Winter Pain : చలికాలంలో వేధించే మడమ, మోకాళ్లు, కీళ్లు నొప్పులను వీటితో నయం చేసుకోవచ్చు..!!
- By hashtagu Published Date - 09:00 AM, Tue - 29 November 22
చలికాలంలో నొప్పులు వేధిస్తుంటాయి. శరీరంలోని వివిధ భాగాల్లో విపరీతమైన నొప్పి ఉంటుంది. గతంలో ఎప్పుడో వచ్చిన నొప్పులు కూడా చలికాలంలో మళ్లీ వస్తుంటాయి. అయితే దీర్ఘకాలిక నొప్పి లేకపోయినా…కొన్ని సార్లు ఆ నొప్పులు చాలా ఇబ్బందిపెడుతుంటాయి. సాధారణంగా పాదాలు, మోకాలు, మడమ నొప్పి ఇవిచాలా ఇబ్బందులకు గురిచేస్తాయి. చలికాలంలో ఈ సమస్య వస్తే సాధారణంగా చాలా మంది మంచానికే పరిమితం అవుతుంటారు. అయితే విశ్రాంతి తీసుకుంటూ…ఆర్థరైటిస్ వల్ల వచ్చే నొప్పులకు కొన్ని సింపుల్ రెమెడీస్ ఉపయోగించినట్లయితే వీటిని నయం చేసుకోవచ్చు.
చురుకుగా ఉండండి:
చలికాలంలో చాలామంది నిద్రకు ప్రాధాన్యత ఇస్తుంటారు. చల్లగా ఉండటంతో వెచ్చగా దుప్పటి కప్పుకోని పడుకోవానుకుంటారు. రోజంతా స్వెటర్ వేసుకుంటారు. పడుకోవడం, కూర్చోవడం చేస్తుంటే నొప్పులు మరింత తీవ్రం అవుతుంటాయి. కాబట్టి చలికాంలో క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. మనస్సు, శరీరం నుంచి మలినాలను తొలగించుకోవడం చాలా ముఖ్యం. కానీ తీవ్రమైన వ్యాయామాలు చేయకూడదు. సరైన భంగిమతో కూర్చుని వ్యాయామం చేయాలి. కీళ్ల నొప్పులకు ప్రత్యేక వ్యాయామాలు చేయాలి.
ధూమపానం మానేయండి:
మీరు ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నట్లయితే ధూమపానానికి దూరంగా ఉండండి. ఎందుకంటే పొగతాగడం వల్ల మలబద్ధకం సమస్య పెరుగుతుంది. కీళ్లలో అధిక ఒత్తిడి కారణం నొప్పి మరింత పెరుగుతుంది.
ఆహారం విషయంలో జాగ్రత్తలు :
చలికాలంలో కీళ్లనొప్పుల సమస్య పెరగకుండా ఉండేందుకు ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, చేపలు, గింజలు ఎక్కువగా తీసుకోవాలి. డాక్టర్ సలహా మేరకు విటమిన్ డి తీసుకోవాలి.
వెచ్చని బట్టలు:
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం చాలా అవసరం. చలిలో నడవడం వల్ల కాళ్లకు నొప్పి, జలుబు వేధిస్తుంటుంది. కాబట్టి, పాదాలకు సాక్స్ ధరించాలి. చలిగా ఉంటే మడమలు, మోకాళ్ల నొప్పులు ఎక్కువవుతాయి. మీరు ఎక్కువగా నొప్పిని అనుభవించే ప్రాంతాన్ని వెచ్చగా ఉంచడానికి ప్రయత్నం చేయాలి.
నొప్పిని నిర్లక్ష్యం చేయవద్దు:
చలికాలంలో కనిపించే నొప్పిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఎక్కువగా శ్రమించే పనులు చేసేముందు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే, డిస్క్ జారిపోయే ప్రమాదంతో పాటు, నరాలు, కండరాల నొప్పులతో సహా అనేక రకాల నొప్పి ఈ కాలంలో ఎక్కువ వేధిస్తుంటాయి.
సూర్యరశ్మికి ఉండాలి:
చలికాలంలో మధ్యాహ్న సూర్యుడు వస్తున్నప్పటికీ…ఎండలో కొద్దిసేపు నడవడం వల్ల విటమిన్ డి లోపం తొలగిపోతుంది. ఆర్థరైటిస్ నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. అలాగే నొప్పిని తగ్గించే నూనెలను నొప్పి ఉన్న చోట రాసుకోవచ్చు. కొబ్బరి నూనె కూడా అప్లై చేయడం మంచిది. మీరు రోజంతా నొప్పి ఉన్న ప్రదేశంలో ఒకటి లేదా మరొక రకమైన నూనెను ఉపయోగిస్తే, మీరు త్వరగా ఉపశమనం పొందుతారు.
Tags
Related News
Health: జీడిపప్పు తినడం వల్ల మగవాళ్లకు ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయా.. అవేంటో తెలుసా
Health: పురుషులు జీడిపప్పు తినడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇది వారి సంతానోత్పత్తిని పెంచుతుంది. టెస్టోస్టెరాన్ స్థాయిని కూడా మెరుగుపరుస్తుంది. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు వంటి పోషకాలు జీడిపప్పులో ఉంటాయి. జీడిపప్పు తినడం వల్ల పురుషులు చాలా ప్రయోజనాలను పొందుతారు. ఇది వారి సంతానోత్పత్తిని పెంచుతుంది .టెస్టోస్టెరాన్ స్థాయిని కూడా మెరుగుపరుస్తుంది. కార్బోహైడ్రేట్�