HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Herbs For Weight Loss

Masala Dinusulu: ఈ మసాలా దినుసులతో బరువు తగ్గించుకోవచ్చని మీకు తెలుసా?

మన వంటింట్లో దొరికే కొన్ని రకాల మసాలా దినుసులను ఉపయోగించి అధిక బరువు సమస్యను తగ్గించుకోవచ్చని చెబుతున్నారు.

  • Author : Anshu Date : 30-11-2024 - 1:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Masala Dinusulu
Masala Dinusulu

బెల్లీ ఫ్యాట్ ఒక్కసారి పెరిగింది అంటే తగ్గించుకోవడం అంత సులువైన విషయం కాదని చెప్పాలి. అయితే ఈ బెల్లీ ఫ్యాట్ ని అలాగే అధిక బరువును తగ్గించుకోవడానికి కొన్ని మసాలా దినుసులు బాగా ఉపయోగపడతాయట. ఇంతకీ ఆ మసాలా దినుసులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం… దాల్చిన చెక్క మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ఈ మసాలా దినుసుల్లో విటమిన్స్, జింక్, ఫాస్పరస్, ఐరన్ లు పుష్కలంగా ఉంటాయి. దాల్చిన చెక్కను నీటిలో మరిగించి తాగడం వల్ల కొలెస్ట్రాల్, రక్తపోటు సమస్య తగ్గడమే కాకుండా బరువు తగ్గుతారట పెరుగుతున్న ఊబకాయాన్ని తగ్గించుకోవాలంటే ప్రతిరోజూ రాత్రి పడుకునే గంట ముందు ఒక గ్లాసు నీటిలో దాల్చిన చెక్కను మరిగించి ఆ నీరు సగం కాగానే దించేసి తాగాలట.

ఇది శరీరానికి యాంటీ ఆక్సిడెంట్లను అందిస్తుందని, అలాగే సీజనల్ వ్యాధులకు శరీరం దూరంగా ఉంటుందని చెబుతున్నారు. దీన్ని మీరు రెగ్యులర్ గా తాగడం వల్ల మీ శరీరం ఆరోగ్యంగా, స్ట్రాంగ్ గా ఉంటుందట. కాగా త్రిఫలాన్ని తీసుకోవడం వల్ల శరీరం అనేక రకాల వ్యాధులకు దూరంగా ఉంటుంది. దీన్ని పౌడర్, జ్యూస్, కషాయంగా కూడా తీసుకోవచ్చట. ఈ ఔషధం జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యల నుంచి ఒత్తిడి వరకు ఎన్నో సమస్యలను తగ్గిస్తుందని చెబుతున్నారు. ఇది జీవక్రియను పెంచి శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుందట. ఇందుకోసం త్రిఫల చూర్ణాన్ని గోరువెచ్చని నీటిలో కలిపి తాగవచ్చట. అయితే మీకు కావాలంటే మీరు దీన్ని కషాయాన్ని కూడా తయారు చేయవచ్చట. ఈ పొడిని తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు తగ్గుతుందట.

తేనె, దాల్చిన చెక్కతో కలిపిన పొడిని కూడా తాగవచ్చని చెబుతున్నారు. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఒత్తిడి, యాంగ్జైటీకి దూరంగా ఉంటారట. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే మెంతులు మన శరీరానికి ఎన్నో విధాలుగా ప్రయోజనకరంగా ఉంటాయి. మీ శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి మెంతులను రాత్రంతా నానబెట్టి ఉదయం వాటిని తీసుకోవచ్చు. లేదా వీటిని పొడిగా కూడా తినవచ్చు. ఊబకాయానికి దూరంగా ఉండాలంటే 1 గ్లాసు నీటిలో అర టీస్పూన్ మెంతికూర, నల్ల మిరియాలు, పసుపు, చిన్న, చిక్కటి యాలకులు కలిపి కషాయం తయారుచేసుకోవాలి. నీరు సగం కాగానే తాగాలి. ఉదయాన్నే పరగడుపున కూడా తాగొచ్చు.

ఇది మిమ్మల్ని ఊబకాయం సమస్యకు దూరంగా ఉంచుతుందని చెబుతున్నారు.
అలాగే చింతపండులో విటమిన్లు, పొటాషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. చింతపండు మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా రక్తాన్ని శుద్ధి చేయడానికి కూడా సహాయపడుతుంది. ఇందులో ఉండే హైడ్రోసిట్రిక్ మూలకం శరీరాన్ని తేమ నుంచి కాపాడుతుంది. నిజానికి చింతపండు అతిగా తినడాన్ని కూకడా తగ్గిస్తుందట. కొద్దిగా చింతపండును తీసుకుని 2 గ్లాసుల నీటిలో నానబెట్టాలట. రాత్రంతా నానబెట్టిన తర్వాత చింతపండును ఉదయం వడగట్టి దాని రసం తాగాలి. దీనికి తేనె, బ్లాక్ సాల్ట్ కూడా కలుపుకోవచ్చట. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని,బరువును కూడా తగ్గిస్తుందని, కావాలనుకుంటే చింతపండును చింతపండు పచ్చడిగా చేసుకుని కూడా తినవచ్చని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • health tips
  • Herbs
  • Masala Dinusulu
  • weight loss

Related News

Wow... is eating too many dry fruits really that dangerous?

Dry Fruits: వామ్మో.. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తింటే అంత ప్రమాదమా?

డ్రై ఫ్రూట్స్.. ఇవి ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఈ డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న విషయం మనందరికీ తెలిసిందే. కానీ వీటి ధర కారణంగా చాలామంది వీటిని కొనుగోలు చేయడానికి భయపడుతూ ఉంటారు. అయితే డ్రై ఫ్రూట్స్ తినడం మంచిదే కానీ, అలా అని మోతాదుకు మించి తింటే మాత్రం ఆరోగ్యం పక్కాగా పాడవుతుందని చెబుతున్నారు. మరి డ్రై ఫ్రూట్స్‌ను మోతాదుకు మించి తింటే ఏం జరుగు

  • Boys should not eat these foods—if they do, they're in for serious trouble!

    Men Food: అబ్బాయిలు ఈ ఆహార పదార్థాలు తినకూడదు.. తింటే ఇక అంతే సంగతులు!

Latest News

  • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd