HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Health Risks Of Storing Watermelon In Fridge

Watermelon: పుచ్చకాయను ఫ్రిడ్జ్ లో పెట్టి తింటున్నారా.. అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాల్సిందే?

వేసవికాలంలో పుచ్చకాయను ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తినేవారు తప్పకుండా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

  • Author : Anshu Date : 07-03-2025 - 5:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Watermelon
Watermelon

వేసవి కాలంలో మనకు ఎక్కువగా లభించే పండ్లలో పుచ్చకాయ కూడా ఒకటి. పుచ్చకాయ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. పుచ్చకాయ ఆరోగ్యానికి అలాగే అందానికి ఎంతో మేలు చేస్తుంది. పుచ్చకాయలో విటమిన్ A, B, C, పొటాషియం, లైకోపీన్, బీటా కెరోటిన్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ శరీరాన్ని రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడుతుందట. మనకు వేసవికాలంలో ఎక్కడ చూసినా కూడా పుచ్చకాయలు ఎక్కువగా లభిస్తూ ఉంటాయి.

అందుకే ప్రతి ఒక్కరూ పుచ్చకాయని ఎక్కువగా తింటూ ఉంటారు. చాలామంది చేసే తప్పు పుచ్చకాయను తెచ్చి ఫ్రిజ్లో పెట్టి తింటూ ఉంటారు. ఇంకొందరు పెద్ద పుచ్చకాయ తెచ్చినప్పుడు సగం కట్ చేసి మిగతా సగం ఫ్రిడ్జ్ లో పెట్టి తింటూ ఉంటారు. అయితే పుచ్చకాయను కోసిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెడితే ఇందులో ఉండే లైకోపీన్, విటమిన్ ఏ సి వంటి ముఖ్యమైన పోషకాలు తగ్గిపోతాయట. ఫ్రిజ్‌లో ఎక్కువసేపు ఉంచితే ఫలంలో రసం మామూలుగా మారిపోతుంది. దాని రుచి తగ్గిపోతుందని చెబుతున్నారు. పుచ్చకాయలో 90 శాతం నీరు ఉంటుంది. కాబట్టి దీనిని కోసిన వెంటనే తింటే మంచి ఫలితాలు కనిపిస్తాయి.కానీ కోసిన తర్వాత ఫ్రిజ్‌ లో పెట్టినప్పుడు ఈ తేమతో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉందట.

ఇది ఫుడ్ పాయిజనింగ్‌ కు దారితీసే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వయసైన వారైతే ఇలాంటి ఫ్రిజ్ పండ్లను తినకుండా ఉండటం మంచిది. ఫ్రిజ్‌ లో ఉంచిన పుచ్చకాయ తిన్న తర్వాత కొన్ని గంటల్లోనే కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు వచ్చే అవకాశాలు ఉంటాయట. పుచ్చకాయ సహజంగా శరీరాన్ని చల్లగా ఉంచే స్వభావం కలిగి ఉంటుంది. అందుకే దీనిని ఎక్కువగా వేసవిలో తింటుంటారు. కానీ ఫ్రిజ్‌ లో ఉంచిన పుచ్చకాయ మరింత చల్లగా మారిపోతుంది. దీన్ని తిన్న వెంటనే కొందరికి దగ్గు, జలుబు, గొంతు సమస్యలు రావచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా రాత్రి పూట చల్లటి పుచ్చకాయ తింటే జీర్ణక్రియ మందగించడమే కాకుండా అజీర్ణ సమస్యలు రావచ్చట. అలాగే ఇది ఎక్కువ నీటి శాతం కలిగి ఉండటం వల్ల తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావచ్చని దీంతో నిద్రకు అంతరాయం కలుగుతుందని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఇంట్లో ఉంచాల్సి వస్తే మూతతో కవర్ చేసి ఉంచాలట.

దీని వల్ల ఫలంలో ఎక్కువగా తేమ ఉండకుండా బ్యాక్టీరియా పెరగకుండా ఉంటుంది. అయితే నిపుణుల ప్రకారం పుచ్చకాయను కోసిన వెంటనే 2-3 గంటలలోపే తినేయడం ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. పుచ్చకాయను పూర్తిగా తినలేకపోతే దానిని జ్యూస్ చేసుకుని తాగడం ఉత్తమం. అలాగే పుచ్చకాయ ముక్కలను వడగట్టి నిల్వ చేసుకోవచ్చు. కానీ ఫ్రిజ్‌ లో ఉంచి మరుసటి రోజు తినడం వల్ల దాని పోషకాలు తగ్గిపోతాయట. అందుకే తాజా పుచ్చకాయను తినడమే ఉత్తమమైన ఎంపిక అని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • fridge
  • health tips
  • watermelon
  • Watermelon Benefits

Related News

Coconut Water

ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగితే ఏమ‌వుతుంది?

కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం వంటి సహజ ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో నీరు, ఖనిజాల సమతుల్యతను కాపాడతాయి.

  • Onion

    పచ్చి ఉల్లిపాయను ఎవరు తినకూడదు?

  • Healthy Lifestyle Tips

    ఆయుర్వేదం కొత్త జీవితాన్ని ఎలా ఇవ్వగలదు?

  • Motion Sickness

    Vomiting Tips: ప్రయాణ సమయంలో వాంతులు అవుతున్నాయా? మీ కోసం చిట్కాలు

Latest News

  • Allu Arjun Birthday : హ్యాపీ బర్త్ డే బావా అంటూ అల్లు అర్జున్ కు జూ. ఎన్టీఆర్ విషెష్

  • Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ను కర్మయోగి తో పోల్చిన డైరెక్టర్

  • Peddi Vs Lenin : ఒకేసారి బరిలోకి చరణ్ – అఖిల్ ..?

  • Jagan Padayatra 2.0 : జూలై నుంచే జగన్ పాదయాత్ర..

  • Raaka First Look : అల్లు అర్జున్ ‘రాకా’ ఫస్ట్ లుక్ పై విపరీతమైన ట్రోల్స్

Trending News

    • డ‌బ్బు లేక ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • టీమిండియా ఆట‌గాళ్ల మ‌ధ్య పోరు పెట్టిన ఐసీసీ!

    • షాకింగ్ రిపోర్ట్‌.. భార‌త్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!

    • ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక.. మారిన పరిస్థితులు!

    • ఈ దేశంలో డేలైట్ సేవింగ్ టైమ్.. నిద్ర కోసం గంట టైమ్ వెన‌క్కి!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd