Banana: ప్రతీ రోజు అరటిపండు తింటే బరువు తగ్గుతారా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?
అరటిపండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, బరువు తగ్గిస్తాయని చెబుతున్నారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం
- By Anshu Published Date - 11:33 AM, Wed - 9 April 25

అరటిపండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సీజన్ తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా అరటి పండ్లు మార్కెట్లో లభిస్తూనే ఉంటాయి. తక్కువ ధరకే లభించే ఆరోగ్యకరమైన పండ్లలో అరటిపండు కూడా ఒకటి. చాలామందికి అరటిపండు అంటే ఇష్టం. అందుకే ప్రతిరోజు అరటిపండును డైట్ లో భాగంగా చేర్చుకుంటూ ఉంటారు. మామూలుగా అరటిపండు తింటే కొంతమంది బరువు పెరుగుతారని మరి కొంతమంది బరువు తగ్గుతారని అంటూ ఉంటారు. ఈ విషయం గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మరి ముఖ్యంగా ప్రతిరోజు అరటిపండు తింటే నిజంగానే బరువు తగ్గుతారా? ఈ విషయంలో నిజానిజాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
అరటిపండులో పోషకాలు మెండుగా ఉంటాయి. ఇందులో ఎక్కువగా పొటాషియం ఉంటుంది. ఇది అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తుందట. అలాగే అరటిలో సహజ చక్కెర అధికంగా ఉంటుందట. దీనిని రోజు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుందట. అంతేకాకుండా మెగ్నీషియం, విటమిన్ బి 6, ఫాస్పరస్ వంటి విటమిన్లు, ఖనిజాలు ఇందులో లభిస్తాయట. అరటిపండ్లు కార్బోహైడ్రేట్లకు మంచి మూలం. ముఖ్యంగా గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ వంటి సహజ చక్కెరలు అరటిపండులో ఉంటాయట. ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయని చెబుతున్నారు. కాగా ఏదైనా చిరుతిండి బదులు అరటిపండు తినడం వల్ల శరీరానికి కావాల్సినంత శక్తి అందుతుందట. ఇది ఎనర్జీ బూస్టర్ లా పనిచేస్తుందని చెబుతున్నారు. అరటిపండు తీసుకోవడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుందట. అరటి పండులో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయట.
ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయని, ధమనులలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి బయటకు పంపడంలో సహాయపడుతుందని చెబుతున్నారు. అలాగే అరటిపండ్లలో కాల్షియం, మెగ్నీషియం లభిస్తాయట. ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయట. దీన్ని తినడం వల్ల ఆస్టియోపోరోసిస్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని, ఎముకల బలం కోసం రోజుకి కనీసం ఒక అరటిపండు తినాలని చెబుతున్నారు. అరటిపండ్లలో విటమిన్ బి6 ఉంటుంది. ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుందట. ఇది మానసిక ఒత్తిడి, ఆందోళన, నిరాశను తగ్గించడంలో సహాయపడుతుందట. ఈ రోజుల్లో చాలా మంది వర్క్ లైఫ్‌స్టైల్ కారణంగా చాలా మంది ఒత్తిడి సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారికి అరటిపండు మంచి ఆప్షన్ అని చెప్పాలి. బరువు తగ్గాలనుకునేవారికి అరటిపండు బెస్ట్ ఆప్షన్ అని చెప్పాలి. రోజూ అరటిపండు మితంగా తింటే బరువు తగ్గవచ్చట. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల ఆకలి అదుపులో ఉంటుందట. కేలరీల సంఖ్య కూడా తక్కువే. అరటిపండులో సహజ తీపి ఉంటుందట. దీంతో, ఇది తినడం వల్ల సహజ తీపి తినాలనే కోరిక ఉండదని చెబుతున్నారు.. అయితే అరటి పండ్లు తినడం మంచిదే కానీ బ్రేక్ ఫాస్ట్ తర్వాత దీనిని తింటే మంచి ప్రయోజనాలు కలుగుతాయట. ఒక అరటిపండు మాత్రమే తినాలని చెబుతున్నారు.