HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >How Many Green Chilies You Should Eat Per Day

Green Chilies: పచ్చి మిరపకాయలతో కాన్సర్ దూరం.. రోజుకు ఎన్ని తినాలంటే?

పచ్చి మిరపకాయలు తినడం వల్ల క్యాన్సర్ సమస్య తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి అందుకోసం పచ్చిమిరపకాయలను ఎలా తీసుకోవాలి రోజుకు ఎంత మోతాదులో తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

  • Author : Anshu Date : 20-02-2025 - 11:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Green Chilies
Green Chilies

పచ్చిమిర్చి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు ఎన్నో రకాల ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది. కూరకు రుచిని పెంచడం మాత్రమే కాకుండా ప్రయోజనాలను కూడా తొలగిస్తుంది. దీని రుచి కారంగా ఉంటుంది అని చాలామంది తినడానికి ఇష్టపడరు. ఇంకొందరు మాత్రం పెరుగన్నం అలాగే ఇంకా కొన్ని ఆహార పదార్థాలు తిన్నప్పుడు పచ్చిమిరపకాయలు డైరెక్ట్ గా తింటూ ఉంటారు. కానీ కొందరు మాత్రం తినడానికి సాహసం చేయరు. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే పచ్చిమిరపకాయలను ఒక వెజిటేబుల్ గా భావించి తినడం వల్ల కూడా అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయట.

ఇందులో ఐరన్‌, పొటాషియం, విటమిన్లు సి, ఎ, బి5 వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల రోజుకు రెండు నుంచి మూడు పచ్చి మిరపకాయలను భయం లేకుండా తినవచ్చని, ఫలితంగా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పచ్చి మిరపకాయల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుందట. పచ్చి మిర్చిలో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు నియంత్రణకు కూడా ఇవి ఉపయోగపడతాయట. ఊబకాయం అలాగే ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ఎండు మిరప కాయలకు బదులుగా పచ్చి మిరప కాయలను వంటల్లో ఉపయోగించడం చాలా మంచిదని చెబుతున్నారు.

ఇది బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుందట. పచ్చి మిరపకాయల్లో ఉండే విటమిన్ సి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా ఉపయోగపడుతుందట. వీటిని తీసుకోవడం వల్ల ముఖంపై ముడతలు, మొటిమలు, మచ్చలు తగ్గుతాయని, కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని తాజాగా, ప్రకాశవంతంగా మారుస్తుందని చెబుతున్నారు.. పచ్చి మిరపకాయల్లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుందట. అందువల్ల రోజుకు రెండు నుండి మూడు పచ్చి మిరప కాయలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదట. అలాగే పచ్చి మిరపకాయల్లో బీటా కెరోటిన్, లుటిన్, జియాక్సంతిన్, క్రిప్టోక్సంతిన్ వంటి అనేక ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. అందుకే ఆహారంలో భాగంగా పచ్చి మిరపకాయలు తినడం ఉత్తమం. . దీని వల్ల క్యాన్సర్ కూడా రాకుండా నిరోధించవచ్చట. పచ్చి మిరపకాయల్లోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా నివారిస్తాయట. అంతేకాకుండా జీర్ణవ్యవస్థ సజావుగా పని చేయడానికి పచ్చిమిర్చి చాలా ఉపయోగకరంగా ఉంటుందట. కానీ పచ్చి మిరపకాయలు ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం అని అంటారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Green Chilies
  • Green Chilies benefits
  • health benefits
  • health tips

Related News

Benefits of eating pistachios this season!

Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

Benefits Of Pistachios: కొద్దీ మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మరింత ముఖ్యం. ఈ సీజన్‌లో అనేక రకాల వ్యాధులు సర్వసాధారణం. ఇటువంటి పరిస్థితిలో మీ రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. చలికాలంలో పిస్తా (Benefits Of Pistachios) తినడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే అనేక రకాల పోషకాలు పిస్తాలో ఉంటాయి. చలికాలంలో పిస్తా తినడం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు

  • Wow... is eating too many dry fruits really that dangerous?

    Dry Fruits: వామ్మో.. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే అంత ప్రమాదమా?

  • Boys should not eat these foods—if they do, they're in for serious trouble!

    Men Food: అబ్బాయిలు ఈ ఆహార పదార్థాలు తినకూడదు.. తింటే ఇక అంతే సంగతులు!

Latest News

  • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pregnancy: పీరియడ్స్ టైం లో శృంగారంలో పాల్గొంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్లేనా..?

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd