Indoor Plants: గాలిని శుద్ధి చేయడంలో సహాయపడే ఇండోర్ మొక్కలు
ఉరుకులపరుగుల జీవితంలో ఆరోగ్యంపై ప్రతిఒక్కరికి శ్రద్ధ తగ్గిపోయింది. లైఫ్ ఒక మెషిన్ లా మారిపోయింది. కనిపించింది తినడం, విష వాయువు పీల్చడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
- Author : Praveen Aluthuru
Date : 03-06-2023 - 3:49 IST
Published By : Hashtagu Telugu Desk
Indoor Plants: ఉరుకులపరుగుల జీవితంలో ఆరోగ్యంపై ప్రతిఒక్కరికి శ్రద్ధ తగ్గిపోయింది. లైఫ్ ఒక మెషిన్ లా మారిపోయింది. కనిపించింది తినడం, విష వాయువు పీల్చడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. ముఖ్యంగా వాతావరణం పూర్తిగా విషంగా మారిపోతుంది. చెట్లు, మొక్కలు ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా వాతావరణాన్ని ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంచుతాయి. గాలిని శుద్ధి చేయడంలో చెట్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. దీని వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. కానీ ఇప్పుడు క్రమంగా మన చుట్టూ ఉన్న చెట్లు, మొక్కలు తగ్గిపోతున్నాయి. దీని వల్ల కాలుష్య సమస్య పెరుగుతోంది.
స్వచ్ఛమైన గాలి కోసం ప్రతి ఒక్కరు ఇంట్లో మొక్కలను నాటడానికి ప్రయత్నం చేయండి. ఇండోర్ మొక్కలను బాల్కనీ లేదా నివసించే ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవచ్చు. కాబట్టి ఇవి మీ ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా గాలిని శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి.
కలబంద:
అలోవెరా ఇంటి పరిసర ప్రాంత గాలిని శుద్ధి చేస్తుంది. అలాగే ఇది మీ ఇంటి అందాన్ని పెంచుతుంది. ఇది ఆరోగ్యానికి, చర్మం మరియు జుట్టుకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మొక్కకు నీరు ఎక్కువగా పెట్టవద్దు. కలబంద మొక్కకు 3-4 రోజులకు ఒకసారి నీరు అందించాలి.
మనీ ప్లాంట్:
ఈ మొక్క మీ ఇంట్లో సానుకూల శక్తిని నింపుతుంది. ఈ మొక్కను నాటడం ద్వారా స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవచ్చు. దీని ద్వారా మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఈ మొక్క కాలుష్యం స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. కుండతో పాటు, సీసాలో కూడా మనీ ప్లాంట్ పెంచవచ్చు.
స్నేక్ ప్లాంట్:
ఈ మొక్క గాలిని శుద్ధి చేస్తుంది. మీరు ఇంట్లో ఎక్కడైనా ఈ మొక్కను నాటవచ్చు. స్నేక్ ప్లాంట్‌కు ఎక్కువ సూర్యకాంతి అవసరం లేదు. నీరు కూడా తక్కువ పరిమాణంలో అవసరం.
తులసి మొక్క:
తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది అనేక ఔషధాలలో కూడా ఉపయోగించబడుతుంది. తులసి ఆకులను పూజలో కూడా ఉపయోగిస్తారు. మీకు కావాలంటే ఈ మొక్కను బాల్కనీలో పెంచుకోవచ్చు.
బోస్టన్ ఫెర్న్:
ఈ మొక్క ఇంట్లోని కలుషితమైన గాలిని తొలగిస్తుంది. ఈ మొక్కను ప్రతి ఇంట్లోనూ పెంచుకోవడం ద్వారా వాతావరణాన్ని కాపాడినవారవుతారు. ఈ ప్లాంట్ కి పుష్కలంగా నీరు అవసరం ఉంటుంది.
Read More: Plants: మొక్కలు మన మానసిక స్థితిని ఎలా మార్చగలవు..?