Belly Fat: అధిక పొట్టతో బాధ పడుతున్నారా.. అయితే కీరదోస అల్లంతో ఇలా చేయాల్సిందే!
బాణలాంటి పొట్టతో ఇబ్బంది పడుతున్నవారు, పొట్ట తగ్గించుకోవడం కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్న వారు ఇప్పుడు చెప్పినట్టుగా కిర దోసకాయ, అల్లం ఉపయోగిస్తే పొట్ట కరిగిపోవడం ఖాయం అంటున్నారు.
- By Anshu Published Date - 04:00 PM, Mon - 19 May 25

ప్రస్తుత రోజుల్లో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అధిక బరువుతో పాటు బాన లాంటి పొట్ట కూడా చాలామందిని ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. ఈ పొట్ట కారణంగా చిన్న వయసులోనే పెద్ద వారిలా కనిపిస్తూ ఉంటారు. అయితే మారుతున్న ఆహారపు అలవాట్లు అలాగే జీవనశైలి కారణంగా చాలామంది అనేక ఇబ్బందులతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అధిక బరువు సమస్య వల్ల ఇతర అనారోగ్య సమస్యలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే అధిక బరువును తగ్గించుకోవడం కోసం రకరకాల డ్రింకులు ఎక్సర్సైజులు చేయడం డైట్లు ఫాలో అవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పినట్టు చేస్తే బాణ లాంటి పొట్ట అయినా సరే ఈజీగా కరిగిపోతుందని చెబుతున్నారు.
మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మన ఇంట్లో ఉండే అల్లం, కీర దోసకాయతో ఈ చిట్కా పాటిస్తే బాన పొట్టు కూడా కరిగిపోతుందట. అల్లం అలాగే కీరదోసకాయ ఈ రెండింటి వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. వీటిని తీసుకోవడం వల్ల మన శరీరానికి కావలసిన పోషకాలు అందటమే కాకుండా అధిక బరువు సమస్య నివారించడంలో కూడా ఎంతో ఉపయోగపడతాయట. అల్లంలో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయి. అలాగే అధిక బరువును తగ్గించడంలో కూడా అల్లం ఎంతో బాగా ఉపయోగపడుతుందట.
అల్లం ఉపయోగించడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు సులభంగా తగ్గుతుందని, జీర్ణశక్తి మెరుగుపడుతుందని చెబుతున్నారు. అలాగే కీరదోస కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట. దీనిని తీసుకోవడం వల్ల ఎక్కువ సేపు ఆకలి వేయదని,అంతే కాకుండా శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుందని చెబుతున్నారు. అల్లం, కీరదోసతో మనం జ్యూస్ ను తయారు చేసుకుని తాగడం వల్ల చాలా సులభంగా బరువు తగ్గవచ్చట. జ్యూస్ తయారు చేయటానికి కీరదోషను ముక్కలుగా కోసి ఆ తర్వాత అందులో కొంచెం అల్లం వేసి నీరు పోసి గ్రైండ్ చేసుకోవాలట. ఆ తర్వాత ఆ నీటిని ఒక గ్లాసులో వడపోసి అందులో కొంచం నిమ్మ రసం కలిపి తాగాలి. ఈ జ్యూస్ ని ప్రతిరోజు పరగడుపున తాగటం వల్ల అధిక బరువు సమస్య నుండి విముక్తి లభిస్తుందని, బాణ లాంటి పెద్ద పొట్ట అయినా సరే ఈజీగా కరిగిపోతుంది అని చెబుతున్నారు.