HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Is Ivy Gourd Good For Health

Ivy Gourd: దొండకాయ తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే!

మన వంటింట్లో దొరికే కాయగూరలలో దొండకాయ కూడా ఒకటి. దొండకాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. దొండకాయతో రకరకాల కూరలు కూడా తయారు చేస్తూ ఉంటారు.

  • Author : Anshu Date : 23-07-2024 - 3:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 23 Jul 2024 04 04 Pm 7441
Mixcollage 23 Jul 2024 04 04 Pm 7441

మన వంటింట్లో దొరికే కాయగూరలలో దొండకాయ కూడా ఒకటి. దొండకాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. దొండకాయతో రకరకాల కూరలు కూడా తయారు చేస్తూ ఉంటారు. అయితే కొందరు దొండకాయను తెగ ఇష్టంగా తింటే మరికొందరు తినడానికి అంతగా ఇష్టపడరు. ఈ దొండకాయలు వేసవి కాలంలో మాత్రమే మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే దొండకాయల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మనల్ని ఎన్నో వ్యాధుల నుంచి రక్షిస్తుంది. మరి దొండకాయ తినడం వల్ల కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

దొండకాయ డయాబెటీస్ పేషెంట్లకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఎండాకాలంలో తినడం వల్ల వీరికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయట. ఎందుకంటే దొండకాయను తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయట. ఈ కూరగాయ యాంటీ హైపర్గ్లైసీమిక్ ప్రభావాలను కలిగి ఉంటుందని, ఇవి డయాబెటిస్ ను నిర్వహించడానికి సహాయపడతాయని వైద్యులు చెబుతున్నారు. ఈ కూరగాయలో కార్బోహైడ్రేట్ పరిమాణం కూడా చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఫైబర్ మాత్రం పుష్కలంగా ఉంటుంది. ఇలాంటి కూరగాయను తినడం వల్ల కడుపు తొందరగా నిండుతుందట. తొందరగా ఆకలి వేయదు. దొండకాయ రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మత్తుగా పెరగకుండా కాపాడుతుందట.

మాములుగా మగవారికంటే ఆడవారే ఎక్కువగా రక్తహీనత సమస్యతో బాధపడుతుంటారు. అయితే ఇలాంటి వారికి దొండకాయ మంచి ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. అలాగే ఈ కూరగాయలో మంచి మొత్తంలో ఇనుము ఉంటుందటం ఇది హిమోగ్లోబిన్ ను పెంచడానికి సహాయపడుతుందని చెబుతున్నారు వైద్యులు. దొండకాయలో ఉండే విటమిన్ సి ఐరన్ శోషణను పెంచడానికి సహాయపడుతుందట. అలాగే ఇది మన రోగనిరోధక శక్తిని పెంచి మిమ్మల్ని ఎన్నో రోగాలకు, సంక్రమణలకు దూరంగా ఉంచుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • eating Ivy Gourd
  • health tips
  • ivy gourd
  • Ivy Gourd benefits

Related News

Here are the health benefits of eating these nuts daily... Once you know their benefits, you won't be able to resist eating them!

Brazil Nuts: రోజూ ఈ నట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.. వీటి బెనిఫిట్స్ తెలిస్తే తినకుండా ఉండలేరు!

కాసేపు పనిచేయగానే అలసిపోతున్నారా..? ఏమాత్రం ఓపిక ఉండట్లేదా? రోగనిరోధక శక్తి క్షీణిస్తోందా? అయినా నో ప్రాబ్లం..! రోజుకు మూడు బ్రెజిల్ నట్స్ తింటే మీలోని ఈ సమస్యలన్నీ దాదాపు రెండు వారాల్లో తగ్గిపోతాయంటున్నారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే.. వాటిలో శరీరానికి అత్యవసరమైన సెలీనియం సమృద్ధిగా ఉంటుంది. ఇది నేలలో, నీటిలో మరియు కొన్ని ఆహారాలలో లభించే ముఖ్యమైన పోషకం. ఇది మార్కెట్లలో

  • Have you never drunk goat milk? Once you know this, you'll start drinking it immediately!

    Goat Milk: మేకపాలు ఎప్పుడూ తాగలేదా? ఈ విషయం తెలిస్తే వెంటనే తాగడం మొదలుపెడతారు!

Latest News

  • Sree Charani: ఐసీసీ టీ20 బౌలింగ్‌ నంబర్ 1 ర్యాంకుల్లో తెలుగమ్మాయి శ్రీచరణి హవా.. ఏపీ గర్విస్తోందన్న మంత్రి లోకేశ్

  • CI Nagaraju: సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్

  • Telegram: మళ్లీ టెలిగ్రామ్ సేవలు అందుబాటులోకి

  • George Kurian: కేంద్ర మంత్రి పదవికి జార్జ్ కురియ‌న్ రాజీనామా

  • Men Skincare: మగవారికి కూడా మెరిసే చర్మం కావాలంటే ఇలా చేయాల్సిందే!

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd