవయవం. మనం తీసుకునే ఆహారం నుంచి శక్తిని అందించడంతో పాటు, శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపించటంలో కాలేయం ముఖ్య పాత్ర పోషిస్తుంది. రక్తం నియంత్రణ, జీర్ణక్రియను సమతుల్యంగా నిర్వహించటం వంటి పనులు కూడా ఈ అవయవం బాధ్యతగా తీసుకుంటుంది. కానీ కాలేయ ఆరోగ్యంపై చాలా మందిలో అవగాహన లేకపోవడం గమనించదగ్గ విషయం.
Yogandhra 2025 : మోడీకి ఘనస్వాగతం పలికిన చంద్రబాబు , పవన్ కళ్యాణ్
కాలేయానికి ముప్పుగా మారే అంశాల్లో ఆల్కహాల్ వినియోగం, అధిక చెక్కరతో కూడిన ప్రాసెస్డ్ ఫుడ్, కొన్నిరకాల ఆహార పదార్దాలు కాలేయ పనితీరును దెబ్బతీయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దీర్ఘకాలికంగా ఉపయోగించినప్పుడు కాలేయ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. కాలేయంలో సమస్యలు ప్రారంభమైనప్పుడు కొన్ని లక్షణాలు బయటపడతాయి. తరచూ కడుపునొప్పి, కాళ్ల వాపు, మలం మరియు మూత్రం రంగు మారడం, కళ్లు పసుపు రంగులోకి మారడం వంటి సూచనలను మనం నిర్లక్ష్యం చేయకూడదు.
Soundarya Son : హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సౌందర్య కొడుకు..!!
ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం ద్వారా సమస్యను ప్రారంభ దశలోనే గుర్తించవచ్చు. కాలేయం బలహీనపడినప్పుడు బిలిరుబిన్ అనే పదార్థం రక్తంలో అధికమై, చర్మం పసుపు రంగులోకి మారుతుంది. అలాగే అలసట, కడుపు మంట, కదిలినప్పుడు నొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఎక్కువగా మద్యం సేవించడం చేస్తే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. కాలేయ సంబంధిత లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా, ప్రారంభ దశలోనే వైద్య సలహాతో చికిత్స తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.