Chicken: వామ్మో చికెన్ అధికంగా తింటే అంత భయంకరమైన జబ్బులు వస్తాయా.. ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిందే!
చికెన్ తినడం ఆరోగ్యానికి మంచిదే కానీ క్రమం తప్పకుండా ఎక్కువగా తీసుకుంటే మాత్రమే ఇది అనేక సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి చికెన్ ఎక్కువగా తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం..
- By Anshu Published Date - 01:00 PM, Sun - 18 May 25

చికెన్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అన్న విషయం తెలిసిందే. చికెన్ ని తరచుగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ ఎక్కువగా తీసుకుంటే మాత్రం సమస్యలు తప్పవు. కొంతమంది వారానికి ఎప్పుడు ఒక్కసారి మాత్రమే చికెన్ తింటే మరి కొందరు వారంలో కనీసం నాలుగు సార్లు అయినా చికెన్ తింటూ ఉంటారు. అయితే ఇలా చికెన్ ను ఎప్పుడు పడితే అప్పుడు, మోతాదుకు మించి తీసుకోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయి అని చెబుతున్నారు. అయితే చికెన్ ను ఎంత మోతాదులో ఎంత తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
చికెన్ లో ప్రొటీన్ అధికంగా ఉంటుందట. ఈ మాంసం తినడం వల్ల బలం వస్తుందని, పిల్లలకు కూడా పెట్టవచ్చని వైద్యులు చెబుతున్నారు. కాగా విటమిన్ బి12, కొలైన్ పుష్కలంగా ఉంటాయట. ఇది పిల్లల్లో నరాల వ్యవస్థను మెరుగు పరుస్తాయట. ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ అతిగా తింటే మాత్రం ఇబ్బందులు తప్పవట. వారానికి 300 గ్రాములకు మించి చికెన్ తింటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందట. అయితే ఈ సమస్య మహిళల్లో కన్నా పురుషుల్లోనే ఎక్కువగా ఉండే అవకాశముందట. అందుకే వీలైనంత వరకూ చికెన్ వాడకాన్ని తగ్గించాలని చెబుతున్నారు.
వారానికి 300 గ్రాముల కంటే ఎక్కువ చికెన్ తింటే క్యాన్సర్ రావడం పక్కా అని చెబుతున్నారు. ఇదే విషయాన్ని కొన్ని వేల మంది పై అధ్యయనం చేసినట్లు వైద్యులు చెబుతున్నారు. మాంసం ఎక్కువగా తీసుకుంటున్న వారిలో పెద్ద పేగు క్యాన్సర్ వచ్చిన వాళ్లున్నారు. దీంతో పాటు పాంక్రియాటిక్ సమస్యలు, లివర్ జబ్బులు, కడుపు నొప్పి, రెక్టల్ క్యాన్సర్ లాంటి భయంకరమైన సమస్యలు వస్తాయట. ఇలా పరిమితికి మించి మాంసం తింటున్న వాళ్లలో సుమారు 27 శాతం మంది ఏదో ఒక జబ్బుతో ఇబ్బంది పడుతున్నట్లు వైద్యులు తెలిపారు. వీళ్లలో పురుషులే ఎక్కువగా ఉన్నారు. వారానికి 200 గ్రాముల చికెన్ తిన్న వాళ్లలోనూ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ క్యాన్సర్ వస్తుందట.