Brain Health : మీ మెదడు కంప్యూటర్ కంటే ఫాస్ట్‌గా పనిచేయాలంటే డైట్లో వీటిని చేర్చుకోండి.
- By hashtagu Published Date - 12:11 PM, Wed - 12 April 23
మెదడు (Brain Health).. శరీరం యొక్క నియంత్రణ కేంద్రం అంటారు. శరీరం యొక్క ముఖ్యమైన అవయవంగా పరిగణిస్తారు . మెదడు శరీరం సరైన పని నిర్వాహణ కోసం అనేక విధులను నిర్వర్తిస్తుంది. శరీరంలో ఇతర భాగాలకు పోషకాలు అవసరం. కాబట్టి మెదడు సరిగ్గా పని చేయడానికి పోషకాలు అధికంగా ఉండే ఆహారం కూడా చాలా అవసరం. మెదడు ఆరోగ్యానికి ఫైబర్, విటమిన్లు, ఖనిజాలతో కూడిన పోషకాహారం అందించాలి. ఫుడ్స్ హెల్త్ ప్రకారం మెదడు ఆరోగ్యం అనేది మన మొత్తం ఆరోగ్యంలో కీలకమైన భాగం. కమ్యూనికేట్ చేయడం, నిర్ణయాలు తీసుకోవడం, సమస్యలను పరిష్కరించడం, అన్ని వయసుల వారితో ఉత్పాదక ఉపయోగకరమైన జీవితాన్ని గడపడం, వంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల మెరుగైన మెదడు ఆరోగ్యం, ఉత్తమ జ్ఞాపకశక్తిని పెంపోందించడం కోసం మీ ఆహారంలో చేరుకోవాల్సిన కొన్ని ఆహారాల జాబితా గురించి తెలుసుకుందాం.
జ్ఞాపక శక్తిని పెంచే ఆహారాలు:
బ్లూబెర్రీస్:
బ్లూ బెర్రీస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఫైబర్, కొవ్వు ఆమ్లాలు, ఖనిజాలు, ఐరన్, విటమిన్లు, వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని సూపర్ ఫుడ్ అని కూడా పిలుస్తారు. ఒత్తిడిని తగ్గించడంతోపాటు గుండెజబ్బులను నివారించడం, జ్ఞాపకశక్తి మెరుగుపరచడంలో కీలకంగా పనిచేస్తుంది. హెల్త్ లైన్ ప్రకారం బ్లూబెర్రీస్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తాయి. అంతేకాదు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి.
బ్రోకోలి:
ఇది చూడడానికి క్యాబేజీ లానే ఉంటుంది. కానీ ఇందులో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. శరీరానికి ప్రోత్సహించే వివిధ రకాల పోషకాలతో కూడి ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ సమ్మేళనాలు ఉన్నాయి. అంతేకాదు విటమిన్ కె గొప్ప మూలం. ఇది శరీరంపై శోధక నిరోధకాల ప్రభావం కలిగి ఉంటుంది. విటమిన్ కె అనేది అభిజ్ఞ పరిధిలో మెరుగుపరుస్తుంది. అంతేకాదు మెదడు శక్తి కూడా మెరుగుపరుస్తుంది. కాబట్టి బ్రోకలీని నిత్యం ఆహారంలో చేర్చుకోవడం ఉత్తమం.
గింజలు:
బాదం, పిస్తా వంటి గింజలు జ్ఞాపకశక్తిని పెంచుతాయి. మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. హెల్త్ లైన్ ప్రకారం గింజల్లో విటమిన్ ఆరోగ్యకరమైన కొవ్వులు, మొక్కల సమ్మేళనాలతో సహా మెదడు ఆరోగ్యాన్ని పెంచే పోషకాలు ఎన్నో ఉన్నాయి.
నారింజ:
నారింజలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది మానసిక క్షీణత నివారించడంలో ఎంతో కీలకంగా సహాయపడుతుంది. విటమిన్ సి వయసు సంబంధిత సమస్యల నుంచి మెదడును రక్షించడంలో కూడా సహాయపడుతుంది. విటమిన్ సి మెదడు కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ తో పోరాడేయడానికి సహాయపడమే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ అని హెల్త్ లైన్ పేర్కొంది. విటమిన్ సి మీ వయసులో మెదడు ఆరోగ్యానికి మద్దతిస్తుంది. మేజర్ డిప్రెసింగ్, డిజార్ట్లోనియా, అల్జిమర్స్ వంటి వ్యాధుల నుంచి నారింజ రక్షిస్తుంది
గుడ్లు:
నిత్యం ఒక గుడ్డు తినాలని డాక్టర్ సిఫార్సు చేస్తుంటారు. ఎందుకంటే గుండెలో ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది. ఇది మెదడు ఆరోగ్యానికి జ్ఞాపకశక్తిని పెంపొందించడానికి ఎంతగానో సహాయపడుతుంది. విటమిన్లు కొలిన్ గొప్ప మూలం. మెదడు పనితీరును అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఎంతగానో సహాయపడుతుంది.
Related News
Brain Health : మెదడును చురుగ్గా ఉంచే 7 చిట్కాలు.. ట్రై చేయండి
ఈ బిజీ బిజీ లైఫ్ లో మెదడుపై ఒత్తిడి పడకుండా చూసుకోవడం అంత తేలికైన పని కాదు. అందుకే మెదడుపై అధికంగా ఒత్తిడి పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.