Hot Water Bath : మీరు ప్రతిరోజు వేడి నీటితో స్నానం చేస్తున్నారా..? అయితే ఇది మీరు తెలుసుకోవాల్సిందే !
Hot Water Bath : దీని వలన చుండ్రు, దురద, జుట్టు తడులు, జుట్టు ఊడిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల తలస్నానం చేసేటప్పుడు గోరువెచ్చని నీటిని మాత్రమే వాడాలని సూచిస్తున్నారు
- Author : Sudheer
Date : 08-07-2025 - 7:30 IST
Published By : Hashtagu Telugu Desk
వేడి నీటి (Hot Water) స్నానం పలు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా వర్షాకాలం లేదా చలికాలంలో గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించి, మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. నిపుణుల సూచనల ప్రకారం.. నీలగిరి లేదా తులసి తైలాన్ని వేడి నీటిలో కలిపి స్నానం చేస్తే రోజువారీ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఇదే విధంగా నిద్రలేమి సమస్య ఉన్నవారు కూడా రాత్రి పడుకునే ముందు వెచ్చని నీటితో స్నానం చేస్తే నిద్ర త్వరగా పట్టే అవకాశం ఉంటుంది.
CM Revanth Reddy : తెలంగాణలో ప్రపంచ స్థాయి ఫిల్మ్ స్టూడియో
వేడి నీటి (Hot Water) స్నానం చర్మానికి మృదుత్వాన్ని అందించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా వాపులు, ముక్కు దిబ్బడ, తలనొప్పి వంటి సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. అయితే నీళ్లు మరీ వేడిగా ఉండకూడదు. ఎక్కువ వేడి నీరు చర్మంలోని సహజ ఆయిల్స్‌ను తొలగించి పొడిబారిపోయేలా చేస్తుంది. ఇది ముడతలతో పాటు చర్మంలో కాలేజన్ హానికి కారణమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే నీటి ఉష్ణోగ్రత 104°F నుంచి 108°F (అంటే సుమారు 40°C నుండి 42°C) లోపల ఉండేలా చూసుకోవాలి.
వేడి నీటితో తలస్నానం చేయడం జుట్టుకు మంచిదికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేడి నీరు తలలోని సహజ నూనెను తొలగించి, జుట్టును పొడిబారిపోయేలా చేస్తుంది. దీని వలన చుండ్రు, దురద, జుట్టు తడులు, జుట్టు ఊడిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల తలస్నానం చేసేటప్పుడు గోరువెచ్చని నీటిని మాత్రమే వాడాలని సూచిస్తున్నారు. సరైన ఉష్ణోగ్రతలో, నాణ్యమైన గీజర్ లేదా హీటర్ వాడటం ద్వారా వేడి నీటి స్నానాన్ని ఆరోగ్యకరంగా మార్చుకోవచ్చు.