Weight Loss: బరువు తగ్గడానికి ఎన్ని చపాతీలు తినాలో తెలుసా?
భారతీయులు ఎక్కువగా తినే ఆహార పదార్థాలలో అన్నం తర్వాత చపాతీ ఇదే మొదటి స్థానం అని చెప్పవచ్చు. చపాతి వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా
- By Nakshatra Published Date - 04:26 PM, Fri - 2 June 23
భారతీయులు ఎక్కువగా తినే ఆహార పదార్థాలలో అన్నం తర్వాత చపాతీ ఇదే మొదటి స్థానం అని చెప్పవచ్చు. చపాతి వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతి మనందరికీ తెలిసిందే. మామూలుగా బరువు తగ్గాలి అనుకున్న వారికి కూడా చపాతి తినమని సలహా ఇస్తూ ఉంటారు. సలహా ఇవ్వడం వరకు బాగానే ఉంది కానీ చపాతిని ఎప్పుడు తినడం వల్ల బరువు తగ్గుతారు ఎన్ని తినాలి? అందులో నూనె వేసుకోవాల లేదా ఇలాంటి అనేక సందేహాలు వ్యక్తం అవుతూ ఉంటాయి. మరి ఆ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..
చపాతీలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాల వల్ల ఎక్కువ సేపు కడుపు నిండి ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఆకలి వేయదు. సాధారణంగా చపాతీలో నెయ్యి లేదా నూనె కలపుతూ ఉంటారు. కానీ నెయ్యి నూనె కలపని చపాతీలలో అధిక కొవ్వు, కొలెస్ట్రాల్ ఉండదు. అలాగే అందులో ఫైబర్ కంటెంట్ అధిక మొత్తంలో ఉంటుంది. చపాతీలో విటమిన్ బి1, బి3, బి5, బి6, బి9, విటమిన్ ఇ వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. అలాగే ఐరన్, మెగ్నీషియం కూడా చపాతీ ద్వారా లభిస్తాయి.
బరువు తగ్గడానికి రోజూ ఎన్ని చపాతీలు తినాలి? అన్న విషయానికి వస్తే.. ఒక చిన్న చపాతీలో దాదాపు 81 కేలరీలు ఉంటాయి. మధ్యాహ్నం పూట రెండు చపాతీలు తినేసి, 300 కేలరీలకు తగిన ఇతర ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలు తినొచ్చు. చపాతీల లోనే కాకుండా కూరగాయలు, పండ్లలో కొంత మొత్తం పిండి పదార్థాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి. రోజూ తినగలిగే గోధుమ చపాతీల సంఖ్య రోజూ ఎన్ని కేలరీలు తీసుకుంటారనే దానిపై ఆధారపడి ఉంటుంది. బరువు తగ్గడానికి ప్రయత్నించే వారు రోజుకు నాలుగు చపాతీలు తినాలని చెబుతూ ఉంటారు. అంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ పాటించే వారు మధ్యాహ్న భోజనంలో చపాతీలు తీసుకుంటే ఇతర ఆహార పదార్థాలను తగ్గించుకోవాలి. 350 కేలరీలకు మించకుండా చపాతీలు, కూరగాయలు, సలాడ్లు తీసుకోవాలి. అంతకు మించి తీసుకుంటున్నట్లు అనిపిస్తే చపాతీ సంఖ్యను తగ్గించుకోవాలి. బరువు తగ్గడానికి ఏ రోటీ మంచిది? ఎక్కువ మంది గోధుమ చపాతీలను ఎక్కువగా తింటుంటారు. జొన్న, రాగి, మిల్లెట్, సజ్జలు, వోట్స్ తో చేసిన చపాతీలు కూడా కొందరు తింటుంటారు. మిగతా వాటితో పోలిస్తే సజ్జలతో చేసిన చపాతీలు చాలా పోషకమైనవని చెబుతారు. సజ్జల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కడుపు నిండిన భావన కలిగించడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. .
Related News
Benefits Of Kundru: దొండకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. దొండకాయలో పుష్కలంగా ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణ ప్రక్రియను సజావుగా అమలు చేయడంలో సహాయపడుతుంది. ఇది మలబద్ధకం, అజీర్ణం మరియు అపానవాయువు వంటి సమస్యలను తొలగించడంలో కూడా సహాయపడుతుంది.