Health Tips: త్రేన్పులు అజీర్తి సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే రైస్ డ్రింక్ ని ఈ సమయంలో తీసుకోవాల్సిందే!
త్రేన్పులు, అజీర్తి వంటి సమస్యలతో బాధపడుతున్న వారు రైస్ డ్రింక్ ని తీసుకోవడం వల్ల ఆ సమస్యల నుంచి ఈజీగా బయటపడవచ్చు అని చెబుతున్నారు. మరి ఈ డ్రింక్ ఎప్పుడు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 11:33 AM, Thu - 24 April 25

కాలం మారిపోవడంతో మనుషుల జీవనశైలి ఆహారపు అలవాట్లు కూడా పూర్తిగా మారిపోయాయి. దీంతో మళ్లీ మనుషులు మొదటికి వస్తున్నారు. అంటే మళ్లీ పాతకాలం పద్ధతులే మొదలు పెడుతున్నారు. ఇదివరకటిలాగా అనగా మన పెద్దలగా కాలంలో పెద్దలు నివసించినట్టుగా నివసించడానికి అలవాటు పడుతున్నారు. కానీ ఈ జనరేషన్ వాళ్ళు మాత్రం కొంతమంది అలా బతకడానికి ఇష్టపడడం లేదు. అయితే కాలం మారిన పాతకాల పద్ధతులు అలవాట్లు చేసుకోవడానికి గల కారణం ఇప్పుడు వస్తున్న రోగాలే. అపటూ ఎంతో ఎనర్జిటిక్ గా ఉండే ఆహార పదార్థాలు తీసుకునే వారు.
అటువంటి వాటిలో గంజి కూడా ఒకటి. ఇప్పుడు దాదాపు అలాంటి డ్రింక్ నే చేసుకుని తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ రైస్ డ్రింక్ తో పొట్టలో సమస్యలన్నీ తీరిపోతాయని చెబుతున్నారు. ఇంతకీ ఈ రైస్ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. రైస్ డ్రింక్. దీన్ని తయారు చేసుకునే విధానం చాలా సింపుల్. సరిగ్గా ఒక పది నిముషాలు ఓపికగా సమయం కేటాయిస్తే చాలు. మళ్లీ గ్యాస్, అజీర్తి అనే మాటే వినిపించదట. ఇక వాటికి మందులు వేసుకోవాల్సిన అవసరమూ రాకపోవచ్చని చెబుతున్నారు. ఒకప్పుడు ఫాలో అయినా చిట్కానే అయినా ఇప్పుడు మరోసారి ట్రెండ్ అవుతోంది. వేసవిలో శరీరంలో వేడి తగ్గిపోవాలంటే పెరుగు తప్పకుండా తినాలి.
అయితే గడ్డ పెరుగు కాకుండా అందులో కాస్త నీళ్లు పోసుకుని మజ్జిగలా చేసుకుని తాగితే ఇంకా మంచిది. సాధారణంగా మజ్జిగా అనగానే నీళ్లు, కాస్తంత ఉప్పు వేసుకుని తాగుతారు. కొందరు రుచి కోసం చక్కెర కూడా కలుపుకుంటారు. ఇది మంచిదే అయినా పెద్దగా రుచి అనిపించదు. అందులో కొత్తిమీర యాడ్ చేసుకుంటే కాస్త రుచి వస్తుంది. కానీ అప్పటికప్పుడు ఇలా కలుపుకుని తాగడం కన్నా కొన్ని గంటల పాటు మజ్జిగన నిల్వ ఉంచి తాగితే వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు ఇంకా ఎక్కువగా ఉంటాయట. జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయట. ఈ మజ్జిగను తయారు చేసుకోవాలంటే కావాల్సిందల్లా కేవలం ఒక చిన్న మట్టి పాత్ర మాత్రమే. ఈ పాత్రలోనే రుచికరమైన, ఆరోగ్యకరమైన మజ్జిగను తయారు చేసుకుని తాగవచ్చట. ఒక మట్టి పాత్ర తీసుకోవాలి.
అందులో రెండు టేబుల్ స్పూన్స్ అన్నం అందులో వేయాలి. తరవాత రెండు టేబుల్ స్పూన్స్ పెరుగు వేయాలి. ఒక పెద్ద కప్పులో నీళ్లు తీసుకుని అందులో పోయాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఆ పాత్ర పై మూత పెట్టి రాత్రంతా అలాగే ఉంచాలి. దాదాపు 8 గంటల పాటు దాన్ని అలా వదిలేయాలి. తరవాత అందులో కాస్తంత ఉప్పు, జీరా పొడి కలపాలి. రుచి కోసం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. దీన్ని బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు తాగడానికి రెడీగా ఉన్న ఈ రైస్ డ్రింక్ లో పోపు పెట్టాలి. కేవలం ఆవాలు, కరివేపాకు మాత్రమే వేయాలి. ఈ పోపుని ఈ డ్రింక్ లో కలపాలి. ఈ రైస్ డ్రింక్ లో ప్రోబయోటిక్స్ ఉండడం వల్ల కడుపు ఉబ్బరాన్ని తగ్గించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతాయట.