Telugu News
News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Health News
  • ⁄High Bp In Children And Teenagers Shocking Facts Of The Study

BP : టీనేజీలో బీపీ పెరుగుతోందా..షాకింగ్ కారణాలు చెబుతున్న డాక్టర్లు..!!

హైబీపీ ( అధిక రక్తపోటు) ప్రపంచంలో చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. సాధారణంగా పెద్దవారిలో ఈ హైబీపీ లక్షణాలు కనిపిస్తుంటాయి. కానీ పిల్లల్లోనూ, టీనేజర్లలోనూ హైబీపీ కేసులు వెల్లడవుతున్నట్లు ఓ అధ్యయనం వెల్లడించింది.

  • By Bhoomi Published Date - 11:32 AM, Mon - 1 August 22
BP : టీనేజీలో బీపీ పెరుగుతోందా..షాకింగ్ కారణాలు చెబుతున్న డాక్టర్లు..!!

హైబీపీ ( అధిక రక్తపోటు) ప్రపంచంలో చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. సాధారణంగా పెద్దవారిలో ఈ హైబీపీ లక్షణాలు కనిపిస్తుంటాయి. కానీ పిల్లల్లోనూ, టీనేజర్లలోనూ హైబీపీ కేసులు వెల్లడవుతున్నట్లు ఓ అధ్యయనం వెల్లడించింది. పిల్లల్లో హైబీపీకి వారి జీవనశైలీనే ముఖ్య కారణమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పెద్దగా పనిలేకపోవడం, చక్కెలు, ఉప్పు అధికంగా ఉండే పదార్థాలు తినడం వల్ల వారిలోనూ హైబీపీకి దారితీస్తోందని అధ్యయనంలో వివరించారు.

అధిక రక్తపోటుతో బాధపడుతున్న పది మంది బాలలను తీసుకుంటే వారిలో 9మంది పైఅంశాల కారణంగానే హైబీపీ బారినపడుతున్నారని వెల్లడైంది. ఈ అధ్యయనం కోసం ఆరు నుంచి పదహారేళ్ల వయస్సున్న బాలల ఆరోగ్య స్థితిగతులను పరిశీలించారు. సదరు బాలల సంపూర్ణ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని వారి తల్లిదండ్రులకు నిపుణులు సూచించారు. పిల్లల ఆరోగ్యంలో గణనీయమైన మార్పులకు వారి తల్లిదండ్రులే బాధ్యత తీసుకోవాలని ఈ అధ్యయనంలో పాల్గొన్న ఇటలీకి చెందిన ప్రొఫెసర్ గియోవనీ డి సిమోన్ చెబుతున్నారు.

హైబీపీ, ఊబకాయం వంటి రుగ్మతలు చాలా తరచుగా ఒకే కుటుంబంలోని వ్యక్తుల్లో కనిపిస్తుంటాయి. అందుకే ఇలాంటి కుటుంబాల్లోని వ్యక్తులు కూడా తమ లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవడం అవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా అధిక రక్తపోటుతో బాధపడే పిల్లలకు తాజా కూరగాయలు, ఫలాలు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం అందించడంతోపాటు ఉప్పు, స్వీట్లు, శీతల పానీయాలు, కొవ్వు పదార్థాలకు దూరంగా ఉంచడం వల్ల వారిలో హైబీపీ లక్షణాలు అదుపులో ఉంటాయని సిమోన్ పేర్కొన్నారు.

ఇక పిల్లలు, టీనేజర్లు రోజులో ఒక గంటపాటైనా సరే కసరత్తులు చేయాలని జాగింగ్, సైక్లింగ్ స్విమ్మింగ్ చేయాలని సూచించారు. రెండు గంటలకు మించి ఒకే చోట కదలకుండా కూర్చోవడం వంటివి చేయకూడదని తెలిపారు. పిల్లలు అదేపనిగా టీవీ, స్మార్ట్ ఫోన్ వినియోగిస్తుంటే తల్లిదండ్రులు వారిని గమనిస్తుండాలని…శారీరక ఇతర పనుల వైపు మళ్లించాలని వెల్లడించారు. తరచుగా వారి బరువు, ఆహారపు అలవాట్లు వ్యాయామ సమయం వంటి అంశాల్లో వాస్తవిక లక్ష్యాలను నిర్దేశించి దానికి అనుగుణంగా వారిని పరిశీలిస్తుండాలని సిమోన్ వివరించారు.

 

Tags  

  • children
  • High BP
  • Life Style
  • Shocking Facts
  • teenagers

Related News

Belly Fat: హార్మోన్లను పట్టు.. బెల్లీ ఫ్యాట్ ను తరిమికొట్టు!!

Belly Fat: హార్మోన్లను పట్టు.. బెల్లీ ఫ్యాట్ ను తరిమికొట్టు!!

బెల్లీ ఫ్యాట్‌.. ఇది ఇప్పుడు ఎంతోమందిని వేధిస్తున్న సమస్య..

  • Yoga : ఈ ఆసనాలు పిల్లల ఏకాగ్రతను పెంచుతాయి..!!

    Yoga : ఈ ఆసనాలు పిల్లల ఏకాగ్రతను పెంచుతాయి..!!

  • High BP : బీపీ టాబ్లెట్స్ వేసుకొని విసుగు చెందారా…అయితే ఈ పండు తిని చూడండి..!!

    High BP : బీపీ టాబ్లెట్స్ వేసుకొని విసుగు చెందారా…అయితే ఈ పండు తిని చూడండి..!!

  • High BP: చిన్నారులు, టీనేజర్లలోనూ అధిక రక్తపోటు…ఎందుకో కారణం చెప్పిన నిపుణులు..!!

    High BP: చిన్నారులు, టీనేజర్లలోనూ అధిక రక్తపోటు…ఎందుకో కారణం చెప్పిన నిపుణులు..!!

  • Hair fall : జుట్టు ఊడుతుందా? జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఆవాల నూనె ట్రై చేయండి..!

    Hair fall : జుట్టు ఊడుతుందా? జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఆవాల నూనె ట్రై చేయండి..!

Latest News

  • Road Accident : యూపీ లో డీసీఎం వాహ‌నాన్ని ఢీకొట్టిన బ‌స్సు.. 30 మందికి గాయాలు

  • Pakistani Loves Indian: హైదరాబాద్ అబ్బాయిని ప్రేమించిన పాకిస్తాన్ అమ్మాయి.. ఇక్కడికి వస్తు దొరికిపోయిన యువతి!

  • Gorantla Issue: గోరంట్ల బూతు వీడియో పై ‘నార్త్’ ఫైట్

  • AP Politics: సోలో గేమ్ సో బ్యాడ్

  • Jagga Reddy: జగ్గారెడ్డి మౌనం వెనుక మతలబు

Trending

    • Sweet Shop: 47 ఏళ్లుగా అద్భుతమైన రుచి.. ఆ స్వీట్ చరిత్ర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

    • Floods in Death Valley..!: ప్రపంచంలోనే వేడి ప్రదేశం.. అక్కడ వరదలు..!

    • Ambidexterity: రెండు చేతులతో అద్భుతంగా రాస్తున్న చిన్నారి.. వీడియో వైరల్?

    • Grooms For Sale: బాబోయ్.. అమ్మాయిలకు పెళ్ళికొడుకులను అమ్మేస్తున్న జనాలు.. ఎక్కడంటే?

    • 6000cr: వ్యక్తి ఖాతాలో రూ.6 వేల కోట్లు.. అసలు ఎలా వచ్చాయంటే?

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: