Blood: ఒంట్లో రక్తం తక్కువగా ఉందా.. అయితే ఉదయం పూట ఈ జ్యూస్ తాగాల్సిందే?
చాలామంది ప్రస్తుతం రక్తహీనత సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఒంట్లో సరిగ్గా రక్తం లేక ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో చాలామంది
- Author : Anshu
Date : 05-02-2024 - 8:32 IST
Published By : Hashtagu Telugu Desk
చాలామంది ప్రస్తుతం రక్తహీనత సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఒంట్లో సరిగ్గా రక్తం లేక ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో చాలామంది ఒంట్లో రక్తంని పెంచుకోవడం కోసం రకరకాల మెడిసిన్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా మహిళలకు రుతుస్రావం సమయంలో ఎక్కువ రక్తం పోవడం వల్ల వాళ్లకు రక్త హీనత సమస్య వస్తుంటుంది. మరికొందరిలో ఇతర సమస్యల వల్ల రక్తం తక్కువగా ఉంటుంది. అయితే మన ఇంట్లో వంటింటి చిట్కాలతో ఒంట్లో రక్తాన్ని అమాంతం పెంచుకోవచ్చు. ఎటువంటి టాబ్లెట్స్ అవసరం లేకుండానే జ్యూసులతోనే రక్తాన్ని పెంచుకోవచ్చు.
మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయాన్ని వస్తే.. సాధారణంగా పురుషులకైతే.. 13. 5 నుంచి 16. 5 గ్రాముల హిమోగ్లోబిన్ ఉండాలి. మహిళలకు అయితే12 నుంచి 15 గ్రాముల హిమోగ్లోబిన్ ఉండాలి. ప్రెగ్నెంట్ మహిళలకు అయితే 10 నుంచి 15 మధ్యలో ఉండాలి. మన ఒంట్లో రక్తం పెరగాలంటే మన ఆహారంలో ఖచ్చితంగా ఐరన్ ఎక్కువగా ఉండాలి. మహిళలకు ప్రతి రోజు 30 గ్రాముల ఐరన్ అవసరం అవుతుంది. పురుషులకు అయితే రోజూ 28 గ్రాముల ఐరన్ అవసరం అవుతుంది. తినే ఆహారంలో ప్రతిరోజూ ఎక్కువ ఐరన్ ఉండేలా చూసుకోవాలి. రక్తం త్వరగా పెరగాలి అంటే రోజూ ఉదయం క్యారెట్ జ్యూస్ తాగాలి.
పండ్ల రసాలు కంటే క్యారెట్ జ్యూస్ మేలు. షుగర్ లాంటి సమస్యలు లేని వాళ్లు అయితే క్యారెట్, బీట్ రూట్ జ్యూస్ తాగవచ్చు. ఉదయం పూట రెండు క్యారెట్లు, బీట్ రూట్, టమాట, కీర దోశతో కూడా జ్యూస్ చేసుకొని తాగవచ్చు. ఆ జ్యూస్ లో ఎండు ఖర్జూరం పొడి, తేనె కలుపుకొని తాగితే చాలు. ఇలా ప్రతి రోజూ తాగితే ఒంట్లో రక్తం అమాంతం పెరుగుతుంది. ఒకవేళ గోదుమ గడ్డి పొడి దొరికినా దాన్ని కూడా కలుపుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది. సాయంత్రం పూట ఏదైనా ఒక పండ్ల జ్యూస్ తాగాలి. బత్తాయి జ్యూస్ కానీ కమలం జ్యూస్ అయినా ఏదైనా పండ్ల జ్యూస్ తాగవచ్చు. లేదంటే ఒక గ్లాస్ చెరుకు రసం తాగినా చాలు. పండ్ల జ్యూస్ లో ఇంత తేనె, ఎండు ఖర్జూరం పొడిని వేసుకొని తాగండి.