Blood markers of health: రక్తం తగ్గితే ఎన్నో సమస్యలు…పెంచుకునే మార్గాలు ఇవే.!!
- By Hashtag U Published Date - 02:25 PM, Sun - 10 April 22

మీలో ఎంత రక్తం ఉంది..? తెలియదా..?అయితే తప్పకుండా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి ప్రశ్న తప్పకుండా ఎదురవుతుంది. బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే హిమోగ్లోబిన్ శాతం తెలుస్తుంది. రక్తం అంటే ఫ్లాస్మా, ఎర్ర రక్తకణాలు, తెల్లరక్తకణాలు, ప్లేట్ లెట్స్ కలయిక. రక్తంలో ఉండే ప్రొటీన్ హిమోగ్లొబిన్. శరీరంలో దీని పాత్ర చాలా కీలకం.
శరీరానికి ఆక్సిజన్ సరఫరా చేయడంలో హిమోగ్లోబిన్ చాలా కీలకంగా పనిచేస్తుంది. కార్బన్ డయాక్సైడ్ శరీరం నుంచి బయటకు పంపించేందుకు వీలుగా ఊపిరితిత్తులకు చేరవేస్తుంది. కొన్ని సందర్భాల్లో హిమోగ్లోబిన్ శాతం కూడా తగ్గిపోతుంది. ఐరన్ లోపం వల్ల కాలేయ సంబంధిత సమస్యలు, గర్భం దాల్చడం వల్ల ఇలా ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. మహిళలకు డెసిలీటర్ రక్తంలో 13 గ్రాములకు తక్కువగా ఉంటే దాన్ని లోపంగా చూడాలి. పురుషుల్లో 13.5 గ్రాములకు తగ్గితే లోపంగా పరిగణించాలి. దీన్ని పెంచుకుంటే శరీర జీవక్రియలకు ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు.
ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకుంటే శరీరంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుందో తెలుసుకుందాం.
ఐరన్:
మనం నిత్యం తీసుకునే ఆహారంలో ఐరన్ తగినంతగా ఉండేలా చూసుకోవాలి. హిమోగ్లోబిన్ ప్రొటీన్ కు ఐరన్ పోషకంగా వ్యవహరిస్తుంది. బీన్స్, పాలకూర, గోంగూర, షెల్ ఫిష్ తీసుకోవడం వల్ల ఐరన్ తగినంతగా లభిస్తుంది.
వీటితో జాగ్రత్త:
శరీరం ఐరన్ ను గ్రహించాలంటే దానికి విటమిన్ సి, ఏ కీలకంగా పనిచేస్తాయి. కాబట్టి విటమిన్ సీ, ఏ తగినంతగా ఉండేలా చూసుకోవాలి. ఐరన్ ను శరీరం గ్రహించకుండా క్యాల్షియం అడ్డుకుంటుంది. కాబట్టి హిమోగ్లోబిన్, రక్తం తక్కువగా ఉన్నవారు క్యాల్షియం ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా డైరీ ఉత్పత్తులు, సోయాబీన్స్, ఫిగ్స్ వంటి తక్కువగా తీసుకోవాలి.
ఫొలేట్:
ఇది విటమిన్ బీ9. హిమోగ్లోబిన్ లోని హిమో ఉత్తత్తికి ఫొలేట్ పనిచేస్తుంది. అంతేకాదు ఎర్రరక్త కణాలు వృద్దికి తోడ్పడుతుంది. అందుకే హిమోగ్లోబిన్ పెరగడానికి ఫొలేట్ ఎక్కువగా లభించే క్యాబేజీ, పాలకూర, చిప్ పీస్ కిడ్నీ బీన్స్, ఆకుపచ్చని కూరగాయాలను ఎక్కువగా తీసుకోవాలి.
సప్లిమెంట్స్:
ఐరన్ ను పెంచేందుకు చాలా ఔషదాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని వైద్యుని సూచనల మేరకు మాత్రమే తీసుకోవాలి. అదే సమయంలో వీలైనంత వరకు ఆహారం ద్వారా ఐరన్, ఫోలిక్ యాసిడ్ అందేలా చూసుకోవాలి. మహిళలు, చిన్నారులు, పెద్దవాళ్లు కనీసం ఆరు నెలలు, ఏడాదికి ఒకసారి వైద్య నిపుణులను సంప్రదించి పరీక్షల ద్వారా వీటిని నిర్దారించుకోవాలి.