Heart Attack: మీ శరీరంలో ఈ లక్షణాలు ఉంటే గుండెపోటు వచ్చే ప్రమాదం.. ఒక్కసారి చూసుకోండి
ఈ మధ్య గుండెపోట్లు ఎక్కువైపోతున్నాయి. ఒకప్పుడు పెద్దవారికి మాత్రమే గుండెపోటుతో చనిపోయేవారు. కానీ ఈ మధ్య యువకులు కూడా గుండెపోటుకు మరణిస్తున్నారు. గత కొద్దిరోజులుగా హార్ట్ అటాక్‌తో చనిపోయేవారు ఎ
- By Nakshatra Published Date - 04:18 PM, Sun - 5 March 23

Heart Attack: ఈ మధ్య గుండెపోట్లు ఎక్కువైపోతున్నాయి. ఒకప్పుడు పెద్దవారికి మాత్రమే గుండెపోటుతో చనిపోయేవారు. కానీ ఈ మధ్య యువకులు కూడా గుండెపోటుకు మరణిస్తున్నారు. గత కొద్దిరోజులుగా హార్ట్ అటాక్‌తో చనిపోయేవారు ఎక్కువయ్యారు. సడెన్ గా గుండెలు ఆగిపోతున్నాయి. దీంతో సెకన్లలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. జిమ్ చేస్తూ, గేమ్ లు ఆడుతూ లేదా రోడ్డు దాటుతూనే సడెన్ గా గుండెపోటుకు బలైపోతున్నారు.
అయితే గుండెపోటు రాకుండా మనన్ని మనం రక్షించుకోవాలి. అంతుకోసం కొన్ని జాగ్రత్తలు పాటించాని డాక్టర్లు చెబుతున్నారు. స్మోకింగ్ అలవాటు ఉంటే మానేయడం మంచిదని చెబుతున్నారు. సిగరేట్ లో ఉండే రసాయనాలు రక్తాన్ని చిక్కగా చేస్తాయి. దీంతో వల్ల శరీరంలో రక్తం గడ్డకడుతుందని, రక్తం గుండెకు సరిగ్గా ప్రవహించకపోవడం వల్ల గుండెపోటుకు గురవుతారని అంటున్నారు.
అలాగే అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవడం మంచిదని సూచిస్తున్నారు. అధిక రక్తపోటు వల్ల గుండెకు ఆక్సిజన్, రక్తం ప్రవాహం తగ్గుతుందని అంటున్నారు. ఇది గుండెపోటుకు దారి తీస్తుందని, అధిక రక్తపోటు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే అధిక కొలెస్ట్రాల్ కూడా గుండెపోట్లకు కారణమని అంటునన్నారు. శరీరంలో ఉండే అధిక కొలెస్ట్రాల్ రక్తాన్ని సాఫీగా ప్రవహించకుండా చేస్తోంది.
ఇక డయాబెటిస్ కూడా గుండె జబ్బులకు కారణమంటున్నారు. శరీరంలో చక్కెర శాతం ఎక్కువ లేకుండా చూసుకోవాలి. డయాబెటిస్ ఎక్కువగా ఉండటం వల్ల ఆక్సిజన్, పోషకాలను గుండెకు సరఫరా చేయకుండా అడ్డుకుంటుంది. దీంతో డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచుకోవాలి. అలాగే ఊబకాయం, అధిక బరువు కూడా హార్ట్ ఎటాక్ లు రావడానికి కారణమంటున్నారు. అధిక బరువు వల్ల శరీరంలో రక్తాన్ని సరఫరా చేసే ధమనులు దెబ్బతింటాయి.

Related News

Ramadan 2023: రంజాన్ ఉపవాస సమయంలో మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే.
పవిత్ర రంజాన్ (Ramadan) ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఎంతో నిష్టతో ఈ రంజాన్ ఉపవాసాన్ని(ramadan fasting) పాటిస్తుంటారు. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇతర ముస్లిం దేశాలలో మార్చి 21 సాయంత్రం చంద్రుడు కనిపించినప్పుడు రంజాన్ ఈ సంవత్సరం మార్చి 22 న ప్రారంభమైంది.