Belly Fat: మగవాళ్లకు పొట్ట ఎందుకు వస్తుంది.. దాన్ని ఎలా తగ్గించుకోవాలో తెలుసా?
పొట్ట లావుగా ఉంది అని ఇబ్బంది పడే మగవారు కొన్ని రకాల టిప్స్ ని ఫాలో అవ్వాలని చెబుతున్నారు.
- By Nakshatra Published Date - 11:30 AM, Wed - 4 September 24
మామూలుగా పొట్ట పెరగడం అన్నది సహజం. ఫుడ్ అధికంగా తీసుకున్నప్పుడు అలాగే శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు పొట్ట పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ పొట్ట పెరగడం అన్నది కూడా కామన్. ఇక పొట్ట బాగా పెరిగినప్పుడు చాలామంది స్వతహాగా పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఆయాస పడుతూ ఉంటారు. ఇక పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించుకోవడానికి పొట్టను కరిగించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే పొట్టను పెంచడం ఈజీనే కానీ పొట్ట కరిగించుకోవడం అన్నది చాలా కష్టంతో కూడుకున్న విషయం అని చెప్పాలి. ముఖ్యంగా స్త్రీలతో పోల్చుకుంటే మగవారికి పొట్ట ఎక్కువగా వస్తూ ఉంటుంది.
25, 26 ఏళ్ల వయసు నుంచి ఈ పొట్ట పెరగడం అన్నది మొదలవుతూ ఉంటుంది. ఇక పొట్టను కరిగించుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. నడుము సైజు తగ్గడానికి నెలల సమయం పట్టవచ్చు లేదా సంవత్సరాల సమయం పట్టవచ్చు. అనారోగ్యకరమైన ఆహారం, కూర్చునే అలవాట్లు, బలహీనమైన జీర్ణవ్యవస్థ, ఇతర కారణాల వల్ల పురుషుల బెల్లీ ఫ్యాట్ పెరుగుతుంది. అయితే కొన్ని సింపుల్ టిప్స్ తో పురుషులు తమ బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవచ్చు. మరి ఎలాంటి టిప్స్ ఉపయోగిస్తే బెల్లీ ఫ్యాట్ పొట్ట తగ్గుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తరచుగా వ్యాయామం చేసే అలవాటు ఉంటే ఇది శరీర బరువును తగ్గించడానికి అలాగే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది.
యోగా, వ్యాయామం, కార్డియో వ్యాయామాలు బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే సరైన పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల బెల్లీ ఫ్యాట్ ను ఈజీగా కరిగించుకోవచ్చు. ఇందుకోసం మీరు మీ రోజువారి ఆహారంలో పాత నూనెలకు బదులుగా ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, తాజా,ఆరోగ్యకరమైన నూనెలను జోడించాలి. ఇవి మీ పొట్ట పెరగకుండా సహాయపడతాయి. నీళ్లు కూడా మీరు బరువు పెరగకుండా తగ్గడానికి సహాయపడతాయి. నీళ్లను తాగితే చాలా వరకు ఆకలి కంట్రోల్ అవుతుంది. దీంతో మీరు అతిగా తినరు. అందుకే ప్రతి రోజూ నీటిని పుష్కలంగా తాగాలి. నీళ్లు జీవక్రియను ప్రోత్సహించడానికి కూడా సహాయపడుతాయి. ఇది బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడానికి సహాయపడుతుంది.
అలాగే అల్లం, వెల్లుల్లిలో ఎన్నో ఔషద గుణాలు ఉంటాయి. అందుకే వీటిని దగ్గు, జలుబు వంటి ఎన్నో చిన్న చిన్న సమస్యలను తగ్గించుకోవడానికి ఉపయోగిస్తారు. అయితే ఇవి కూడా బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడానికి సహాయపడతాయి.
వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడానికి సహాయపడతాయి. అందుకే మీరు వీటిని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోమని సూచిస్తున్నారు. సరైన భంగిమ కూడా మీ పొట్టను తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. నిటారుగా కూర్చోవడం, నిటారుగా నిలబడటం, సరైన శరీర భంగిమను నిర్వహించడం వల్ల ఉదర కండరాలు సరైన స్థితిలో ఉంటాయి. దీనివల్ల నడుము నొప్పి రాకుండా ఉండటమే కాకుండా.. మీ పొట్ట పెరిగే అవకాశం కూడా ఉండదట. నిద్రతోనే ఎన్నో రోగాలు సగం తగ్గిపోతాయట. కంటినిండా నిద్రపోయే వారు ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంటారట. మంచి గాఢ నిద్ర బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడానికి కూడా సహాయపడుతుందని చెబుతున్నారు.
note: పైన ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్న వైద్యులు సలహా తీసుకోవడం మంచిది.
Related News
Dry Fruits: డ్రై ఫ్రూట్స్ తింటే నిజంగానే బరువు పెరుగుతారా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే!
డ్రై ఫ్రూట్స్ తినేవాళ్లు తప్పకుండా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.