Risk Of Diabetes : రోజూ వీటిని తింటే మధుమేహం వస్తుందన్న టెన్షన్ ఉండదు.!!
డయాబెటిస్...ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి. దాదాపు పది మందిలో ఆరుగురు డయాబెటిస్ బారిన పడుతున్నారు.
- By hashtagu Published Date - 09:30 AM, Thu - 6 October 22

డయాబెటిస్…ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి. దాదాపు పది మందిలో ఆరుగురు డయాబెటిస్ బారిన పడుతున్నారు. దీనికి కారణం మారుతున్న జీవనశైలి. శరీరంలో ఇన్సులిన్ తన పనిని సరిగ్గా చేయలేనప్పుడు రక్తంలో గ్లూకోజ్ పేరుకుపోతుంది. రక్తకణాల్లో అధికంగా గ్లూకోజ్ చేరడం వల్ల షుగర్ లెవల్స్ పెరిగిపోతాయి. మీ శరీరంలో బ్లడ్ షుగర్ స్థాయిని తగ్గించే కొన్ని సూపర్ ఫుడ్స్ ఉన్నాయి. మనం ఏది తిన్నా మన రక్తంలోని షుగర్ లెవల్స్ ను ప్రభావితం చేస్తాయి. అలాంటి పరిస్థితిలో రక్తంలో షుగర్ లెవల్స్ ను తగ్గించడంలో సహాయపడే వాటి గురించి తెలుసుకుందాం.
దాల్చిన చెక్క:
డయాబెటిస్ పేషంట్లలో బాడీమాస్ ఇండెక్స్ ను తగ్గించడానికి దాల్చిన చెక్కను ఉపయోగిస్తారు. దాల్చిన చెక్కలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దాల్చిన చెక్కను ఏవిధంగానైనా సరే తినవచ్చు. ఇది శరీరంలోని లిపిడ్ స్థాయిలను తగ్గిస్తుంది. రక్తంలో షుగర్ లెవల్స్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.
బెండకాయ:
బెండకాయ ఫ్లెనాయిడ్లకు మంచి మూలం. ఫ్లేవనాయిడ్స్ అనేది యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బెండకాయలో పాలీశాకరైడ్ అనే సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. పాలీశాకరైడ్స్ శరీరంలో రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గించడంలో పనిచేస్తాయి.
పెరుగు;
మీరు షుగర్ లెవల్స్ ను తగ్గించుకోవాలనుకుంటే ప్రోబయెటిక్స్ అధికంగా ఉండే పులియబెట్టిన ఆహారాలు తీసుకోవాలి. పెరుగు షుగర్ లెవల్స్ తగ్గించడంలో సహాయపడుతుంది.
చిక్కుళ్ళు:
అన్ని రకాల కాయధాన్యాల్లో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియ సాఫీగా సాగేలా సహాయపడుతుంది. వీటిని తరచుగా ఆహారంలో తీసుకుంటే షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి.
గుమ్మడి:
గుమ్మడి గింజలు, అవిసె గింజలు, చియాగింజలు మొదలైన విత్తనాల్లో పలు పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందులో ఫైబర్, యాంటీయాక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి రక్తంలో అధిక చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి.
తృణధాన్యాలు :
చిక్కుళ్ల వలే కరిగే ఫైబర్ తృణధాన్యాల్లో కూడా ఉంటుంది. ఓట్స్, క్వినోవా, హోల్ ఎట్ వంటి తృణధాన్యాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తంలో షుగర్ కంట్రోల్లో ఉంటుంది. వాటిని ఉడికించి తిన్నట్లయితే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
గుడ్లు:
గుడ్లు సూపర్ ఫుడ్స్ లో ఒకటి. ఇందులో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. ఉడకబెట్టిన గుడ్లను ప్రతిరోజూ ఆహారంలో చేర్చుకున్నట్లయితే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇన్సులిన్ సెన్నిటివిటీని తగ్గించడంలో సహాయపడతాయి.