Samosa: సమోసాలను తెగ ఇష్టంగా తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?
మనలో చాలామందికి సమోసా పేరు వింటే చాలు నోట్లో నీళ్లు ఊడిపోతూ ఉంటాయి. సమోసా కనపడగానే వెంటనే తెగ ఇష్టపడి తినేస్తూ ఉంటారు. ఎక్కువగా ఈవెనింగ్ స్నాక్స్ సమయంలో టీ కాఫీలతో పాటు సమోసాని కూడా తింటూ ఉంటారు.
- By Anshu Published Date - 04:30 PM, Sat - 20 July 24

మనలో చాలామందికి సమోసా పేరు వింటే చాలు నోట్లో నీళ్లు ఊడిపోతూ ఉంటాయి. సమోసా కనపడగానే వెంటనే తెగ ఇష్టపడి తినేస్తూ ఉంటారు. ఎక్కువగా ఈవెనింగ్ స్నాక్స్ సమయంలో టీ కాఫీలతో పాటు సమోసాని కూడా తింటూ ఉంటారు. సమోసాలు కూడా రకరకాల సమోసాలు లభిస్తూ ఉంటాయి. టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయని లొట్టలు వేసుకుని మరీ తినేస్తూ ఉంటారు. అయితే అవి ఆ క్షణం బాగానే అనిపించిన ఆ తర్వాత మీకు అనేక రకాల ఆరోగ్య సమస్యలను తెచ్చిపడతాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
మరి సమోసాలు తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సమోసాలను పదేపదే యూస్ చేసిన ఆయిల్ లో ఎక్కువసేపు డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు. దాంతో వీటిలో కొవ్వు కంటెట్ ఎక్కువగా ఉంటుంది. నూనె ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. క్రమంగా ఇది గుండె సంబంధిత సమస్యలకు దారి తీయవచ్చు. డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఐటమ్స్ ను తినడం వల్ల హార్ట్ పేషెంట్లకు విషం లాంటిదే. ఎక్కువ జంక్ ఫుడ్ లేదా వేయించిన ఆహారాన్ని తినడం వల్ల గుండె సిరల్లో కొలెస్ట్రాల్ బాగా పేరుకుపోతుంది. ఇది సిరలలో అడ్డంకిని కలిగిస్తుంది.
అలాగే గుండెపోటు ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. సమోసాలను విపరీతంగా తినడం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. సమోసాలను మైదా పిండితో తయారు చేస్తారు. ఇవి అనేక రకాల అనారోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి. సమోసాలు ఎక్కువగా తినడం వల్ల కడుపుకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి. బయట ఫుడ్ ను ఇంట్లో తయారుచేసినట్టు నీట్ గా తయారు చేసేవారు చాలా తక్కువ మందే ఉంటారు. ఏవేవో ముట్టుకుని తినే ఆహారాలను తయారు చేస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల ఆహారంలో క్రిములు, బ్యాక్టీరియా చేరి ఫుడ్ పాయిజనింగ్ వంటి సమస్యలను కలిగిస్తాయి.