HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Health
  • >Health Problems In Watermelon

Health Problems: ఆ సమయంలో పుచ్చకాయను తింటున్నారా.. అయితే జాగ్రత్త!

పుచ్చకాయ వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరు

  • Author : Anshu Date : 11-01-2024 - 8:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mixcollage 11 Jan 2024 06 45 Pm 7120
Mixcollage 11 Jan 2024 06 45 Pm 7120

పుచ్చకాయ వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ పండును ఇష్టపడి తింటూ ఉంటారు. పుచ్చకాయలో 90 శాతం నీరు ఉంటుంది. అంతే కాకుండా ఈ కాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే ఈ పుచ్చకాయలు ఎక్కువగా వేసవిలో కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడ చూసినా కూడా విరివిగా లభిస్తూ ఉంటాయి. కానీ ఈ మధ్యకాలంలో అన్ని సీజన్ లలో ఈ పుచ్చకాయలు మనకు లభిస్తున్నాయి. పుచ్చకాయ డీ హైడ్రేషన్ రాకుండా చేయడమే కాకుండా మనిషికి అవసరమైన శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లను, విటమిన్లను అందిస్తుంది.

అందుకే పుచ్చకాయ వేసవిలో అద్భుతమైన ఫ్రూట్ అంటారు. సహజసిద్దమైన యాంటీ ఆక్సిడెంట్లకు పుచ్చకాయ ప్రసిద్ధి. ఇందులో లైకోపీన్, ఆస్కార్బిక్ యాసిడ్, సిట్రిలిన్ పుష్కలంగా ఉంటాయి. వీటివల్ల గుండెపోటు, కేన్సర్ వంటి క్రానిక్ వ్యాధుల్నించి కూడా రక్షించుకోవచ్చు. పుచ్చకాయను ఎలా తీసుకున్నా ఫరవాలేదు. నేరుగా తినవచ్చు లేదా జూస్ చేసుకుని తాగవచ్చు. లేదా ఇతర పండ్లు కీరా, మామిడి, కేరట్, ఆరెంజ్‌తో కలిపి కూడా తీసుకోవచ్చు. అయితే పుచ్చకాయను తినడం మంచిదే కానీ రాత్రి సమయంలో పుచ్చకాయను తినడం అంత మంచిది కాదు అంటున్నారు వైద్యులు. మరి రాత్రి పూట పుచ్చకాయను తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పుచ్చకాయ ఆరోగ్యానికి మంచిదే కదా అని ఎక్కువగా తింటే మాత్రం గ్యాస్, డయేరియా లేదా కడుపులో ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. ఫ్రక్టోజ్ అనేది మోనోశాకరైడ్ లేదా సాధారణ చక్కెర, దీని అధిక వినియోగం పొట్ట‌లో ఉబ్బరం కలిగిస్తుంది. అలాగే పుచ్చకాయ అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారం. దీని క్రమరహిత వినియోగం రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతుంది. డ‌యాబెటిస్ ఉన్న వారు ఎక్కువ‌గా తీసుకోకుడ‌దు. అలాగే పుచ్చకాయ ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల‌న చర్మం యొక్క రంగు మారుతుంది. దీన్ని లైకోపెనీమియా అని పిలుస్తారు. ఇది ఒక రకమైన కెరోటినిమియా.

లైకోపీన్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం పిగ్మెంటేషన్‌లో మార్పులు వస్తాయి. కాగా పుచ్చ‌కాయ‌ తినడానికి చాలా రుచిగా ఉంటుంది. కానీ ఇందులో చాలా సహజమైన చక్కెర ఉంటుంది. షుగర్ కంటెంట్ అధికంగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారని నిపుణులు అంటున్నారు. అయితే రాత్రిపూట జీర్ణవ్యవస్థ నెమ్మదిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ సమస్య వస్తుంది. అందుకే డే టైంలో తీసుకుంటే ఏం కాద‌ని నైట్ టైంలో మాత్రం అస్స‌లు తీసుకోకూడ‌దదు. అలాగే కొందరికి రాత్రి సమయంలో పుచ్చకాయని తింటే తొందరగా జలుబు చేస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి సమస్యలు ఉన్నవారు కూడా ఈ పుచ్చకాయను తినకపోవడమే మంచిది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • eating Watermelon
  • health problems
  • night
  • watermelon
  • Watermelon Benefits

Related News

Are you gaining weight due to thyroid issues? Then do this immediately—you won't gain any weight at all!

Thyroid: థైరాయిడ్ వల్ల బరువు పెరుగుతున్నారా? అయితే వెంటనే ఇలా చేయండి.. అస్సలు బరువు పెరగరు!

ప్రస్తుత రోజుల్లో చాలామంది ఇబ్బంది పడుతున్న సమస్యలలో థైరాయిడ్ సమస్య కూడా ఒకటి. ప్రతి పదిమందిలో నలుగురు ఈ థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. థైరాయిడ్ సమస్యతో బాధపడే వారిలో ముఖ్యంగా కనిపించే ప్రధాన లక్షణం అధిక బరువు. థైరాయిడ్ సమస్యతో బాధపడే వాళ్ళు చాలామంది అధిక బరువు సమస్యతో కూడా బాధపడుతూ ఉంటారు. ఈ థైరాయిడ్ సమస్య కారణంగా విపరీతంగా బరువు పెరగడం వల్ల ఇతర అనార

  • Do this to sleep soundly at night!

    Sleep: రాత్రిపూట హాయిగా నిద్రపోవాలంటే ఇలా చేయండి!

Latest News

  • Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీని అందుకే ఆడించలేదా?

  • Relationship: ఇలా మీ పార్ట్‌నర్‌తో కలిసి బిగికౌగిట్లో నిద్రపోతే చాలు, డాక్టర్ అవసరం లేదు…!!

  • Us-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య దాడులు నిలిపివేయాలని ఒప్పందం

  • Calcium Deficiency: కాల్షియం లోపిస్తే… ఏమవుతుందో తెలుసా?

  • NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్​మెంట్​కు టైమ్ ఫిక్స్​

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd