Diet: డైటింగ్ చేయకుండా ఈజీగా బరువు తగ్గవచ్చట.. అదెలా అంటే?
డైటింగ్ చేయకపోయినా ఎటువంటి డైట్ లు ఫాలో అవ్వకపోయినా కూడా ఆరోగ్యంగా ఈజీగా బరువు తగ్గవచ్చును చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
- By Anshu Published Date - 02:00 PM, Tue - 1 April 25

ఇటీవల కాలంలో అధిక బరువు అన్నది ప్రధాన సమస్యగా మారిపోయింది. అయితే బరువు పెరగడం అన్నది ఈజీనే కానీ బరువు తగ్గడం అన్నది చాలా కష్టంతో కూడుకున్న పని. బరువు తగ్గడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే బరువు తగ్గడం కోసం వాకింగ్ చేయడం జిమ్ కి వెళ్లడం డైట్ ఫాలో అవ్వడం ఆహారం తినడం మానేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఎన్ని చేసినా కూడా అధిక బరువు మాత్రం తగ్గరు. కానీ ఎటువంటి డైట్ ఫాలో అవ్వకుండా ఈజీగా బరువు తగ్గవచ్చు అని చెబుతున్నారు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
డైటింగ్ చేస్తేనే బరువు తగ్గుతారనేది కేవలం మీ అపోహ మాత్రమే అంటున్నారు. అవును డైటింగ్ చేయకున్నా మీరు చాలా సులువుగా బరువు తగ్గవచ్చట. కాకపోతే మీరు బరువు తగ్గడానికి సరైన మార్గాన్ని, జీవనశైలిని ఎంచుకోవాలని చెబుతున్నారు. సరైన ఆహారాలు ఆరోగ్యంగా బరువును తగ్గించడంలో ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయట. మీరు బరువు తగ్గాలంటే ఖచ్చితంగా ఆహారాన్ని బాగా నిమిలి తినాలట. దీనివల్ల పోషకాలు మీ శరీరానికి అందడంతో పాటుగా బరువు కూడా తగ్గుతారట.. కాగా ఆహారాన్ని నమలడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయట. ఆహారాన్ని బాగా నమలడం వల్ల మీరు కేలరీల తీసుకోవడం తగ్గుతుందట.
ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుందట. అలాగే పొట్ట నిండుగా ఉండేలా చేస్తుందట. చాలా మంది బరువు తగ్గాలని ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను తినడం మానేస్తుంటారు. కానీ బరువు తగ్గాలనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా ఉదయం అల్పాహారం తినాలట. బరువు తగ్గడానికి ఉదయం అల్పాహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని, బ్రేక్ ఫాస్ట్ మానేస్తే మెటబాలిజంపై ప్రభావం పడుతుందని, ఇది మీరు బరువు తగ్గకుండా చేస్తుందని చెబుతున్నారు. ఒకవేళ మీరు బరువు తగ్గాలనుకుంటే ఉదయం అల్పాహారంలో గుడ్లు, టోస్ట్, పండ్లు, పెరుగును తినవచ్చట. వీటి ద్వారా మీ శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు అందుతాయట.
ఇది జీవక్రియను మెరుగుపరుస్తుందని, అలాగే ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుందని చెబుతున్నారు. బరువు తగ్గడానికి బచ్చలికూర, క్యారెట్లు, బ్రోకలీ వంటి పిండి పదార్థాలు లేని కూరగాయలను మీ రోజువారి ఆహారంలో చేర్చాలట. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయట. అలాగే వీటిలో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయట. కాగా కొవ్వు తక్కువగా ఉండే కూరగాయలను తీసుకోవడం వల్ల ఈజీగా బరువు తగ్గవచ్చట. అలాగే కూరగాయలను ఎక్కువగా తినే అలవాటు కూడా మీరు బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడుతుందని, కూరగాయలు ఎక్కువగా, అన్నం తక్కువగా తింటే మీరు ఆరోగ్యంగా ఉండటంతో పాటుగా బరువు పెరిగే అవకాశం కూడా ఉండదని చెబుతున్నారు.